Suryaa.co.in

Andhra Pradesh

నిరాటంకంగా సరుకుల పంపిణీ

– ఎమ్మెల్యే కొలికపూడి

విజయవాడ: ఒక పక్క ప్రభుత్వం నష్టపరిహారాన్ని అంచనా వేస్తునే మరోపక్క ఇంటింటికీ నిత్యావసర సరుకుల పంపిణీ కొనసాగిస్తోందని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం విజయవాడ రూరల్‌ మండలం, అంబాపురంలో పర్యటించారు. వృద్ధులను ఆప్యాయంగా పలుకరిస్తూ స్వయంగా తలపై మోసుకుంటూ వెళ్లి సరుకులను పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బాధితులందరికీ వస్తువులు అందేవిధంగా ప్రభుత్వం ఎమ్మెల్యేలను, ఐఏఎస్ స్థాయి అధికారులను నియమించి పర్యవేక్షిస్తోందని తెలిపారు.

LEAVE A RESPONSE