Home » మూడు రాజధానుల పేరుతో అమరావతి నాశనం

మూడు రాజధానుల పేరుతో అమరావతి నాశనం

-వచ్చేది ఎన్డీయేనే…ప్రధాని మళ్లీ మోదీనే…
-రాష్ట్రంలో ధర్మాన్ని గెలిపించేందుకు అంతా సిద్ధమవ్వాలి
-కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం
-పోలవరం పూర్తి చేసి హంద్రీనీవాతో అనంతపురంలో ప్రతి ఎకరాకు నీళ్లిస్తాం
-పోలవరం పూర్తిపై ప్రధాని మోదీ, కేంద్రంమంత్రి అమిత్‌ షా హామీ ఇచ్చారు
-మన భూములపై హక్కు లేకుండా చేయాలని జగన్‌ కుట్ర
-భూమి అమ్ముకోవాలన్నా జగన్‌ అనుమతి కావాలంట
-ధర్మవరం ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు

రాష్ట్రంలో, దేశంలో వచ్చేది ఎన్డీయే ప్రభుత్వమేనని..మళ్లీ ప్రధానిగా మోదీ వస్తారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ధర్మాన్ని గెలిపించేందుకు అంతా సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. ఆదివారం ధర్మవరం ప్రజాగళం సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో కలిపి పాల్గొన్నా రు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ ధర్మవరం ప్రజలను చూస్తుంటే ఎండలే భయపడు తున్నాయి. కూటమి కార్యకర్తలతో ధర్మవరం దద్ధరిల్లింది. ప్రజలు అభివృద్ధి దిశగా అడుగులు వేసి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. దుర్మార్గుడు జగన్‌రెడ్డిని శాశ్వతంగా ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు.

మూడు రాజధానుల పేరుతో అమరావతి నాశనం
జగన్‌ రెడ్డి మూడు రాజధానుల పేరుతో అమరావతిని విధ్వంసం చేశాడు. మూడు ముక్కలాటతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు. ఎన్నికల తర్వాత కేంద్ర సాహకారంతో అమరావతిని రాజధానిగా చేసి రాష్ట్రాన్ని నెంబర్‌ వన్‌గా నిలబెట్టే బాధ్యత నాది. అమరావతిని అభివృద్ధి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుం ది. అమిత్‌ షా కూడా తాము అమరావతికి కట్టుబడి ఉన్నామని స్పష్టంగా చెప్పారు. మన ఆశలను చంపిన దుర్మార్గుడు ఈ జగన్‌ రెడ్డి. మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పదేళ్ల తర్వాత కూడా మన రాజధాని ఏదో చెప్పుకోలేం.

పోలవరాన్ని విధ్వంసం చేశారు
పోలవరాన్ని పూర్తి చేసేందుకు ప్రధానమంత్రి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు అమిత్‌ షా కూడా చెప్పారు. అవినీతికి పాల్పడి జగన్‌ పోలవరంను నాశనం చేశారు. అధికారంలోకి వచ్చాక పోలవరాన్ని పూర్తి చేస్తాం. హంద్రీ-నీవా పూర్తిచేసి అనంతపురంలో ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే బాద్యత మాది. హంద్రీ-నీవా, గొల్లపల్లి రిజర్వాయర్‌ పూర్తి చేయడం వల్ల కియా మోటర్స్‌ వచ్చింది. ప్రతి ఎకరాకు నీళ్లిచ్చి ఉంటే అనంతపురం బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగేది. పోలవరం ప్రాజెక్టును గోదావరిలో కలిపేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్‌ రెడ్డి.

