చెప్పవే ప్రేమ
చెలిమి చిరునామా..
ఇప్పుడెక్కడ నీ చిరునామా?
ఓ ‘ఉదయ’సమయాన
‘చిత్రం’గా ప్రభాత ‘కిరణ’మై..
ఎవరు ‘ఔనన్నా కాదన్నా’..
తెలుగు సినిమా హీరోకి
ఒక కొత్త లుక్కిచ్చి..
సినిమాకి ఓ రకం కిక్కిచ్చి…
మెగాస్టార్లు..సూపర్ స్టార్లు…
రత్నాలు.. సామ్రాట్టులు
వెలిగిపోతున్న వెండితెరపై
అవతరించిన
ఆధునిక లవర్ బాయ్..!
ఉదయ్..ఇప్పటికీ
అభిమానుల
‘మనసంతా నువ్వే’..
మేం ప్రేమించుకుంటున్నాం..
వి ఆర్ ఇన్ లవ్..
అమాయకంగా కనిపించే
నీలోని ఆ తెగింపు…
నీ సినిమాల మదింపు..
తట్టుకోలేని ముగింపు..
అంతలోనే ఎంత విషాదం..
సినిమా కష్టాలను
అవలీలగా భరించిన
‘నువ్వు..నేను’ ఇక సాగలేనంటూ
జీవితానికి స్వయంగా
పాడుకున్న చరమగీతం..
పెళ్లి విషయంలో
చేదుగా..చెడుగా
పరిణమించిన నీ గతం..
ఎందుకో మతిమాలి
గతి తప్పిన నీ ఇంగితం..
ఇదేనా జీవితంపై
అవగతం..
హీరోవై..జీరోవై..
బ్రతుకు బరువై..
గుండె చెరువై..
నీ కథ ముగిసిన తీరు..
కన్నీరు..మున్నీరు..!
సురేష్ కుమార్ e
9948546286