Suryaa.co.in

Andhra Pradesh

విజయవాడలో ఎర్రన్నాయుడు వర్ధంతిని ఘనంగా నిర్వహించిన టీడీపీ

మాజీ కేంద్రమంత్రి దివంగత కింజరపు ఎర్రన్నాయుుడు 12వ వర్ధంతి కార్యక్రమాన్ని విజయవాడ ఆటోనగర్ లోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి నెట్టెం రఘురాం ఆధ్వర్యంలో నిర్వహించారు. తొలుత ఎర్రన్నాయుుడు చిత్రపటానికి జిల్లా అధ్యక్షులు నెట్టెం రఘురాం, రాష్ట్ర బీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తి పూలవూలవేసి ఘనంగా నివాళులర్పించారు.

ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాం మాట్లాడుతూ… ఎర్రన్నాయుడు నాకు మంచి మిత్రుడు, మేమిద్దం కూడా చాలా సంవత్సరాలు మొట్టమొదట పార్టీ పెట్టినప్పటి నుండి ఎమ్మెల్యేలుగా, ఆ తరువాత నేను మంత్రి, ఆయన ఎంపీ, కేంద్ర మంత్రిగా ఎన్నో సంవత్సరాలు అనేకమైనటువంటి కమిటీల్లో సభ్యులుగా సన్నిహితులుగా మేము పనిచేయటం జరిగిందన్నారు.

తెలుగుదేశం పార్టీకి ఎర్రన్నాయుడు నిజంగా లేకపోవటం చాలా పెద్ద లోటు, ఎందుకంటే అంత గొప్ప పాత్రని పార్టీ యొక్క అభివృద్ధికి ఆయన నిర్వహిచంటం జరిగింది. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో మిత్రులందరం నివాళులర్పించాము. ఎప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ రాజకీయ రంగంలో ఉన్నంత కాలం ఆయన పార్టీకి చేసినటువంటి సేవ అనేది ఎప్పటికీ గుర్తుంటుంది, అనేకమైన అభివృద్ధికర కార్యక్రమాలు ఆయన కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగా కొన్ని వేల గ్రామాలకు ఆయన మంచినీటి సౌకర్యాన్ని, రోడ్ల సౌకర్యాన్ని కల్పించటం జరిగింది. ఆయన మరణం పార్టీకి తీరని లోటని, నేడు ఆయన సేవలను స్మరించుకుంటూ నివాళులర్పించామని తెలిపారు.

రాష్ట్ర బీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తి మాట్లాడుతూ పార్లమెంట్ సభ్యునిగా, కేంద్ర వుంత్రిగా, పొలిట్‌బ్యూరో సభ్యునిగా రాష్ర్టానికి విశేష సేవలనందించిన కీ॥శే ఎర్రన్నాయుుడుని తెలుగుదేశం పార్టీ నాయుకులు, శ్రేణులు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని అన్నారు. ఎర్రన్నాయుుడు ఉమ్మడి కృష్ణాజిల్లాకు చేసిన సేవలు వురువలేనివని, రాష్ట్రంలో పార్టీకి ఎక్కడ ఇబ్బందులు కలిగినా, ఏ సవుస్య ఎదురైనా ఎర్రన్నాయుుడు అక్కడ ఉండి పరిష్కరించేవారని కొనియూడారు. బీసీల అభ్యున్నతి కోసం ఎర్రన్నాయుడు చేసిన సేవలు మరువరానివని స్మరించారు. ఎర్రన్నాయుుడు పార్టీకి చేసిన సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులర్పిస్తున్నామన్నారు, పార్టీ శ్రేణులు ఎర్రన్నాయుుడు అడుగుజాడల్లో పయణించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి గన్నే ప్రసాద్, కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి, నాయకులు మరుపిళ్ల తిరుమలేష్, కోగంటి రామారావు, శొంటి శివరామ్‌ప్రసాద్ గౌడ్, గొల్లపూడి నాగేశ్వరరావు, కాకు మల్లికార్జున యాదవ్, పొన్నం రవికుమార్, బత్తుల దుర్గారావు, కోడూరు ఆంజనేయవాసు, వీరంకి కుటుంబరావు, గుమ్మడి వెంకటేశ్వరరావు, బెజవాడ నజీర్ మరియు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE