ప్రపంచంలో శాంతిని నెలకొల్పేందుకు ఐక్యరాజ్య సమితి(ఐరాస) ఏర్పాటైంది. అంతర్జాతీయంగా చట్టబద్దత, ఆర్థిక, సామాజిక అభివృద్ధి, మానవ హక్కుల కృషి కోసం ప్రపంచ దేశాలు కలిసి ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ ఇది.
మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఏర్పాటైన నానాజాతి సమితి రెండో ప్రపంచ యుద్ధ నివారణలో విఫలం చెందింది. దీంతో 1945 అక్టోబర్ 24న 193 దేశాలు కలిసి ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేశారు. ఐరాసలో ప్రధానంగా 6 అంగాలున్నాయి.
ఇందులో ప్రవేశించిన అన్ని దేశాలకు సభ్యత్వం ఉండగా.. భద్రతా మండలిలో మాత్రం 15 దేశాలకు మాత్రం సభ్యత్వం ఉంటుంది. 10 దేశాలు రెండేళ్లకొకసారి ఎన్నిక ద్వారా సభ్యత్వం పొందుతాయి. ఐక్యరాజ్య సమితి 1945 అక్టోబరు 24న ఏర్పాటైంది కనుక నాటి నుంచి ఏటా ఈ రోజును ఐక్యరాజ్య సమితి దినోత్సవంగా నిర్వహిస్తున్నారు
ఐక్యరాజ్య సమితి ఆవిర్భావ దశనుంచి ప్రపంచంలోనే అతి పెద్ద సేవా సంస్థ, లయన్స్ అంతర్జాతీయ సంస్థకు సంబంధ బాంధవ్యాలున్నాయి. ఐక్యరాజ్యసమితిలో స్వచ్ఛంధ సంస్థల (NGOs) కు ప్రముఖ పాత్ర వుండేలా చేయడంలో లయన్స్ అంతర్జాతీయ సంస్థ చాలా కృషి చేసింది.
లయన్స్ అంతర్జాతీయ సంస్థ వ్యవస్థాపకులు మెల్విన్ జోన్స్ 1945లో శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన ఐక్యరాజ్యసమితి ప్రారంభ సభ (చార్టర్ కాన్ఫరెన్స్)కు సమితి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు.
ఆ సదస్సులో మెల్విన్ జోన్స్ నిర్వహించిన పాత్ర గణనీయమైంది. ఐక్యరాజ్యసమితిలో కేవలం రాజకీయ యంత్రాంగం మాత్రమే కాకుండా స్వచ్చంద సంస్థలకు కూడా భాగస్వామ్యం కల్పించాలనే అంశాన్ని ఆయన సదస్సులో ప్రతిపాదించారు.
ఐక్యరాజ్యసమితిలో స్వచ్ఛంద సంస్థలకు ఒక ప్రత్యేకమైన చార్టర్ ఏర్పాటు చేసేందుకు మౌలికంగా అంగీకరిస్తూ అందుకు కావలసిన నియమనిబంధనలు, విధానాలు రూపొందించడంలో సహకరించవలసిందిగా మెల్విన్ జోన్స్ ని కోరడం జరిగింది. అలా ఐక్యరాజ్యసమితిలో లయనిజానికి భాగస్వామ్యం ప్రారంభమైంది. అది రానురానూ మరింత సన్నిహితంగా మారి ఐక్యరాజ్యసమితిలో ఒక రోజును లయనిజం కోసం కేటాయించే స్థితిని లయన్స్ అంతర్జాతీయ సంస్థ సాధించగల్గింది.
ఐక్యరాజ్య సమితిలో ఆర్థిక మరియు సామాజిక విభాగం (ECOSOC) ఏర్పాటు చేశారు. ఇది మానవ సంక్షేమం కోసం పనిచేసే ఒక విభాగం. ఈ “ఇకోసాక్”కు లయన్స్ అంతర్జాతీయ సంస్థ కన్సల్టేటివ్ స్టేటస్ కలిగి వుంది..
‘To Create and Foster a spirit of understanding among the peoples of the world’, ‘ప్రపంచ ప్రజలలో అవగాహన స్ఫూర్తిని సృష్టించడం మరియు పెంపొందించడం’ అనే మొదటి ఆశయం ద్వారా ముందుకు సాగుతున్న లయన్స్ అంతర్జాతీయ సంస్థ, ఇబ్బందులలో ఉన్న ప్రజలకు స్వచ్ఛందంగా ప్రజల భాగస్వామ్యంతో సేవలందించడం, అంతర్జాతీయంగా ప్రజలందరి మధ్య సత్సంబంధాలు నెలకొల్పడం అనే ధ్యేయాలతో పనిచేస్తూ లయనిజం ఆదర్శాలని ఈ ఇకోసాక్ కూడా స్వీకరించేలా జోన్స్ కృషి చేశారు.
ఐక్యరాజ్యసమితితో భాగస్వామ్యం నడుపుతున్నా, ఐక్యరాజ్యసమితి తీసుకునే నిర్ణయాల ప్రభావం లయనిజం మీద కూడా వుండకుండా జోన్స్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. అది ఆయన ముందుచూపుకు నిదర్శనం.
