Suryaa.co.in

Andhra Pradesh

ఏపీ డీజీపీపై బదిలీ వేటు

– ఈసీపై ఫలించిన కూటమి ఒత్తిళ్లు

ఊహించిందే జరిగింది. ఆలస్యమైనప్పటికీ ఏపీ డీజీపీ రాజేంద్రనాధ్‌రెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకూ వేటు వేసింది. ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన వైనం అధికార వైసీపీకి షాక్ నిచ్చింది. డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిపై బదిలీ వేటు పడింది. ఎన్నికల వేళ విధులు సవ్యంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఈసీ బదిలీ వేటు వేసింది.

విధుల నుంచి తక్షణమే రిలీవ్ అవ్వాలని ఆదేశించింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎలాంటి ఎన్నికల విధులు ఆయనకు అప్పగించొద్దని ఈసీ స్పష్టం చేసింది. వెంటనే ఆయన కిందిస్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించి రిలీవ్ కావాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.

సోమవారం ఉదయం 11 గంటల లోపు కొత్త డీజీపీని నియమించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకోసం ముగ్గురు డీజీ ర్యాంకు పేర్లను పంపించాలని ప్రభుత్వానికి సూచించింది.

 

LEAVE A RESPONSE