తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఎన్టీఆర్ కు నివాళి

Spread the love

స్వర్గీయ నందమూరి తారక రామారావు 26వ వర్ధంతి సందర్బంగా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాలను నిర్వహించడమైంది.

కింజరాపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు : – ఎన్టీఆర్ 26వ వర్ధంతి జరుపుకుంటున్న ప్రతి ఒక్క తెలుగు వాడికి ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్టీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ. 1982కు ముందు దేశ, రాష్ట్ర రాజకీయాలు ఘోరంగా ఉండేవి. అప్పటికే ఎన్టీఆర్ సినిమాల ద్వారా ప్రజల హృదయాల్లో గూడు కట్టుకున్నారు. నాటి రాజకీయ పరిస్థితులు, ఢిల్లీ నడి వీధుల్లో తెలుగు
Screenshot-2022-01-18-172920 వారు అవమానపాలవ్వడం చూసి చలించిపోయి తట్టుకోలేక తెలుగు వాడి ఆత్మగౌరవం కాపాడేందుకు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. టీడీపీ పుట్టిన తరువాత పుట్టిన యువకులకు తెలుగుదేశం పార్టీ గొప్పతనం తెలియదు. వాళ్ల ఇంట్లో ఉన్న పెద్ద వాళ్లను అడిగి తెలుసుకోండి అసలు టీడీపీ వచ్చిన తరువాత రాష్ట్రం ఎంత బాగుపడిందో వాళ్లే చెబుతారు. ఎన్టీఆర్ రాజకీయాలకు రాకముందు రాష్ట్రంలో హరిజన, గిరిజన, బడుగు, బలహీన వర్గాలంటే కేవలం ఓటు బ్యాంకు యంత్రాలు మాత్రమే. కాని ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తరాత వారందరిని సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా ఆదుకున్నారు.

రాష్ట్రంలో ఎంతో మంది బడుగు బలహీన వర్గాలను రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. టీడీపీ అంటే వెనకబడి వర్గాలు రాజకీయాల్లోకి వచ్చేందుకు ఒక ప్లాట్ ఫాం వంటిది. ఈ ఏడాది మే 28 నాటికి ఎన్టీఆర్ పుట్టి 100 ఏళ్లు పూర్తి అవుతుంది. ఆయన చనిపోయిన తరువాత ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయారు. నాడు కాంగ్రెస్ పార్టీ వెనకబడి వర్గాలను అణచివేస్తున్న తరుణంలో నేషనల్ ఫ్రంట్ పెట్టి జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ నుండే సంక్షేమం అనే పదం పుట్టింది. తెలుగుదేశం పార్టీ నుండే కూడు – గూడు – పీడ అందాయి. నాడు దేశంలోనే మొట్ట మొదటి సారిగా రూ.35 పెన్షన్ అందించిన మహనీయుడు ఎన్టీఆర్. టీడీపీలో ఉండటమే ప్రతి ఒక్క తెలుగు వాడికి గర్వకారణం. ప్రతి ఇంటికి పసుపు అంటే శుభసూచకం. అలాగే రాష్ట్రానికి కూడా శుభం కలగాలని తెలుగుదేశం పార్టీకి పసుపు జెండాను ఎంచుకున్నారు. దేశ, విదేశాల్లోని తెలుగు వారందరికి చంద్రబాబు నాయుడు గౌరవం తెచ్చిపెట్టారు. నేడు జగన్ రెడ్డిని ప్రజలు నమ్మి మోసపోయారు. కరోనా కంటే అతి పెద్ద వైరస్ జగన్ రెడ్డి రూపంలో రాష్ట్రానికి పట్టుకుంది. నేడు యువకులు, మేథావులు ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది. రాష్ట్రం బాగు కోరుకునే ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీకి కలిసిరావాలని కోరుకుంటున్నాం. తేలిక పాటి లక్షణాలతో చంద్రబాబు నాయుడు గారు కరోనా భారిన పడ్దారు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రజల ఆశీస్సులతో కోలుకొని త్వరలోనే మన ముందుకు వస్తారు.

