Suryaa.co.in

Andhra Pradesh

ఇళ్ళల్లో ఆడవాళ్లను కూడా బయటకు లాగే కుసంస్కారి చంద్రబాబు

– 14 ఏళ్ళు బాబు సీఎంగా ఉన్నప్పుడు భువనేశ్వరి ఎన్ని సూట్ కేసులు మోశారు..?
– తండ్రిని వెన్నుపోటు పొడిచిన బాబును సపోర్ట్ చేయడానికి భువనేశ్వరి ఎన్ని సూట్ కేసులు తీసుకుంది?
– భారతమ్మ సక్సెస్‌ఫుల్‌ ఉమెన్‌, సక్సెస్‌ఫుల్‌ వైఫ్‌, సక్సెస్‌ఫుల్‌ మదర్‌.. మహిళలకు ఆమె స్పూర్తిదాయకం
– భారతమ్మ కాలి గోటికి కూడా అబద్ధాలు, అభాండాల అనిత సరిపోదు
– మహిళల్ని కలుపు మొక్కలుగా తీసిపారేయడం చంద్రబాబు నైజం
-: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి

వరుదు కల్యాణి మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
జగనన్న సంక్షేమ-అభివృద్ధి పాలన చూసి టీడీపీకి నిద్రపట్టడం లేదు
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పరిపాలనలో మన రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళుతోంది. అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో జగనన్న అమలుచేస్తున్నారు. ముఖ్యమంత్రి ఇవాళ రామాయపట్నం పోర్టుకు శంకుస్థాపన చేశారు. సంక్షేమ పథకాలు పారదర్శకంగా, ఎలాంటి అవినీతి లేకుండా ప్రజలకు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి. జగనన్న తన పాలనలో మహిళలకు పెద్దపీట వేశారు.

ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మహిళలను ముందుకు తీసుకువెళుతున్నారు. రాష్ట్రంలో మహిళలకు ఇచ్చిన పథకాలు, వారి రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు గానీ, అలాగే రాజకీయ పదవుల విషయంలోనూ ఇంతవరకూ ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగనన్న చేశారు. దేశంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు పాలన చేస్తున్నా.. వారెవరూ చేయనివిధంగా జగనన్న మహిళలకు అన్నింటా పెద్ద పీట వేశారు. అలాగే పేదవాడు అయితే చాలు, అర్హతే ప్రామాణికంగా ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో, దానికి కట్టుబడి పారదర్శకంగా సంక్షేమ పథకాలు శాచురేషన్ విధానంలో అందిస్తున్నారు. అందుకే ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గ్రాఫ్‌ రోజురోజుకీ పెరుగుతోంది. మొన్న పార్టీ ప్లీనరీ సమావేశాలు జరిగితే.. లక్షలాదిమంది స్వచ్ఛందంగా తరలి వచ్చి జగనన్నకు మద్దతు తెలిపారు. ఆ ప్లీనరీ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్లకు నిద్ర పట్టడం లేదు.

జగనన్న ఈ రాష్ట్రానికి శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉంటారని, తన జీవితకాలంలో ఇక ముఖ్యమంత్రి కాలేనని చంద్రబాబు నాయుడుకు క్లియర్‌గా అర్థమైపోయింది. దాంతో బాబుకు నిద్ర పట్టడం లేదు, మాట పెగలడం లేదు. నిత్యం ఫ్రస్టేషన్‌తో చంద్రబాబుతో పాటు టీడీపీ నాయకులు మా పార్టీ మీద, ముఖ్యమంత్రి జగనన్న మీద, ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు అసత్యాలు, అబద్ధాలు మాట్లాడుతున్నారు.

అబద్ధాల అనిత, అభాండాల అనిత
వంగలపూడి అనితను, విశాఖపట్నం ప్రజలు మాత్రం అబద్దాల అనిత, అభాండాల అనిత అంటారు. ఎందుకంటే ఆమె మాట్లాడేవన్నీ అబద్దాలే. జగనన్న సీఎం అయ్యాక కరోనా వచ్చిందట, ఆయనది ఐరన్‌ లెగ్‌ అని మాట్లాడటానికి ఆమెకు కనీస జ్ఞానమైనా ఉందా. జగనన్న ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రా? లేక ప్రపంచ దేశాలు అన్నింటికి అధ్యక్షుడిగా ఉన్నారా? అనే విషయాన్ని వంగలపూడి అనిత తెలుసుకోవాలి. ఇక ఐరన్‌ లెగ్‌ ఎవరు అనేది రాష్ట్రంలో ఎవరిని అడిగినా చంద్రబాబు నాయుడు అని ఠక్కున చెబుతారు. గూగుల్‌లో వెతికినా.. ఐరన్‌ లెగ్‌ అని కొడితే చంద్రబాబు పేరు వస్తుంది.

ఆయన గత అయిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో ప్రతి ఏడాదీ కరువు మండలాల్ని ప్రకటించేవారు. చంద్రబాబు నాయుడు- కరువు.. కవల పిల్లలని అందరికీ తెలిసిన విషయమే. ఇక గోదావరి పుష్కరాల సమయంలో చంద్రబాబు అడుగు పెట్టడంతో …. 29మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. దీన్ని అంటారు ఐరన్‌ లెగ్‌ అని. పక్క రాష్ట్రాల్లో చూసినా, చంద్రబాబు ఎవరికి మద్దతు ఇస్తే వాళ్లు ఎన్నికల్లో ఓడిపోయేవాళ్లు.. దీన్ని అంటారు ఐరన్‌ లెగ్‌ అని. ఈ విషయాన్ని అనిత తెలుసుకుంటే మంచిది. జగనన్న అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మూడేళ్ళుగా రాష్ట్రం సుభిక్షంగా ఉంది. ఒక్క కరువు మండలం కూడా ప్రకటించలేదు. జగనన్న పాలన గోల్డెన్‌ అని సగర్వంగా చెబుతున్నాను.

భారతమ్మ కాలి గోటికి సరిపోదు
జగనన్న సతీమతి భారతమ్మ పేరు పలికే అర్హతగానీ, ఆమె గురించిగానీ మాట్లాడే అర్హతగానీ అనితకు లేదు. భారతమ్మ కాలి గోటికి కూడా సరిపోవనే విషయాన్ని తెలుసుకుంటే మంచిది. ఏరోజు కూడా భారతమ్మ రాజకీయాలు గురించి మాట్లాడలేదు. రాజకీయాల్లో ఇన్ వాల్వ్ అవ్వలేదు. ఒకవైపు తాను చేస్తున్న వ్యాపారాలను బాగా నడిపించడంతోపాటు, ఇంట్లో పిల్లలను చక్కగా చదివిస్తూ, వారి బాగోగులు చూసుకుంటూ బాధ్యతాయుతమైన మహిళగా, అందరికీ ఆదర్శప్రాయంగా ఉన్నారు.

సోనియాగాంధీ-చంద్రబాబు నాయుడు కలిసి కుట్ర చేసి, అక్రమంగా కేసులు పెట్టి జగన్ ని జైల్లో పెట్టించినా భారతమ్మ ఎంతో మనో నిబ్బరంతో, ధైర్యంగా కుటుంబాన్ని, వ్యాపారాలను నడుపుతున్నారు. కష్టాల్లో ఉన్నా, తన వ్యాపార సంస్థల్లో పనిచేసే వేల కుటుంబాలు రోడ్డున పడకుండా ధైర్యంగా విధులు నిర్వహించారు. అలాంటి ఆమె ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిదాయకం. ఆ కష్టకాలంలో ఆమె ధైర్యానికి, ఆత్మస్థైర్యానికి, మనో నిబ్బరానికి రాష్ట్ర మహిళలంతా హ్యాట్సాఫ్ భారతమ్మ అని చెప్పారు. భారతమ్మ సక్సెస్‌ఫుల్‌ ఉమెన్‌. సక్సెస్‌ఫుల్‌ వైఫ్‌, మదర్‌తో పాటు సక్సెస్‌ఫుల్‌ ఎంటర్ ప్రెన్యూర్‌.