ప్రాజెక్టుల పూర్తికి రూపాయి అయినా ఖర్చు చేశారా?
గత ఐదేళ్లలో సీమతో పాటు అనంతపురంలో ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశారా? ప్రాజెక్టులపై రూపాయి అయినా ఖర్చు చేశారా? కీలకమైన సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ అటకెక్కించారు. మన ప్రభుత్వం రాగానే నదులు అనుసంధానం పూర్తి చేస్తాం. ప్రజాగళం పేరుతో మేనిఫెస్టో తెచ్చాం…అంతక ముందు సూపర్‌ సిక్స్‌ ప్రకటించాం. ఇందులోని హామీలు ప్రజలకు ఉపయోగపడతాయి. టీడీపీ హయాంలో డ్వాక్రా సంఘాలు పెట్టాం. మహిళలను మరింత అభివృద్ధి చేసేందుకు నరేంద్ర మోదీ ‘మోదీ గ్యారంటీ’ తెచ్చారు. రాష్ట్రంలో మహిళల అభివృద్ధి కోసం చాలా కార్యక్రమాలు తీసుకొచ్చాం. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు రావాలనే కల త్వరలోనే నెరవేరబోతోంది. మహాశక్తి కార్యక్రమంతో ఇంట్లో ఎంతమంది ఉన్నా ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తాం. తల్లికి వందనం ద్వారా చదువుకునే ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు…ఇద్దరుంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు ఇచ్చి ప్రతి బిడ్డనూ చదివించే బాధ్యత తీసుకుంటాం. ‘దీపం’ పథకం కింద మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం.

పెట్టుబడులన్నీ తరిమేశారు
వైసీపీ ప్రభుత్వం పరిశ్రమలన్నీ తరిమేసింది. ఐదేళ్లుగా ఒక్క డీఎస్సీ లేదు. అధికారంలోకి రాగానే మొదటి సంతకం మెగా డీఎస్సీపైనే పెడతాం. సంవత్సరానికి 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పి స్తాం. ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు ఇచ్చే బాధ్యత నాది. నిర్వీర్యమైన యువత భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దుతా. రాష్ట్ల్రంలో యువత ఉద్యోగాల కోసం వేరే రాష్ట్రానికి వెళ్లే అవసరం ఇకరాదు.

అనంతపురంను హార్టికల్చర్‌ హబ్‌గా మార్చుతాం
కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏటా రూ.6 వేలు సాయం చేస్తోంది. రాష్ట్రంలో రైతులకు ఈ ప్రభుత్వంలో గిట్టుబాటు ధర రాలేదు. జగన్మోహన్‌ రెడ్డి రూ.12,500 ఇస్తానని హామీ ఇచ్చి రూ.7,500కు కుదించారు. కేంద్రం ఇచ్చే డబ్బులను కూడా ఇవ్వకుండా రైతులను మోసం చేశారు. కేంద్రం ఇచ్చే డబ్బులు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కలిపి రూ.20 వేలు ఇచ్చే బాధ్యత నాది. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. బిందు సేద్యం, తుంపర సేద్యం మళ్లీ తీసుకొస్తాం. 90 శాతం సబ్సిడీతో అనంతపురాన్ని హార్టికల్చర్‌ హబ్‌గా తీర్చిదిద్దుతా.

రాజకీయ లబ్ధికోసం వృద్ధుల ఉసురుతీసుకుంటున్నారు
వృద్ధులు, దివ్యాంగులకు మొట్టమొదటి సారిగా పెన్షన్‌ ఇచ్చింది ఎన్టీఆర్‌. 2014లో రూ.200 పింఛన్‌ను రూ.2 వేలు చేసింది టీడీపీనే. మన ప్రభుత్వం రాగానే నెలకు రూ.4 వేల పెన్షన్‌ ఇస్తాం. పెంచిన పెన్షన్‌ను ఏప్రిల్‌, మే, జూన్‌ నెలకు కలిపి అందిస్తాం. దివ్యాంగులకు రూ.6 వేలకు పెంచి ఇస్తాం. అవయవాలు కోల్పోయిన వారికి రూ.15 వేలు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఈ సైకో జగన్‌ రాజకీయ లబ్ధి కోసం శవరాజకీయాలు చేస్తున్నారు. పండుటాకులను పొట్టన పెట్టుకుంటన్నాడు. సచివాలయ ఉద్యోగులతో ఇంటిం టికీ పింఛన్‌ అందించవచ్చు…కానీ రాజకీయ లబ్ధి కోసం 33 మంది వృద్దులను పొట్టన పెట్టుకున్నాడు. శవ రాజకీయాలు చేసే ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాలి.