పర్చూరి అశోక్ బాబు, ఎమ్మెల్సీ :- రాష్ట్రంలో 40 ఏళ్ల నుండి ప్రజాస్వామ్యం నిలబడేలా పోరాడుతున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాతే ప్రపంచానికి తెలుగు వారంటే తెలిసింది. నాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ రూపంలో వేసిన మొక్క నేడు మహావృక్షమై ఎందరికే రాజకీయ ఓనుమాలు నేర్పింది. అందిరికి నీడనిస్తుంది. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమైన పునాది. ఎన్టీఆర్ కు నివాళి అంటే మాటల్లో కాదు చేతల్లో చూపించాల్సిన అవసరం ఉంది. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న జగన్ రెడ్డి మెడలు వంచి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకోవాలి.

టి.డి. జనార్ధన్, పొలిట్ బ్యూరో సభ్యులు : – ఎన్టీఆర్ అంటే దూరదృష్టి. అందుకే పక్కా ఇళ్లకు శ్రీకారం చుట్టారు. యువకులందరిని రాజకీయాల్లోకి తెచ్చారు. నాడు సోషలిజం, కమ్యునిజం, క్యాప్టిలిజం ఉన్న రోజుల్లో మీది ఏ ఇజమని విలేకర్లు ఎన్టీఆర్ ను ప్రశ్నిస్తే మాది హ్యుమనిజమని చెప్పిన గొప్ప వ్యక్తి. పేదవాడికి పట్టెడన్నం పెట్టడమే మానవతావాదమన్నారు. రాజకీయాలు అంటే టీడీపీకి ముందు తరువాత అని చెప్పాలి. నేడు రాష్ట్రం ప్రమాదంలో ఉంది. పేదోడు అల్లాడిపోతున్నాడు. యువత కదం తొక్కి జగన్ రెడ్డి చేస్తున్న వికృత విధానాలకు చరమగీతం పాడాల్సిన తరుణం ఆసన్నమైంది.
కొమ్మారెడ్డి పట్టాభి, జాతీయ అధికార ప్రతినిధి: – ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వాడి ఆత్మ గౌరవాన్ని చాటిక ఏకైక వ్యక్తి స్వర్గీయ నందమూరి తారకరామారావు. తెలుగుదేశం పార్టీ స్థాపనతోనే దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించారు. జాతీయ రాజకీయాల్లో పెను మార్పులు తెచ్చారు. ఏకస్వామ్య పాలన నుంచి సంకీర్ణ పాలనకు శ్రీకారం చుట్టారు.

మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, తెలుగు రైతు అధ్యక్షులు :- ఎన్టీఆర్ మన మధ్య లేకపోయినా ఇప్పటికి ఆ పేరు వినబడిన మన మధ్యలో ఉన్నారన్న స్పురణ మదిలో మెదులుతుంది. 40 ఏళ్ల క్రితం అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టిన కేంద్రం రాష్ట్రాల హక్కులకు విఘాతం కలిగించి ఫెడరల్ స్పూర్తిని దెబ్బ తీసినప్పుడు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. రైతాంగానికి పెద్ద పీట వేశారు. ఎన్నో ప్రాజెక్టులను చేపట్టారు. ఎత్తిపోతలను పూర్తి చేసి సకాలంలో పొలాలకు నీరందించి రైతుల కళ్లల్లో ఆనందం కలిగించారు. ఆయనను స్మరించుకోవడం అంటే అవన్ని గుర్తి చేసుకోవడమే అవుతుంది.

పిల్లి మాణిక్యరావు, తెలుగుదేశం పార్టీ అధికారప్రతినిధి :- రాజకీయాల్లో విప్లవాన్ని రాజేసిన వ్యక్తి ఎన్టీఆర్. సామ్రాజ్యవాద రాజకీయాలో పెను మార్పు తీసుకువచ్చారు. రాజకీయం అంటే సామ్రాజ్యవాదం కాదు ప్రజాస్వామ్యం అని చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్. దళితులు మూడు పూటల తిండి, పక్కా ఇళ్లు అందించి దళితుల పాటి దీనబంధువుగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్. తెలుగువారు అవమానపాలైయ్యే స్థాయి నుంచి ఆత్మగౌరవంతో తలెత్తుకునే స్థాయి కోసం పోరాడిన వ్యక్తి ఎన్టీఆర్.
ఈ కార్యక్రమంలో ఏ.వి. రమణ, సయ్యద్ రఫీ, బుచ్చి రాంప్రసాద్, దారపనేని నరేంద్ర, బ్రహ్మం చౌదరి, దేవతోటి నాగరాజు, వల్లూరి కుమార స్వామి, హజీ హసన్ భాషా, బండారు వంశీ, ఎస్.పి. సాహెబ్, తదితరలు పాల్గొన్నారు.

Leave a Reply