Suryaa.co.in

Political News Telangana

నియమించాలి…కాబట్టి నియమించారు…

టి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులను నియమించాలి కాబట్టి నియమించినట్లు వుంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు. కెసిఆర్ కు మొదటి నుండి జిల్లాల పార్టీ నిర్మాణం పై పెద్దగా ఆశక్తి లేదు. ఎవరినేవరినో జిల్లా నాయకులుగా ఫోకస్ చేస్తే వారు రేపటి రోజున తమకు వున్న పదవిని అడ్డం పెట్టుకొని ఇతర పార్టీలతో బేరసారాలు జరిపి పార్టీ ఫిరాయిస్థారు అనే భయం కెసిఆర్ ను వెంటాడుతూ వుంటుంది అదేమంటే మన పార్టీ నిర్మాణం బీఎస్పీ పార్టీ నిర్మాణం తరహాలో వుండాలి అని నాయకులకు ఎప్పుడూ చెబుతూ వుంటాడు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

తాజాగా పూర్తి స్థాయిలో అన్ని జిల్లా అధ్యక్షులను నియముచారు. ఎక్కువ జిల్లాలకు ఎమ్ ఎల్ ఏ.. ఎం పి.. ఎమ్ ఎల్ సి లను జిల్లా అధ్యక్షులుగా నియమిచారు అని గుర్తు చేస్తూ దీని వెనుకాల కెసిఆర్ వ్యూహం ఏమై ఉంటుంది అనే విశ్లేషణ చేస్తున్నారు. ఏం ఎల్ ఏ లు తమ నియోజకవర్గం దాటి బయటకు వెళ్ళలేరు ఎందుకంటే ఇప్పటికే ఎన్నికల వాతావరణం వచ్చేసింది వారు వారి వారి నియోజకవర్గాలను చక్కదిద్దుకోవడానికే సమయం సరిపోదు. అలాంటిది పక్క నియోజకవర్గానికి వెళ్ళి అక్కడి సమస్యలను చక్కదిద్దే సమయం వుండదు పైగా తన నియోజకవర్గంలో పక్క నియోజకవర్గంఎం ఎల్ ఏ వచ్చి వేలు పెడతాను అంటే అగికరించే పరిస్థితి అసలే వుండదు అని అంటున్నారు. ఈ విషయాలు కెసిఆర్ కి తెలియక కాదు అని కూడా వారు అంటున్నారు. కావలనే వ్యూహాత్మకంగా ఏం ఎల్ ఏ లకు జిల్లా అధ్యక్షులుగా నియమించారు అని అంటున్నారు.

ఎందుకంటే ఎవరి నియోజకవర్గానికి వారు పరిమితమైతే చాలు… జిల్లా అధ్యక్షులుగా మీరు చేయాల్సింది ఏమి లేదు అంతా నేను చూసుకుంటాను అని పరోక్షంగా వారికి చెప్పడంమే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎం పి 5ల పరిస్థితి కూడా అంతే రేపటి రోజు వారు మళ్ళీ గెలవాలంటే ఏం ఎల్ ఏ లతో సఖ్యతగా వుండాలి లేదంటే గెలవడం కష్టం కనుక జిల్లా అధ్యక్షులుగా వున్న ఎం పి లు ఎక్కువ తక్కువ జిల్లాలో తిరిగి హడావిడి చెయ్యరు కెసిఆర్ కోరుకునేది కూడా ఇదే జిల్లా అధ్యక్షులు వుండాలి అలాగని వారు యాక్టివిగా వుంటూ జిల్లా అంతా తిరగాలి అని అనుకోకూడదు ఇది కెసిఅర్ వ్యూహం అని అంటున్నారు కొన్ని చోట్ల ఏం ఎల్ సి లను కుడా జిల్లా అధ్యక్షులు గా నియమించారు ఎవరిని నియమిచినా వారు చేసేది ఏమి లేదు జిల్లా అంతా తిరిగి హడావిడి చెయ్యాలనే ఆలోచన కూడా చెయ్యకూడదు అనేది కెసిఆర్ ఆలోచన అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఖాళీగా వున్న వారికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే వారు జిల్లా అంతా తిరిగి అనవసరమైన హడావిడి చేసి సమస్యలు సృష్టిస్తారు అనే భయం తోపాటు భవిష్యత్ లో వారు ఏం ఎల్ ఏ టికెట్ కావలని వత్తిడి తెస్తారు ఇవ్వకపోతే వేరే పార్టీలోకి ఫిరాయిస్తరు అనే భయం కుడా కెసిఆర్ కి వుంది అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

ఇది ఇలా వుంటే పదవులు ఉన్నవారికే మళ్ళీ జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు ఇవ్వడం పై చాలా మంది అసంతృప్తితో ఉన్నారు అని అంటున్నారు మాకు నామినేటెడ్ పదవులు ఇవ్వలేదు కనీసం జిల్లా అధ్యక్ష బాధ్యతలు అయినా ఇస్తారు అనుకున్నాం ఇంత అన్యాయమా అని పెదవులు ఇరుస్తునారు ఇంకా ఈ పార్టిలో మనకి ఏమి ఇవ్వరు మన దారి మనం చూసుకుంటే మంచిది అని కొందరు నాయకులు చర్చించుకుంటున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి అని అంటున్నారు జిల్లా అధ్యక్షుల నియామకం ఎన్నుకల వేళ కెసిఆర్ కి కొత్త తల నొప్పులు తెచ్చేలా వుంది.

-పివి శ్రీనివాస్

LEAVE A RESPONSE