ఏకపక్షంగా ఎన్డీయే గెలుపు
2014లో తండ్రి చావును అడ్డుపెట్టుకుని ఓట్లు అడగడానికి వచ్చాడు. 2019లో బాబాయి హత్యను అడ్డుపె ట్టుకుని ఓట్లు అడిగాడు. ‘హూ కిల్డ్‌ బాబాయ్‌’ అని జగన్‌ రెడ్డిని అడుగుతున్నా. బాధితులనే నిందితులుగా చేరుస్తున్నారు. వివేకా హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్న సునీతను అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నా రు. గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామా ఆడారు. తర్వాత గులకరాయి డ్రామా ఆడారు. ఇప్పుడు వృద్ధులను చంపేసి శవ రాజకీయాలు చేస్తున్నారు. రానున్న వారం రోజులు చాలా ముఖ్యం. ఈ వారంలో ఓడిపోతామని జగన్‌ రెడ్డికి అర్థమైంది. సర్వేలన్నీ ఏకపక్షంగా ఎన్డీయే కూటమికి అనుకూలంగా వస్తున్నాయి.

రాష్ట్రానికి పట్టిన శని మే 13తో విరగడ
రాష్ట్రానికి పట్టిన శని మే 13తో విరగడైపోతుంది. క్లాస్‌ వార్‌ అంటున్న జగన్‌ రెడ్డి…క్యాష్‌ వార్‌ గురించి చెప్పాలి. రాష్ట్ర సంపద మొత్తాన్ని జగన్‌ రెడ్డి అండ్‌ కో దోచేశారు. రాష్ట్రంలో అతిపెద్ద స్కామ్‌ లిక్కర్‌ స్కామ్‌. గత ప్రభుత్వంలో క్వార్టర్‌ లిక్కర్‌ ధర రూ.60 ఉంటే నేడు రూ.200లకు అమ్ముతున్నారు. ఒక్కో క్వార్టర్‌పై రూ.140 తాడేపల్లి ప్యాలెస్‌కు పోతోంది. ఏపీలో అమ్మే మద్యం జగ్గూ భాయ్‌ మద్యం. తయారీ, సరఫరా, హోల్‌ సేల్‌ అమ్మకం, షాపుల్లో అమ్మకం మొత్తం జే గ్యాంగ్‌ చేస్తోంది. ఈ అమ్మకాల వ్యవహారంలో ఆన్‌లైన్‌ పేమెంట్లు లేకుండా చేశారు. రోడ్లపై చిన్నచిన్న బడ్డీ కొట్లలో ఆన్‌లైన్‌ పేమెంట్లు పెడుతుంటే…రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాల్లో ఆన్‌లైన్‌ తీసేసి కేవలం క్యాష్‌ మాత్రమే ఎందుకు తీసుకుంటోంది? జగన్‌ రెడ్డి సమాధా నం చెప్పాలి. ఎందుకంటే మద్యంపై కమీషన్‌ ప్రతిరోజు తాడేపల్లి కొంపకు వెళుతోంది.

నువ్వు భూములు ఇచ్చేవాడివి కాదు…దోచేవాడివే
గత పాలనలో ట్రాక్టర్‌ ఇసుక వెయ్యి రూపాయలకు ఇస్తే…నేడు రూ.5 వేలు చేసి దోచుకుంటున్నారు. మేం అధికారంలోకి వచ్చాక ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొస్తాం. ఇసుకపై రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛనిస్తాను. లేపాక్షి భూములను జగన్‌ రెడ్డి దోచేయాలని చూస్తున్నాడు. ఇడుపులపాయలో భూములను కొట్టేశారు. రాష్ట్ర ప్రజల భూములపై జగన్‌ రెడ్డి పెత్తనం ఏంటో అర్థం కావడం లేదు? ప్రజల ఆస్తులకు సంబంధించిన పట్టాదారు పుస్తకాలపై జగన్‌ బొమ్మలేంటి? ఈ భూములు ప్రజలకు జగన్‌ ఇచ్చాడా? వాళ్ల నాన్న ఇచ్చాడా? వాళ్ల తాత ఇచ్చాడా? వాళ్ల నానమ్మ ఇచ్చిందా? వాళ్ల అమ్మమ్మ ఇచ్చిందా? మరి అతని ఫొటోలు మన ఆస్తులపై ఏంటి? మన ఆస్తులపై తన ఫొటో చూసి ప్రజలు భయపడాలా? లేక జగన్‌ రెడ్డి ఫొటో చూడగానే గొడ్డలి గుర్తుకు రావాలా?

