-విలువలు ఉన్న రాజకీయ పార్టీలా ఎప్పుడూ పోరాడలేదు
– ఎఫెక్టివ్ గా…. ఎటాకింగ్ గా ప్రభుత్వ వైఫల్యాలను తూర్పారబట్టాలి
– పార్టీ అధికార ప్రతినిధుల వర్క్ షాప్ లో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఎప్పుడూ అధర్మ యుద్దమేనని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. తప్పుడు ప్రచారాలతో ప్రజలను నమ్మించడమే వైసిపి సిద్దాంతమని చంద్రబాబు అన్నారు. నాడు అధికారం కోసం ఎలా అయితే తప్పుడు అరోపణలు, అసత్య ప్రచారాలు చేశారో ఇప్పుడు కూడా అదే పంథాలో వైసీపీ పనిచేస్తుందని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను మరింత ఎఫెక్టివ్ గా, ఎటాకింగ్ గా తూర్పారబట్టాలని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడానికి, ప్రజా సమస్యలను ప్రస్తావించడానికి మీడియాతో పాటు సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకోవాలని అన్నారు. పార్టీ కార్యాలయంలో అధికార ప్రనినిధులు,
నేతలతో వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ ను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. నిరంతరం అప్డేట్ అవుతూ…. లోతైన కసరత్తు తో పార్టీ అధికార ప్రతినిధులు గళం వినిపించాలని అన్నారు. మీడియాలో మాట్లాడమే కాకుండా ఆయా అంశాలకు ప్రజల నుంచి వస్తున్న స్పందనను కూడా ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు.
సోషల్ మీడియాలో వైసీపీ నిత్యం ఫేక్ పోస్టులతో ఎంత గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నారో కూడా మనం చూస్తేనే ఉన్నాం అని చంద్రబాబు అన్నారు. అన్ని వేదికలపై వైసిపి దురాగతాలను ఎండగట్టాలని చంద్రబాబు సూచించారు. రెండు రోజుల పాటు పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగనున్న ఈ వర్క్ షాప్ లో అధికార ప్రతినిధులు, టీవీ డిబేట్ల లో పాల్గొనే వారు, పార్టీ కి మద్దతుగా సోషల్ మీడియాలో గళం విప్పుతున్న పలువురు సామాన్యులు హాజరయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు పాల్గొన్నారు