ఐ.రా.స. ఆహార, వ్యవసాయాల సంస్థ, పిల్లల నిధి, పర్యావరణ కార్యక్రమం, ప్రకృతి విపత్తు నిర్వహణ సంస్థ, ప్రపంచ ఆహార కార్యక్రమం, మాదక ద్రవ్యాల నిరోధ కార్యక్రమం వంటి ఎన్నో ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలతో ప్రధాన భాగస్వామ్యం వహించి అనేక దేశాలలో చాలా కార్యక్రమాలు నిర్వహించింది లయన్స్ అంతర్జాతీయ సంస్థ. యునెస్కో (UNESCO) కార్యక్రమాలలో మన లియో సభ్యులు ఎందరో భాగస్వాములుగా వున్నారు. Sight First (Preventable blindness) కార్యక్రమం ద్వారా WHO తో లయనిజానికి భాగస్వామ్యం వుంది.
1978లో న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో లయన్స్, లయనెస్లు, లియోల సమావేశం ఏర్పాటు చేసి అనేకమంది దేశవిదేశ రాయబారుల్ని, ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల్ని ఆహ్వానించారు. అది మొదలు ప్రతి సంవత్సరం లయన్స్ తో ఒకరోజు అనే కార్యక్రమం ఐక్యరాజ్యసమితిలో జరగటం ఒక ఆనవాయితీ గా మారింది.
ఇది అంతర్జాతీయ సేవా సంస్థలలో లయనిజానికి మాత్రమే దక్కిన ఒక గొప్ప అవకాశం. 1985 నుంచి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 210 దేశాల్లో లయన్స్ క్లబ్స్ అన్నీ అక్టోబర్ 24న ఐక్యరాజ్యసమితి దినోత్సవం జరుపుకోవడం జరుగుతోంది.
రెండు సంస్థల ప్రధాన ఉద్దేశం ప్రపంచ శాంతి. ఆదిశగా అన్ని దేశాలలో ఉన్న యువతీ యువకులలో ప్రపంచశాంతి యొక్క ప్రాముఖ్యతను ప్రబోధించడం కోసం అన్ని లయన్స్ క్లబ్స్ పీస్ పోస్టర్ కంటెస్ట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ప్రపంచంలో ఎక్కడ ఏ మూలన ఎలాంటి సమస్యలు, గడ్డు పరిస్థితులు, మానవతా సంక్షోభాలు తలెత్తినా ప్రతి ఒక్కరు సమితివ్కెపు రూస్తుంటారు. పరిస్థితుల్ని ‘సమితే’ చక్కదిద్దుతుందని ఆశిస్తుంటారు. అందుకే దాన్ని ఆశ్రయిస్తుంటారు. అన్ని దేశాల వారిని ఒకే చర్చావేదికమీద కూర్చోబెట్టి శాంతి సామరస్యాలు సాధించడానికి ప్రపంచం మొత్తంమీద ఐక్యరాజ్య సమితిని మించిన అంతర్జాతీయ సంస్థ మరొకటి లేదు.
పలుచోట్ల సంఘర్షణలు, యుద్ధాలను నివారించడంలో విఫలమైనప్పటికీ సమితినే అంతా నమ్ముకోవడానికి బలమైన కారణమిదే. సంక్షోభాల్లో కలుగజేసుకొని, వాటి పరిష్కారానికి ప్రయత్నించే చట్టపరమైన హక్కు యుఎన్ చార్టర్ ద్వారా ‘సమితి’కి లభించింది. అందుకే దానిమీద అంతగా ఆధారపడాల్సి వస్తోంది. సమితి స్థాపించిన నాటి నుండి నేటి వరకు 80 సంవత్సరాల కాలంలో ప్రపంచ శాంతికి దోహదం చేసే ఎన్నో కార్యకలాపాలను నిర్వహించింది.
ఐతే ప్రపంచాన్ని వణికిస్తున్న తీవ్ర వాదాన్ని నివారించడంలో సమితి విఫలం అయ్యింది. ఐక్యరాజ్య నమితిలోని అగ్ర రాజ్యాల అధిపత్యం కొనసాగు తుండటం చిన్న దేశాలకు శాపంగా మారుతున్నది. అగ్ర రాజ్యాల చేతిలో ఉన్న ఐరాన తన లక్ష్యాలను నెరవేర్చలేక పోతున్నది. కాలం గడుస్తున్న కొద్దీ ఐరాన బలహీన పడుతున్నదనే విమర్శలు నర్వత్రా వినిపి స్తున్నాయి.
80 ఏళ్ళ పాటు ప్రపంచ శాంతికి అవిరళమైన కృషి చేసిన ఐరాన మరో ప్రపంచ యుద్ధం రాకుండా చూసి, మాన వాళిని కాపాడ గలదని మనసారా అశిద్దాం. ప్రపంచానికి ఐక్యరాజ్య సమితి అవసరం ఉందని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ఆదిశగా ఐక్యరాజ్య సమితి పని చేస్తుందని ఆశిద్దాం.
– ఆచార్య వెలగపూడి ఉమామహేశ్వరరావు
– మాజీ రిజిస్ట్రార్, ఆంధ్ర విశ్వవిద్యాలయం,
లయన్స్ జిల్లా గవర్నర్ (2000-2001), మేనేజింగ్ ట్రస్టీ, లయన్స్ కాన్సర్ మరియు జనరల్ హాస్పిటల్
విశాఖపట్నం.