– రెఫరెండం కోరాలనుకుంటే ఉప ఎన్నికలకు వెళ్లొచ్చుగా అచ్చం
– విశాఖ యువకుడు అన్మిష్ సాహస యాత్ర భేష్
-ఖరీఫ్ పంటలకు కనీస మద్దత్తు ధర పెంపు నిర్ణయంతో రైతులకు లబ్ది
– ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయసాయిరెడ్డి
పదోవ తరగతి ఫలితాల మీద కూడా పేలాలు ఏరుకోవడం ఏమిటి పప్పూ ( లోకేష్), జులై 6-15 మధ్య మళ్లీ పరీక్షలు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించినా పిల్లలతో జూమ్ మీటింగ్ పెట్టడం, ‘ఏం కావట్లేదే’ అనే నీ శాడిస్ట్ బుద్ధి కనిపిస్తోందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తేదేపా నేత లోకేష్ పై మండిపడ్డారు. గురువారం ట్విట్టర్ వేదికగా పలు అంశాలు వెల్లడించారు. జూమ్ మీటింగ్ కాస్త రసాబసా కావడంతో మధ్యలోనే పారిపోయాడని,జూమ్ లోకి వస్తేనే మ్యూట్ చేసి పారిపోయాయిన లోకేష్ నేరుగా రమ్మని సవాల్ విసిరడం విడ్డూరంగా ఉందని అన్నారు. రాజకీయ లబ్దికోసం చిన్న పిల్లలతో రాజకీయం చెయ్యడం దిగజారుడు పచ్చ రాజకీయాలకు నిదర్శనమని అన్నారు.
ఇప్పటికే పార్టీ లేదు ఏమీ లేదన్న నీ మాటల దెబ్బకు ఆల్రెడీ టీడీపీ ఆఫీసుకి తాళాలు పడ్డాయని రెఫరెండం కోరాలనుకుంటే టీడీపీ ఎమ్మెల్యేలందరితో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్లొచ్చుకదా అచ్చన్నాయుడు అని సూచించారు..
విశాఖపట్ననికి చెందిన అన్మిష్ వర్మ నార్త్ అమెరికాలోని అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ డెనాలిని అధిరోహించడం అభినందనీయమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అన్మిష్ తన యాత్ర విజయవంతం చేసుకోవడం గర్వంగా ఉందని ఈ విశాఖ యువకుడు భవిష్యత్తులో మరిన్ని పురస్కారాలు అందుకోవాలని, రాష్ట్రానికి మరింత గర్వకారణంగా నిలవాలని అన్నారు.
సురేంద్రనగర్ లో 20 నుంచి 25 అడుగుల లోతున్న ఓ బోరుబావిలో ప్రమాద వశాత్తూ జారిపడ్డ ఓ చిన్నారిని భారత జవాన్లు సురక్షితంగా రక్షించిన సంఘటన భారత సైన్యం యొక్క సేవా పరిధి అనంతరం, అనిర్వచనీయమని చెప్పడానికి ఓ పెద్ద ఉదాహరణ అని అన్నారు. భారత జవాన్లచే రక్షించబడ్డ చిన్నారి ప్రస్తుతం సురక్షితంగా ఉందన్న వార్త మిక్కిలి ఆంనదాన్ని కలిగించిందని అన్నారు.
వివిధ రకాలైన 14 ఖరీఫ్ పంటలు, వరి పంటలకు కనీస మద్దత్తు ధరను 100 రూపాయలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తో రైతుల ఆదాయం పెరగడంతో పాటు వ్యవసాయరంగం సమగ్రాభివృద్ధి చెందుతుందని అన్నారు.