Suryaa.co.in

International National

బంగ్లాదేశ్‌కు త్రిపుర కరెంట్ కట్?

– తక్షణమే 200 కోట్ల బకాయిలు చెల్లించాలని ఆదేశం
– త్రిపుర సీఎం మాణిక్ సాహా వెల్లడి

తన దేశంలో భారత వ్యతిరేకశక్తులను ప్రోత్సహిస్తూ, హిందు, క్రైస్తవ, బౌద్ధులపై దాడులు చేయిస్తున్న బంగ్లాదేశ్‌కు త్రిపుర సీఎం షాక్ ఇచ్చారు. ఆ దేశానికి సరఫరా చేస్తున్న విద్యుత్‌లో ఆటంకాలు లేకుండా ఉండాలంటే తమ బకాయిలు చెల్లించాలని ఆల్టిమేటమ్ ఇచ్చారు.
బంగ్లాదేశ్‌కు 60-70 మెగావాట్ల విద్యుత్తును సరఫరా చేసేందుకు త్రిపుర స్టేట్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ లిమిటెడ్, బంగ్లాదేశ్ పవర్ డెవలప్‌మెంట్ బోర్డు మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. బంగ్లాదేశ్ తమకు 200 కోట్ల రూపాయలు చెల్లించాలని త్రిపుర సీఎం మీడియాకు వెల్లడించారు. ఈ ఒప్పందం లో భాగంగా బంగ్లాదేశ్‌కు త్రిపుర విద్యుత్తును సరఫరా చేస్తోంది. బంగ్లాదేశ్ త్వరలోనే బకాయి సొమ్ము చెల్లిస్తుందని, విద్యుత్ సరఫరా కొనసాగించాలంటే డబ్బులు చెల్లించకతప్పదని, బంగ్లాదేశ్ కి విద్యుత్తు సరఫరాను నిలిపివేయడంపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు.

LEAVE A RESPONSE