ఆంధ్రరాష్ట్రంలో ఉన్న మహిళలు అంతా ఆమెను రోల్‌మోడల్‌గా తీసుకుంటున్నారు. మహిళా పారిశ్రామికవేత్తలు, రాష్ట్రంలోని తల్లులు ఆమెను ఆదర్శంగా, స్పూర్తిదాయకంగా తీసుకున్నారు. ఇంత బిజీ లైఫ్‌లో కూడా తన పిల్లలను చక్కగా చదివిస్తున్నారు. అంతర్జాతీయ యూనివర్శిటీల్లో వారి పిల్లలు సీటు సాధించి, చదువుతున్నారంటే అందులో భారతమ్మ కృషి, పాత్ర మరువలేనిది.

ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన భారతమ్మ… మరో ఉన్నతమైన కుటుంబానికి కోడలుగా వచ్చారు. ఉన్నత విద్యావంతురాలిగా, ఉన్నత విలువలు ఉన్న మహిళగా, ముఖ్యమంత్రి జగనన్న భార్యగా, గొప్పగా, గర్వంగా మేమంతా ఫీల్‌ అవుతాం. అలాంటి మహిళ గురించి అనిత దిగజారుడు వ్యాఖ్యలు చేయడం అసహ్యం వేస్తోంది. భారతమ్మను టార్గెట్‌ చేస్తూ మాట్లాడటం వెనుక కచ్చితంగా చంద్రబాబు నాయుడు పాత్ర ఉంది.

మహిళల్ని కలుపు మొక్కలుగా తీసిపారేయడం బాబు నైజం
మహిళల్ని కలుపు మొక్కలుగా తీసిపారేయడం బాబు నైజం. టీడీపీలో మహిళలని ఉపయోగించుకోవడం, ఆ తర్వాత తీసిపారేయడం చూశాం. అందుకు తాజా ఉదాహరణ దివ్యవాణిగారే. ఇప్పుడు అనితతో నిత్యం తిట్ల పురాణాలు తిట్టించి, ఆమె పని అయిపోతే, ఆమెను కూడా పక్కనపెట్టేస్తాడు చంద్రబాబు. ఇప్పటికైనా అనిత సంస్కారవంతంగా మాట్లాడితే మంచిది.

14 ఏళ్ళు బాబు సీఎంగా ఉన్నప్పుడు భువనేశ్వరి ఎన్ని సూట్ కేసులు మోశారు..?
చంద్రబాబు నాయుడు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేయలేని పనులు ఇప్పుడు మా జగనన్న చేస్తుంటే.. ప్రజల్లో ఆయనకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడు. ఇంట్లో ఉన్న మహిళలను బయటకు తీసుకువస్తున్న పరిస్థితిని చంద్రబాబు కల్పిస్తున్నారు.
ప్రభుత్వ భూమిని తీసుకుని అధిక ధరకు ప్రభుత్వానికే అమ్మేసిన ప్రబుద్దురాలు అనిత. అలాంటి ఆమెకు భారతమ్మ గురించి మాట్లాడే అర్హత ఉందా? చంద్రబాబు కుటుంబసభ్యుల గురించి, ఆ పార్టీలో ఉండే మహిళల గురించి మేం కూడా మాట్లాడగలం. మాకు మాటలు రావనుకుంటున్నారా? చంద్రబాబు 14ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన సమయంలో నారా భువనేశ్వరి ఎ‍న్ని సూట్‌కేసులు మోశారో అనిత చెప్పాలి. నారా లోకేష్‌ మంత్రిగా ఉన్న సమయంలో నారా బ్రాహ్మణి ఎన్ని సూట్‌కేసులు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నా.

