Home » నవ మాఫియాలే జగన్ రెడ్డి నవరత్నాలు

నవ మాఫియాలే జగన్ రెడ్డి నవరత్నాలు

-పదవి కోసం ఎంతకైనా తెగించే దుర్మార్గుడు జగన్
-పాపాపు సొమ్ముతో పెద్దిరెడ్డికి కొవ్వెక్కింది
-పెద్దిరెడ్డి, ఆయన తమ్ముడు, కొడుకు ముగ్గురు కలిసి చిత్తూరు జిల్లాను దోచేశారు
-పెద్దిరెడ్డిని మంత్రిని చేసింది దోపిడీ చేయడానికా?
-కూటమి ప్రభుత్వం వస్తే ఆగేది సంక్షేమ పథకాలు కాదు..ఆగేది మీ భాధలు, జగన్ దోపిడీ
-జగన్ కి రోషం ఉంటే లాండ్ టైటిలింగ్ యాక్టును బేషరతుగా రద్దు చేయాలి
-తంబళ్లపల్లెకు అగ్రీ ప్రాసెసింగ్ యూనిట్లు తీసుకొస్తాం
– తంబళ్లపల్లె ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

తంబళ్లపల్లె: రాజంపేట ఎంపీ అభ్యర్ధి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని, తంబళ్లపల్లె ఎమ్మెల్యే అభ్యర్ధి జయచంద్రారెడ్డిని గెలిపించాలి. ఈ నియోజకవర్గంలో ముసురుకాపు కులస్తులు ఎక్కువగా ఉన్నారు. అందుకే ఆ కులాలనికి చెందిన జయచంద్రారెడ్డికి ఇక్కడ టికెట్ ఇచ్చాం. ఎన్టీఏ ఎంపీగా పోటీ చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డిని తాకే ధైర్యం ఎవరికైనా ఉందా? కిరణ్ కుమార్ రెడ్డికి అనుభవం ఉంది. కిరణ్ కుమారెడ్డి ముందు పాపాల పెద్దిరెడ్డి బచ్చా. పాపాపు సొమ్ముతో, నడమంత్రపు సిరితో పెద్దిరెడ్డికి కొవ్వెక్కింది. ఆంబోతు మాదిరి తయారయ్యాడు. ఈ రోజు నిండు గర్భిణీ మా ఊరికి నీరు కావాలని అడిగితే..ఆమెపై పెద్దిరెడ్డి గూండాలు దాడి చేశారు. ఆ అమ్మాయి త్రాగునీరు అడగటమే చేసిన పాపామా? మన ఎమ్మెల్యే అభ్యర్ధి జయచంద్రారెడ్డి ఆ నిండు గర్భిణీని ఆసుపత్రికి తీసుకెళ్లి చేర్పించే పరిస్థితి వచ్చిందంటే మీరే అర్ధం చేసుకోవాలి. నిండి గర్భిణీపై దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు. దేవుడు స్క్రిప్టు రాసేశాడు. గెలిచేది మనమే. చిత్తుచిత్తుగా ఓడిపోయేది వైసీపీ.

పెద్దిరెడ్డి, ఆయన తమ్ముడు, కొడుకు ముగ్గురు కలిసి తంబళ్లపల్లెను దోచేశారు
తంబళ్లపల్లెలో 600 మంది తెలుగు తమ్ముళ్లపై అక్రమ కేసులుపెట్టారు. పాలిచ్చే ఆవును వదులుకుని తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు. అనుభవిస్తున్నాం. నేను 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశాను, కిరణ్ కుమర్ రెడ్డి మూడున్నరరేళ్లు ముఖ్యమంత్రిగా చేశారు. జగన్ రెడ్డి, పాపాల పెద్దిరెడ్డి లు హుందాతనం మాదగ్గర చూసి నేర్చుకోవాలి. నేను తలచుకుని ఉంటే పెద్దిరెడ్డి పుంగనూరులో తిరిగేవాడా? నువ్వు పెద్ద మొనగాడివా? నీ కొమ్ములు విరుస్తా.

