Suryaa.co.in

Features

పాయల్ బాజే.. బ్యాండ్ బాజే..!

దో ఆంఖే..
దో హాధే..
నబ్బే సినిమా…
అదే శాంతారాం హంగామా..!

శాంతారాంకి అమర్ కహానీ..
ఇది రాస్తే మహాగ్రంధమే..
మూకీలనాడు వచ్చి
టాకీలను పేర్చి..
ఇటు కళను..
అటు వ్యాపారాన్ని
జత చేసి వెండితెరకు
అద్దేశాడు నవరంగ్!

గీత్ గాయే పత్తరొంనే..
ఝనక్ ఝనక్
పాయల్ బాజే
ఈ పేర్లు చాలవా..
శాంతారాంలోని కళాతృష్ణను
అవి చాటవా..
సినిమాలతో తన ఆవేదనను..అంతరంగాన్ని
ఆవిష్కరించిన దర్శకుడు..
భావితరాలకూ తన
అభిరుచిని పంచిన దార్శనికుడు..!

దునియా నా మానే..
ఆయన జీవితం సినిమానే..
తానే అసలైన ఆద్మీ గా
నిలిచి..మురిపించి..
అమరజ్యోతి గా వెలిగాడు..
దాదాసాహెబ్ ఫాల్కే
గెలిచాడు..!

– సురేష్ కుమార్ ఎలిశెట్టి
9948546286

LEAVE A RESPONSE