మన ఆస్తుల అమ్మకానికి జగన్‌ అనుమతి కావాలా?
మన ఆస్తులు మనం అమ్ముకోవాలంటే జగన్‌ రెడ్డి అనుమతి కావాలంట. మన ఆస్తులకు సంబంధించిన ఒరిజినల్‌ డాక్యుమెంట్లు తన దగ్గర పెట్టుకుని మనకు జెరాక్స్‌ కాపీలు ఇస్తామని చెబుతున్నారు. ఈ జెరాక్స్‌ కాపీ ఎందుకు పనికొస్తుంది? మూతి తుడుచుకోవడానికి తప్ప? మనల్ని జగన్‌రెడ్డి బానిసలు అనుకుం టున్నాడు. రానున్న ఎన్నికల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క దెబ్బ కొడితే జగన్‌ రెడ్డి గూబ గుయ్‌ అనాలి. మనం ఏమీ చేయలేమనే చిన్న చూపుతో మన ఆస్తులకే టెండర్‌ పెట్టాలని చూస్తున్నాడు. సైకో జగన్‌ను వచ్చే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిరచి వైసీపీని, జగన్‌ను భూస్థాపితం చేస్తామని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరిస్తున్నా. చేనేత కార్మికులు ధర్మవరంలో అధికంగా ఉన్నారు. ఇప్పటికే బీసీ డిక్లరేషన్‌ ఇచ్చాం. బీసీలకు ఐదేళ్లలో రూ.1.50 లక్షల కోట్లు ఖర్చుపెడతాం. ఆదరణ పథకం కింద సంవత్సరానికి రూ.5 వేల కోట్లు ఖర్చుపెడతాం. స్వయం ఉపాధికి సంవత్సరానికి రూ.10 వేల కోట్లు ఖర్చుపెడతాం. టీడీపీకి వెనుకబడిన వర్గాలే కంచుకోట. ధర్మవరం ప్రజలు టీడీపీని ఆదరించారు. చేనేత పరిశ్రమను ప్రోత్సహించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. మీరు జీఎస్టీ కడితే తిరిగి ఇప్పించే బాధ్యతను నేను తీసుకుంటాను. చేనేత కార్మికులకు సంవత్సరానికి రూ.24 వేలు మీ అకౌంట్లలోకి వేస్తాం. పవర్‌ లూమ్‌లకు 500 యూనిట్ల విద్యుత్‌, హ్యాండ్‌ లూమ్‌కు 200 యూనిట్లు కరెంటును ఉచితంగా అందిస్తాం. నాయీ బ్రాహ్మణులకు ఆదాయం బాగుండే దేవాలయాల్లో కనీస వేతనం రూ.25 వేలు ఇప్పిస్తాం, షాపులకు 200 యూనిట్లు కరెంటు ఉచితంగా అందిస్తాం.

గుడ్‌ మార్నింగ్‌ ఎమ్మెల్యేకు…గుడ్‌ నైట్‌ చెప్పాలి
ఎస్సీల్లో ఏబీసీడీ కేటగిరీని జిల్లాల వారీగా తీసుకొస్తాం. అనంతపురం పార్లమెంటు అభ్యర్థి పార్థసారథిని, ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్‌ యాదవ్‌ను గెలిపించాలి. ధర్మవరానికి ఏం కావాలో చేస్తామని అమిత్‌ షా ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ధర్మవరాన్ని అభివృద్ధి చేస్తాం. ధర్మవరంలో కేతిరెడ్డి… గుడ్‌ మార్నింగ్‌ రెడ్డి ఉన్నాడు..ఇతనికి ధర్మవరం ప్రజలు శాశ్వతంగా గుడ్‌ నైట్‌ చెప్పాలి. గుర్రం మీద స్వారీలు చేస్తాడు, భూములన్నీ సర్వే చేస్తాడు…ఆ తర్వాతి రోజు ఆ భూములన్నిటినీ మింగేస్తాడు. ఎర్రగుట్టను మింగేసిన అనకొండ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. గుప్త నిధుల కోసం అమ్మవారి ఆలయాన్ని పడగొట్టిన దుర్మార్గు డు కేతిరెడ్డి.

సోలార్‌ కంపెనీల వద్ద మామూళ్లు వసూలు చేశాడు. ఉప్పలపాడు రీచ్‌ నుంచి లక్షల విలువ చేసే ఇసుకను బెంగళూరుకు తరలించి అమ్ముకుంటున్నాడు. పరిటాల శ్రీరామ్‌ మీ అందరి కోసం పని చేస్తున్నాడు… పొత్తులో భాగంగా బీజేపీ నుంచి సత్యకుమార్‌ యాదవ్‌కు త్యాగం చేసిన వ్యక్తి శ్రీరామ్‌ను గుర్తపెట్టుకుంటా…తగిన గుర్తింపునిస్తాం. రాజకీయంగా పైకి తీసుకొస్తా. ఆ బాధ్యతను నేను చూసుకుంటా. పార్టీని అభిమానించే వాళ్లంతా సత్యకుమార్‌ యాదవ్‌కు ఓటు వేయాలి..కమలం గుర్తుపై ఓటు వేయాలని కోరుతున్నాను. సత్యకుమార్‌ యాదవ్‌ గెలిస్తే ఇది మూడు పార్టీల విజయం అవుతుంది.

ధర్మవరానికి ఈ హామీలు ఇస్తున్నా
చేనేత కార్మికులకు కామన్‌ వర్క్‌ షెడ్లు ఏర్పాటు చేస్తాం. పెండిరగ్‌లో ఉన్న టిడ్కో ఇళ్లను పూర్తిచేసి లబ్ధిదా రులకు అందిస్తాం. జిల్లేడుపల్లి ప్రాజెక్టు నిర్వాసితలకు పరిహారం చెల్లిస్తాం. చిత్రావతి నదికి ఆనుకుని ఉన్న పొలాల్లో అక్రమంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలను అరికడతాం. రాబోయే రోజులన్నీ మంచి రోజులే… మంచి శకునాలే..గెలుపు మనదే…ప్రమాణ స్వీకారానికి ముహూర్తం పెట్టుకోవడమే తరువాయి.

వైసీపీ విముక్త రాష్ట్రం కావాలి
రానున్న వారంరోజులు ఏమరుపాటుగా ఉండొద్దు..జగన్‌ రెడ్డి మాయ వేషాల్లో వస్తాడు. దౌర్జన్యాలు, కుట్రలు, కుతంత్రాలు చేస్తాడు. రేపో, ఎల్లుండో ఏం చేస్తాడో మన ఊహకు అందడం లేదు. జగన్‌ రెడ్డి గులకరాయి డ్రామాను మీరంతా చూశారు. అప్పకటిప్పుడు కరెంటు పోవడం, గులకరాయి తగిలి మాయమైపోవడం..5 నిమిషాల్లో ప్లకార్డులు రావడం, హత్యాయత్నం జరిగిందని డ్రామాలాడడం. జగన్‌ రెడ్డికి కోపం వస్తే గతంలో తన ఇంట్లో టీవీలు పగిలేవి..నేడు తన ఫ్రస్టేషన్‌కు ఇంట్లో ఏం పగులుతాయో అర్థం కాని పరిస్థితి. మీరే ఊహించుకోండి. మానసిక పరిస్థితి అర్థం కాని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుందో మీరే ఊహించుకోవాలి. రాష్ట్రంలో వైసీపీని ఇంటికి పంపాలి…వైసీపీ విముక్త రాష్ట్రంగా ఏపీని తయారు చేయాలి. మీ అందరి భవిష్యత్తును జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది అని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Leave a Reply