ఈ రాష్ట్రం నీ బాబు జాగీరా? తంబళ్లపల్లె నీ తాతా జాగీరా? నువ్వు పుంగనూరులో ఎమ్మెల్యే అయ్యి మంత్రి కావాలి. నీ తమ్ముడు వలసపక్షి ఇక్కడ తంబళ్లపల్లికి రావాలి. నీ కొడుకు ఎంపీ కావాలి. ముగ్గురు కలిసి దోచేయాలి. అడిగితే దాడులు చేస్తారా? హంద్రీనీవా కాలువ ఉన్నా గండికోట నుంచి సమాంతరంగా కాలువ తీస్తున్నాడు పెద్దిరెడ్డి. హంద్రీనీవాను ఎండబెట్టాలని కుట్ర పన్నాడు. ఇదే దారిలో నేను పూతలపట్టుకు వెళుతుంటే..అంగళ్లులో దాడి చేశారు. 45ఏళ్లుగా అంగళ్లుకు వస్తున్నా. అంగళ్లుకు వస్తూనే ఉంటా..అడ్డం వస్తే సైకిల్ తో తొక్కిచ్చుకుంటూ పోతా. తమాషా పడొద్దు. పెద్ద పెద్ద కుటుంబాలు ఇక్కడ రాజకీయాలు చేశారు. నల్లారి, కలిచెర్ల, గట్టు ప్యామిలీలతో పోల్చుకుంటే నువ్వెంత? తమ్ముళ్లు మీరు బానిసలుగా బ్రతకాలనుకుంటున్నారా? మీ భవిష్యత్తును అందకారం చేయాలని చేశారు.

14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన నాపై దాడి చేస్తే..మీరు ఊరుకుంటారా? ఈ బడుగు, బలహీన వర్గాల జనాలు ఈ దుర్మార్గుల చేతుల్లో బలైపోవాల్సిందేనా? 7 నెలల గర్భిణీ నీళ్లు అడిగితే దాడి చేస్తావా? నీ ఆంబోతుల చేతుల్లో నా ఆడబిడ్డ్లులు బలైపోవాలా? ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయనిర్ణేతలు ప్రజలే. 7 రోజులే సమయం ఉంది. అందుకే హలో తంబళ్లపల్లె..బాయ్ బాయ్ ద్వారకానాధ్ రెడ్డి. హలో తంబళ్లపల్లి…సిద్దమా? రోషమున్న తమ్ముళ్లు మీసం మెలెయ్యండి. మీ జోలికి మేం రాము అని చెప్పండి..మా జోలికి వస్తే వదిలిపటెట్టం అని చెప్పండి. తంబళ్లపల్లిలో జయచంద్రారెడ్డి గెలుస్తున్నాడు…ఆంబోతును తరిమి తరిమి కొడుతాడు.

పెద్దిరెడ్డిని మంత్రిని చేసింది దోపిడీ చేయడానికా?
పెద్దిరెడ్డికి మంత్రి పదవి ఇచ్చింది టీడీపీ వాళ్లపైన అక్రమ కేసులు పెట్టడానికే. కాంట్రాక్టులు ఈయనకే కావాలి. కిరణ్ కుమార్ రెడ్డి ఏనాడు కాంట్రాక్టు పనులు చేయలేదు. 22 ఏళ్లు ముఖ్యమంత్రులుగా చేసిన కుటుంబం నాది. 45 ఏళ్లు రాజకీయాలు చేసిన కుటుంబం. ఏనాడు ఒక్క కాంట్రాక్టు చేయలేదు. ఎర్రచందనం మాఫియాతో ఎర్రచందనం దొంగతనం చేసిన వారికి సీట్లు ఇవ్వడానికి జగన్ రెడ్డి. సిగ్గుందా అని అడుగుతున్నా? ఇసుక, మైనింగ్ ఇలా ఏది దొరికితే అది దోపిడీ చేశారు. జిల్లాలో ఒక్క క్వారీ అయిన ప్రజల చేతుల్లో ఉందా అని అడుగుతున్నా? మంత్రిని చేసింది దోపిడీ చేయడానికా?

ఆవులపల్లి రిజర్వాయర్ లో పేదల భూములును ఉన్నపళంగా లాక్కున్నారు. భూములు అక్రమంగా లాక్కుని ప్రాజెక్టులు కడుతారా?. ప్రజల భూములు తీసుకోవాలంటే నష్టపరిహారం చెల్లించాలి. ఆర్ అండ్ ఆర్ ఇవ్వాలి. కోర్టులకు వెళ్లాలి. ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాత భూములు తీసుకోవాలి. ఇష్టానుసారం చేస్తే కుదరదు. ఆవులపల్లి రిజర్వాయర్ లో పెద్దిరెడ్డి అక్రమాలపై విచారణ చేసిన ఎన్జీటీ రూ.100 కోట్లు ఫైన్ వేశారు. సిగ్గులేని ప్రభుత్వం రూ.25 కోట్లు కట్టింది. నేను వస్తా…అందరికీ వడ్డీతో సహా చెల్లిస్తా…ఎక్కడున్న పట్టకొస్తా…నీ అరచకాలన్నీ చిత్రగుప్తుడిలా లెక్కగడుతున్నా..ప్రతీ లెక్క సెటిల్ చేస్తా.

