అభిషేకానికి అమూల్ పాలే వాడండ్రోయ్!

– మన దీపమే కదా అని ముద్దెట్టుకుంటే మూతికాలదా మరి?
2014 లో తెలంగాణ ప్రభుత్వం 42% ఇస్తే…..టీడీపీ ప్రభుత్వం 43% ఇచ్చింది…
2018 టీడీపీ ప్రభుత్వం 30% ప్రపోజల్ అంటే…..మాకు 55% కావాలని…..అబ్బే జగన్ ఇరగదీస్తాడని…..ఓట్లు గుద్దారు….
పీఆర్సీ కమిషన్ 27% అని రిపోర్ట్ ఇస్తే…..ఇపుడు 14% అనౌన్స్ చేసాడు
empl1
మూడు పద్నాలుగులు ఎంతరా బుజ్జా????
1×14=14
2×14=28
3×14=42
మూడు పద్నాలుగులు నలభై రెండు…ఈ 43% ఎప్పుడో విన్నట్లుంది కదా? అపుడు….బలవంతంగా విడదీయబడిన రాష్ట్రంలో కనీస ఆదాయం లేని సమయంలో చంద్రబాబు అనే పెద్దాయన ఇచ్చిన

ఫిట్ మెంట్. ఇపుడు రెండు చేతులతో ఓట్లేసినందుకు. మూడో వంతు ఇస్తాను అంటున్నాడు…
సామెత: మన దీపమే కదా అని ముద్దు పెడితే మూతి కాలుతుంది! ఎక్కడో కాలిన వాసన వస్తుంది.. అభిషేకానికి అమూల్ పాలే వాడండ్ర వయ్!

– సంపత్‌రాజు (ఏఎస్ రాజు)