ఇలాంటి చెత్త సీఎంని భారతదేశంలో ఎన్నడూ చూడలేదు

– మరలా ముఖ్యమంత్రి అయితే, రాష్ట్రవాసులంతా దేశవ్యాప్తంగా వలసపోవాల్సిందే
– మహానాడులో మాజీఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి

ఇలాంటిచెత్త సీఎంని నా రాజకీయజీవితంలో, భారతదేశంలో ఎన్నడూచూడలేదు. మనందరికీ తల్లిఅయిన ఆమెను అసెంబ్లీలో అవమానించిన నాటి నుంచే ఈ ప్రభుత్వ పతనం ఆరంభమైంది.జిల్లాలవిభజన పేరుతో ఈ ముఖ్యమంత్రి ప్రకాశంజిల్లాను నాశనం చేశాడు. ఈ జిల్లావాసుల ఉసురు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి తగిలింది. మేం మీలా పోలీసులతో ప్రభుత్వాన్ని, కార్యక్రమాలను నడపడంలేదు.. మహానాడుకి వచ్చిన లక్షలమంది కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చి, క్రమశిక్షణతో ప్రవర్తించారు.ప్రకాశంజిల్లాకు ఈ ముఖ్యమంత్రి ఒరగబెట్టింది శూన్యం.

కనిగిరి ప్రాంతం వలసలకు కేరాఫ్ గా మారింది. రాష్ట్రాలుదాటి దేశమంతా కనిగిరి వాసులు వెళ్తున్నారంటే అందుకుకారణం ఈ ముఖ్యమంత్రే. ఒక్కసారి ఒక్కసారి అంటే నమ్మి, ముద్దులకు మోసపోయారు. జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి అయితే, రాష్ట్రవాసులంతా దేశవ్యాప్తంగా వలసపోవాల్సిందే.

Leave a Reply