డీజీపీ గారూ.. పోలీసుశాఖ పరువు తీస్తున్నారు.. చర్యలు తీసుకోండి

50

– చింతకాయల విజయ్ వ్యవహారంలో సిఐడి పోలీసుల తీరును తప్పుబడుతూ డీజీపీకి లేఖ రాసిన తేదేపా నేత వర్ల రామయ్య

సిఐడి పోలీసుల తీరుపై ఎన్ని విమర్మలు వస్తున్న వారి పనితీరులో మాత్రం మార్పు రావడం లేదు. గోడలు దూకడం, బలవంతంగా ఇళ్లలోకి చొరబడటం, కస్టడీలో చిత్రహింసలకు గురిచేయడం నిత్యకృత్యమైంది. ఏపీ సిఐడి పోలీసులు డికె బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ వంటి కేసులలో భారత సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించారు.

సిఐడి పోలీసులు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నారు. సిఐడి పోలీసులు హైదరాబాద్ లోని చింతకాయల విజయ్ ఇంటిలో ప్రవర్తించిన తీరు తీవ్ర అభ్యంతరకరం. అది మానవహక్కుల ఉల్లంఘనే.
1. ఏపీ సిఐడి పోలీసులు రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా నవ్వులవ్వలనుకుంటున్నారా?
2. సిఐడి పోలీసులు బ్యాడ్జీలతో ఎందుకు ధరించలేదు?
3. ఐదేళ్ల పిల్లవాడిని ప్రశ్నించాల్సిన అవసరం ఏమిటి? సివిల్ దుస్తుల్లో వెళ్లి ఏం నిరూపించాలనుకున్నారు?
4. నిజంగా 41A నోటీసు ఇవ్వడానికి వెళ్లితే షెల్ఫ్‌లు, కబోర్డులు తెరవాల్సిన అవసరం ఏమిటి?
5. విజయ్ డ్రైవర్ చంద్రను కొట్టాల్సిన అవసరం ఏమిటి?
• సీఐడీ పోలీసుల‌ను సక్రమమైన మార్గంలో పెట్టని పక్షంలో ఏపీ సీఐడీ దేశ‌వ్యాప్తంగా నవ్వుల పాల‌య్యే అవ‌కాశం ఉంద‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నాను.
• ప్రాథమిక హక్కులు, సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి విజయ్ డ్రైవర్‌పై దాడి చేసిన CID అధికారులపై చర్య తీసుకోండి.