పాపాల పెద్దిరెడ్డి, సైకో జగన్ రెడ్డికి చాలా దగ్గర. దోపిడీలో ఇద్దరు భాగస్వాములు. సాండ్, మద్యం, మైనింగ్, భూములు, మంగపేట బైరటీస్..చివరకు నా కుప్పంలోని గ్రానైట్ పై కూడా వీరి కన్నుపడింది. కొండల్ని అనకొండల మాదిరి మింగేశారు. వీరిని శిక్షించాలా లేదా? డెయిరీలో పాలు పోయించుకుని డబ్బులు ఇవ్వడం లేదు. పెద్దిరెడ్డి మక్కెలు ఇరగొట్టి పాలు పోసిన రైతులకు డబ్బులు ఇప్పిస్తా. మద్యం రేట్లు ప్రశ్నించాడని ఓం ప్రతాప్ ని చంపేశారు. ఆయన ఫోన్ కూడా దొరక్కుండా చేశారు. మీ కోసం నేను పోరాడుతా. నా శరీరంలో చీము, రక్తం ఉంది. నా తమ్ముళ్లు పడిన మానసిక క్షోభ జీవితంలో మరిచిపోను.

నవ మాఫియాలే జగన్ రెడ్డి నవరత్నాలు
జగన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేసి ఇప్పుడు కొత్త నాటకాలతో వస్తున్నాడు. కూటమి సూపర్ సిక్ప్ మేనిఫెస్టోతో వస్తోంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మూడు గ్యారెంటీలు ఇచ్చాడు. ఈ రెండు చూసిన తర్వాత సైకో జగన్ రెడ్డికి నిద్ర రావడం లేదు. మీటింగులు రద్దు చేసుకున్నాడు. ఈరోజు కూడా రద్దు చేసుకున్నాడు. మన మీటింగుల్లో ప్రజలు కళకళలాడుతున్నారు. జగన్ రెడ్డి మేనిఫెస్టో వెలవెలబోయింది. జగన్ రెడ్డి నవరత్నాలు..ఒకటి ఇసుక మాఫియా, రెండోది మద్యం మాఫియా, మూడోది భూమాఫియా, నాలుగో రత్నం మైనింగ్ మాఫియా, ఐదో రత్నం హత్యా రాజకీయాలు, ఆరో ప్రజల ఆస్తుల కబ్జా, ఏడో రత్నం ఎర్ర చందనం స్మగ్లింగ్, ఎనిమిదో రత్నం దాడులు, కేసులు, తొమ్మిదో రత్నం శవరాజకీయాలు. అన్ని అయిపోయినాయి.

2014 లో తండ్రిలేని బిడ్డ అంటూ వచ్చాడు, 2019 లో బాబాయిని గొడ్డలితో చంపేసి వచ్చాడు, కోడికత్తి డ్రామా రక్తికట్టించాడు. నిన్న గులకరాయి డ్రామా ఆడాడు. రాయి కనపడలేదు..దెబ్బ మాత్రం తగిలింది. ఆయన సొంత చెల్లే జగన్ రెడ్డి మానసిక స్థితి బాగులేదని చెప్పింది. అందుకే ఆమె ఒక అద్దం పంపుతాను..అద్దంలో ముఖం చూసుకో..నీ ముఖం కనిపిస్తుందా? లేదా చంద్రబాబు ముఖం కనిపిస్తుందా చూసుకో అని సొంత చెల్లే అద్దం పంపింది. ఇలాంటి వాడికి ముఖ్యమంత్రిగా ఉండే అర్హత ఉందా. నేను, రాజశేఖర్ రెడ్డిలు సమఉజ్జీలం. మిత్రులం. రాజకీయంగా పోరాడాం తప్ప ఏనాడు వ్యక్తిగతంగా పోరాడలేదు.. అలాంటిది జనగ్ రెడ్డి నాపై సవాల్ విసురుతున్నాడు. జగన్ రెడ్డి నీ రాజకీయ అనుభవం ఎంత? నీ వయసు ఎంత? జగన్ రెడ్డి ప్రస్ట్రేషన్ పీక్ కు చేరింది. ఓడిపోయే పరిస్థితి వచ్చింది. చేసిన పాపాలకు కోర్టుల్లో శిక్షపడే పరిస్థితి వచ్చింది.

