Suryaa.co.in

Andhra Pradesh

గూడూరు DSP ముందు చూపుతో జాతీయ రహదారిపై తప్పిన ట్రాఫిక్ ముప్పు

-ఆదిశంకరా కాలేజీ వద్ద ఇంక మీదట వరద ముప్పుతో వచ్చే ట్రాఫిక్ కష్టాలుకు చెక్ పడినట్లే
-గూడూరు అదిశంకర కాలేజి వద్ద నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిని తాత్కాలికంగా వాడుకునే విధంగా 4 రోజుల క్రితమే దగ్గరుండి సిద్దం చేయించిన గూడూరు DSP M.రాజగోపాల్ రెడ్డి
-నూతన బ్రిడ్జిని తాత్కాలికంగా సిద్దం చేయకపోతే మళ్ళీ జాతీయ రహదారిపై వాహన రాకపోకలు జరిగేవి కావు
గత 10రోజుల క్రితం వచ్చిన వరదల కారణంగా గూడూరు సమీపంలోని అదిశంకర కాలేజి వద్ద వరద నీరు రోడ్డు పైకి రావడంతో చెన్నై to కలకత్తా జాతీయ రహదారిపై కిలోమీటర్లు మేర వాహనాలు ఆగిపోయి వాహనదారులు రెండు రోజుల పాటు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు,పోలీసులు యంత్రాంగం అంతా మూడురోజులు పాటు ట్రాఫిక్ నియత్రణకు శ్రమించారు.
ఈ విషయాన్ని దృష్టిలో వుంచుకుని గూడూరు DSP M.రాజగోపాల్ రెడ్డి ముందుచూపుతో అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునే విధంగా నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్ద తాత్కాలికంగా గ్రావెల్ తోలించి ఉపయోగానికి సిద్దంగా ఉంచాలని బ్రిడ్జి నిర్మాణ దారులను ఆదేశించి మూడు రోజుల క్రితమే బ్రిడ్జిని రాకపోకలకు సిద్దం చేసి వుంచారు.లేకపోతే నిన్నటి నుండి వస్తున్న వరద నీటి కారణంగా అదిశంకర కాలేజి వద్ద వాహనాలు వెళ్ళే పరిస్థితి లేకుండా మళ్ళీ జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్య తో ప్రజలు అల్లాడిపోయేవారు.
ముందు చూపుతో వ్యవహరించిన గూడూరు DSP M.రాజగోపాల్ రెడ్డి ట్రాఫిక్ సమస్యను రాకుండా అడ్డుకో గలిగారు,దీంతో ప్రజలు గూడూరు DSP M.రాజగోపాల్ రెడ్డి పనితీరుని ముందు చూపుని మెచ్చుకుంటున్నారు…DSP M.రాజగోపాల్ రెడ్డి కి సహకారం అందిస్తున్న గూడూరు రూరల్ CI శ్రీనివాసులు రెడ్డి,పోలీసు సిబ్బంది పనితీరుతో ఆదిశంకరా కాలేజీ వద్ద ఇంక మీదట వరద ముప్పుతో ట్రాఫిక్ కష్టాలుకు చెక్ పడినట్లే..

LEAVE A RESPONSE