తెరాస రాజ్యసభ అభ్యర్థులు వీరే..

0
159

హైదరాబాద్‌: రాష్ట్రంలో రెండు వేర్వేరు తేదీల్లో జరిగే 3 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు పార్టీ అభ్యర్థులను సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు. నమస్తే తెలంగాణ ఎండీ దీవకొండ దామోదర్‌రావు, డా.బండి పార్థసారథిరెడ్డి, బీసీ నేత, పారిశ్రామిక వేత్త వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి)లను ఎంపిక చేశారు. బండా ప్రకాశ్‌ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి నిర్వహించే ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ వెలువడిన విషయం తెలిసిందే. కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, డి.శ్రీనివాస్‌ల పదవీ విరమణతో ఖాళీ అయ్యే రెండు స్థానాలకు ఈ నెల 24న నోటిఫికేషన్‌ జారీ కానుంది.