13 ఏళ్ల పిల్లల చేతికి గంజాయి ఘటన ఆందోళన కలిగించింది

61

– టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ట్వీట్

13 ఏళ్ల వయసున్న బాలికలు విజయవాడలో గంజాయి తాగడం నివ్వెర పరిచింది.ఈ వార్త నన్ను ఎంతో ఆందోళనకు, ఆవేదనకు గురి చేసింది. స్కూలు పిల్లల వరకు గంజాయి వచ్చేసిందంటే… పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం అవుతుంది.తీవ్రమైన ఈ అంశంపై ప్రభుత్వ వ్యవస్థలు అత్యంత సీరియస్ గా దృష్టిపెట్టాలి. సమూలంగా గంజాయిని అరికట్టేలా సత్వర చర్యలు తీసుకోవాలి.

రాజకీయ వేధింపులకు పోలీసులను వాడడంలో మునిగిపోయిన ప్రభుత్వం…యువత, విద్యార్థుల జీవితాలను గాలికి వదిలెయ్యడం క్షమించరాని నేరం. సమస్యలు, సవాళ్ల నేపథ్యంలో తల్లిదండ్రులు కూడా నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది.