– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
తల్లిని, చెల్లిని గౌరవించని జగన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకున్న వైకాపన్లు మహిళల్ని కించపరుస్తూ, అవమానపరుస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఒక ఛానల్ డిబేట్ లో భాగంగా జగన్ రెడ్డి పాలనలో మహిళలపై అత్యాచారాలు పెరిగాయని టిడిపి యువ మహిళా దళిత నాయకురాలు గ్రీష్మ
ఆరోపించారు. సమాధానం చెప్పలేని వైసిపి నేత నువ్వు ఏపీలోనే ఉంటున్నావా? నిన్ను ఎవరైనా రేప్ చేసారా? నిన్ను మెంటల్ హాస్పటల్ లో చూపించాలంటూ సంస్కారహీనంగా మాట్లాడి మహిళల పట్ల వైసిపి వ్యవహరించే దుర్మార్గమైన తీరుని మరోసారి బయటపెట్టాడు.ఉచ్చనీచాలు మరిచి మాట్లాడుతున్న వైకాపన్లకి మహిళాశక్తి ఏంటోచూపించాల్సిన సమయం వచ్చింది.