పదవి కోసం ఎంతపనికైనా తెగించే దుర్మార్గుడు జగన్
నేను వస్తే సంక్షేమ కార్యక్రమాలు తీస్తానా తమ్ముళ్లు. జగన్ రెడ్డి నాపై దుష్ప్రచారం చేస్తున్నాడు. నేను నీతిగా రాజకీయాలు చేశా. జగన్ రెడ్డిలా అప్పులు చేసి సంక్షేమం చేయలేదు. ఆదాయం సృష్టించి పేదలకు పంచా. జగన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమం కంటే ఎక్కువే ఇచ్చాం. ఇస్తాం. కేంద్రం కూడా మాతో ఉంది. కేంద్రం కూడా సహకరిస్తుంది. రూ.2 లకు కిలో బియ్యం పెట్టింది ఎన్టీఆర్. నేను వంద సంక్షేమ కార్యక్రమాలు పెట్టాను. అన్నక్యాంటీన్లు, చంద్రన్న భీమా, రంజాతోఫా, దుల్హన్ లాంటి సంక్షేమ పథకాలు పెట్టాను. రైతు రుణమాఫీ చేశాను. నాటకాల రాయుడు జగన్ రెడ్డి మాటలు నమ్మొద్దు. ఫించన్లు మూడు వేల నుంచి రూ.4 వేలు ఇస్తాం. ఇంటి వద్దకే ఇస్తాం. ఏప్రిల్ నెల నుంచే ఇస్తాం. దివ్యాంగులకు రూ. 6 వేలు ఇస్తాం. కాళ్లు, చేతులు లేని వారికి రూ.15000 ఇస్తాం.

నేను ఫింఛన్లు పెంచితే..జగన్ రెడ్డి పెంచలేదు. రూ.250 పెంచడానికి 2028 వరకు వేచి చూడాలంట. సిగ్గు ఉండే ముఖ్యమంత్రి అయితే శవారాజకీయాలు చేయరాదు. 1.50 వేల మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు. ఒక్కొక్కరు 40 మందికి ఫింఛన్లు ఇస్తే..ఒక్కరోజులో ఇవ్వొచ్చు. కానీ, జగన్ రెడ్డి వృద్ధులను ఇబ్బంది పెట్టి పండుటాకులను 33 మందిని చంపేశారు. భాధేస్తుంది. సి.ఎస్ కు లేఖ రాస్తే..స్పందించలేదు. ఎన్నికల సంఘం పింఛన్లు సక్రమంగా ఇవ్వాలని చెబితే..ఈసారి బ్యాంకుల్లో జమ చేశారు. ముసలివారు బ్యాంకులకు పోగలరా? 5 కి.మీ నడవగలరా? ఈసారి మరో 20 మందిని చంపేశారు. పదవి కోసం ఎంతపనికైనా తెగించే దుర్మార్గుడు జగన్. మరలా కూటమి అధికారంలోకి వస్తానే పింఛన్ ఇంటివద్దకే ఇస్తాం.

కూటమి ప్రభుత్వం వస్తే ఆగేది సంక్షేమ పథకాలు కాదు..ఆగేది మీ భాధలు, జగన్ దోపిడీ
వాలంటీర్లను పెట్టుకుని వారితో రాజకీయం చేసి ఓట్లు వేయించుకోవాలని చూశాడు. అది కుదరలేదు. ఫెయిల్ అయిపోయాడు. వారిని రాజీనామాలు చేయమంటే..నేను చేయొద్దని చెప్పాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తానే వారికి రూ.10 వేల గౌరవవేతనం ఇస్తాం. స్వార్ధపరుడు సైకో జగన్. కూటమి వస్తే ఏదీ ఆగదు. జగన్ రెడ్డి ఆదాయం ఆగిపోతుంది. కరెంటు బాదుడు ఆగిపోతుంది. ఇసుక మాఫియా అక్రమాలు ఆగిపోతాయ్, పన్నుల, ధరలు ఆగిపోతాయ్. ఎర్రచందనం స్మగ్లింగ్ ఆగిపోతుంది. గంజాయి, డ్రగ్స్ ఆగిపోతాయి. వంద రోజుల్లో గంజాయి, డ్రగ్స్ ను అరికట్టే బాధ్యత మాది. ఫైనల్ గా జగన్ ఫ్యాను మే13 తర్వాత ఆగిపోతుంది.

జగన్ రెడ్డి క్లాస్ వార్ అంటున్నాడు. ఇది క్లాస్ వార్ కాదు..క్యాష్ వార్. పేదల నుంచి బందిపోటు దోచేసిన డబ్బులను మరలా పేదవారికే పంచుతా. పేదలను ఆదుకుంటా. నేను ఇచ్చేవాడినే కాని.. కొట్టేసే వాడిని కాదని పిట్టల దొర అంటున్నాడు. ఇడుపులపాయలో దళితుల భూములు 600 ఎకరాలు కొట్టేశాడు. లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతో 8,000 ఎకరాలు, కడపలో బ్రాహ్మణి స్టీల్ పేరుతో 10 వేల ఎకరాలు కొట్టేశాడు. వాన్ పిక్ సిటీ పేరుతో 28 వేల ఎకరాలకు టెండర్ పెట్టాడు. విశాఖలో కార్తికవనం, ఎన్‌సీసీ భూములు, ప్రేమ సమాజం, బేపార్కు, దసపల్లా, హయగ్రీవా భూములు.. 40 వేల కోట్ల విలువ గల ఆస్తులను కొట్టేసిన పెద్దమనిషి ఈ జగన్ రెడ్డి. ఇప్పుడు మీ భూములపై కన్నుపడింది. మీ తాతలు సంపాదించిన భూమి మీదా? ఆయనదా? ఈ భూమి పత్రాలపై ఫోటో ఎవరిది? జగనన్న భూహక్కు పత్రం అంటున్నాడు. మా భూములపై నీ పెత్తనం ఏంటని జగన్ రెడ్డిని అడగాలి. జగన్ రెడ్డి దరిద్రపు ముఖాన్ని పట్టాదారు పాస్ పుస్తకంపై చూడాలా? ఇది న్యాయమా? ఐదేళ్లు ముఖ్యమంత్రిని చేస్తే.. ప్రజల ఆస్తులకు ట్రస్టీగా ఉండాలా లేదా? ఒక నియంతగా ఇష్టానుసారం వ్యవహరిస్తే సరిపోతుందా? ఇలాంటి పాస్ పుస్తకాలను ఏం చేద్దాం. చించి చెత్తబుట్టలో పడేయాలా లేదా? చింపుదామా?…చిత్తు చిత్తుగా చేసి చెత్తబుట్టలో పడేద్దాం. ఒక దుర్మార్గుడిని తుదముట్టించడానికి మేం పొత్తు పెట్టుకున్నామని ఈరోజు అమిత్ షా చాలా స్పష్టంగా చెప్పాడు. అవినీతి ప్రభుత్వాన్ని గద్దెదించడానికి, రాష్ట్రాన్ని మరలా బ్రతికించడానికి పొత్తు పెట్టుకున్నామని చెప్పాడు.

జగన్ లాండ్ గ్రాబింగ్ యాక్టు అని ఒక చెత్త చట్టం తీసుకొచ్చాడు. ఈ చట్టం వస్తే మీ భూమి మీది కాదు. ఒక ప్రైవేటు కంపెనీని పెట్టాడు. 10/1 ఉండదు. అడంగల్ లేదు. పట్టాదారుపాస్ పుస్తకాలు ఉండవు. జగన్ అన్న వద్దే మీ పాస్ పుస్తకాలు ఉంటాయి. ఆయనే మీ ఇంటి పెద్ద అంట. మీ భూములు మీరు అమ్ముకోవాలంటే జగనన్న పర్మిషన్ కావాలి. అగ్రిమెంట్ రాసుకోవాలంటే ఆయన పర్మిషన్ కావాలి. సహిస్తారా మీరా? మీ భూమి నాదని ఎవరైనా అడిగితే..అది వివాదంలోకి నెట్టి కొట్టేస్తారు. పనికిమాలిన వాడికి ఓటేస్తే..ఇలానే ఉంటుంది. ఇలాంటి వారికి పాలించే అర్హత ఉందా? వైసీపీ నాయకుల భూములు కూడా జగన్ వద్దే ఉంటాయని గుర్తుపెట్టుకోండి. జగన్ ఆడమంటే ఆడాలా? ఆయన రాసివ్వమంటే రాసివ్వాలా? మీ మెడలకు ఉరితాళ్లు వేసి రిమోట్ కంట్రోల్ జగన్ వద్ద పెట్టుకుంటున్నాడు.

జగన్ కి రోషం ఉంటే లాండ్ టైటిలింగ్ యాక్టును భేషరతుగా రద్దు చేయాలి
ఆయన సొంత ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్యాయాన్ని ప్రశ్నిస్తే..అక్రమ కేసులు పెట్టి పోలీస్ కస్టడీలో కొడుతుంటే జగన్ రెడ్డి చూసి ఆనందపడ్డాడు. దీన్ని మీరేమంటారు? వివేకం సినిమా చూశారా? ఆ సినిమా చూసిన జగన్ రెడ్డి సిగ్గు ఉంటే బయటకు రాడు. సిగ్గు యగ్గు అన్నీ వదిలిపెట్టిన వాడే బయటకు వస్తాడు. జగన్ రెడ్డి లాండ్ గ్రాబింగ్ యాక్టును ఏం చేద్దాం. నేను వస్తానే రెండో సంతకం ఈ చట్టం రద్దుపైనే పెడుతా. అంతవరకు దీన్ని చించి చెత్తబుట్టలో పడేద్దాం. ఇప్పటికైనా జగన్ కి రోషం ఉంటే భేషరతుగా రద్దు చేసుకుంటానని చెప్పాలి. రాజకీయం అంటే తమాషా కాదు. అది ఒక జవాబుదారీతనం. ప్రజల ఆస్తులపై జగన్ రెడ్డి బోడిపెత్తనం చెల్లదు. ఎన్టీఆర్ పోటో ఎక్కడో పెట్టారని దానికి దీనికి సరిపోల్చి మాట్లాడటం కూడా చేతగాని బొత్స సత్యనారాయణ అంటున్నాడు. బుద్ధిలేదు. ఆస్తులు కొట్టేయాలని చూస్తున్న మీకు ఎన్టీఆర్ కు పోలికా?

తంబళ్లపల్లెకు అగ్రీ ప్రాసెసింగ్ యూనిట్లు తీసుకొస్తాం
తంబళ్లపల్లెలో అనేక సమస్యలు ఉన్నాయి. హంద్రీ-నీవా నీళ్లు తీసుకొచ్చి అన్ని చెరువులకు నింపి నీళ్లు ఇచ్చే బాధ్యత నాది. సాగునీరు వస్తే రైతులకు పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది. బంగారం పండించే రైతులు ఇక్కడ ఉన్నారు. మల్బరీ పట్టు, కూరగాయలు, పండ్లు, పూలు పండించే రైతులు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ టమోటా రైతుల కోసం అగ్రీ ప్రాసెసింగ్ యూనిట్లు తీసుకొస్తాం. పల్ప్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ ఇండస్ట్రీయల్ పార్కులు తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. యువగళం ద్వారా ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం.

నాశిరకం మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తున్నాడు జగన్. జే-బ్రాండ్ ఒక క్వాటర్ త్రాగితే కికెక్కదు. రెండో క్వాటర్ త్రాగితే..జేబీ ఖాళీ. నాడు రూ.60 ఉన్న క్వాటర్ బాటిల్ నేడు రూ.200 చేశాడు. మద్యం రేట్లు పెంచాలని నాకు, నా మిత్రుడు కిరణ్ కుమార్ రెడ్డిలకు ఆలోచన రాలేదు. మరలా మరలా అంగళ్లకు వస్తా..రౌడీయిజం అణిచివేస్తా..ఆంబోతులను తొక్కేస్తా.. ప్రగతికి బాటలేస్తాం…ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. సంపద సృష్టిస్తాం..మీ ఆదాయం పెంచుతాం. అందరూ జయచంద్రారెడ్డికి, కిరణ్ కుమార్ రెడ్డిలకు ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి. రాజంపేట అభివృద్ధి కిరణ్ కుమార్ రెడ్డితోనే సాధ్యం. మీ ఓటుతో పెద్దిరెడ్డి కుటుంబ పెత్తనాన్ని భూస్థాపితం చేయాలి.

Leave a Reply