చంద్రబాబు నాయుడు తన పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారు. జన్మనిచ్చిన తండ్రిని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు భువనేశ్వరి సపోర్ట్‌ చేసింది అంటే ఎన్ని సూట్‌కేసులు తీసుకుంది అని ప్రశ్నిస్తున్నాను. ఎన్టీఆర్‌పైన చంద్రబాబు చెప్పులతో దాడి చేయించారు. మరి అందులో కూడా భువనేశ్వరి గారి పాత్ర ఉందా?. ఆ తర్వాత తన భర్త చంద్రబాబు ముఖ్యమంత్రిని చేసింది సూట్‌కేసులు లెక్కపెట్టుకోవడానికేనా అని మేము కూడా అనగలం.

సభ్యత, సంస్కారంతో మాట్లాడాలని మా ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలతో మేము కూడా అలాగే ప్రవర్తిస్తున్నాం. కరోనా సమయంలో.. భువనేశ్వరి, నారా బ్రాహ్మణిలు గత ప్రభుత్వంలో దోచుకున్న డబ్బులు పంపిణీ విషయంలో గొడవలు పడ్డారని ప్రచారం జరిగింది. మరి సూట్‌కేసులు పంచుకోవడానికే అత్తాకోడళ్లు గొడవలు పడ్డారా అని మేము అనవచ్చు కదా? మేమేమీ అలా చేయడం లేదే? ఇంట్లో ఆడవాళ్లను కూడా బయటకు లాగే కుసంస్కారం చంద్రబాబుది, మీ పార్టీ వాళ్లది. అలాంటి సంస్కారం లేని పనులు వైయస్సార్‌ సీపీ చేయడం లేదు. కానీ ఇలాగే మాట్లాడితే మేము కచ్చితంగా అలాగే సమాధానం చెబుతామని స్పష్టం చేస్తున్నా.

హెరిటేజ్ వాహనాల్లో ఎర్ర చందనం తరలించినందుకు భువనేశ్వరి, బ్రాహ్మణిలను ఎందుకు అరెస్టు చేయలేదు?
సాక్షి పేపర్‌లో ఒక వార్త వస్తే అది తప్పుడు వార్త అని, దానికి భారతమ్మను ఎందుకు అరెస్ట్‌ చేయకూడదని చంద్రబాబు అంటున్నారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే ఆయన ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. ఎంత ఫ్రస్ట్రేషన్‌లో ఉంటే మాత్రం ఇంత ఘోరంగా దిగజారిపోయి మాట్లాడాలా?. టీడీపీ ప్రభుత్వం హయాంలోనే హెరిటేజ్‌ వాహనాల్లో ఎర్ర చందనం తరలిస్తున్నారని ఆ వాహనాలను సీజ్‌ చేసి, వారిని అరెస్ట్‌ చేశారు. మరి అలాంటప్పుడు హెరిటేజ్‌ నడుపుతున్న భువనేశ్వరిని, బ్రాహ్మణిని అరెస్ట్‌ చేయాలని చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోయారు అని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఒకవేళ సాక్షి తప్పుడు వార్తలు రాసి ఉంటే… మరి అయిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు హయాంలో సాక్షి పత్రికపై ఎన్నో తప్పుడు కేసులు పెట్టారుగా? మరి, వాటిలో ఏ ఒక్కటీ నిరూపించలేకపోయారెందుకు? దీన్ని బట్టే అర్థం అవుతుంది ఏది నిజం, ఏది అబద్ధం అనేది.

బాబు హయాంలో వేల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయో లేక్కే లేదు
ఈ ప్రభుత్వం చేసే అప్పు ప్రతి రూపాయికీ లెక్క ఉంది. అవన్నీ పారదర్శకంగా ప్రజల ఖాతాల్లోకి నేరుగా వెళుతున్నాయి. అదే చంద్రబాబు హయాంలో వేల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో లెక్కేలేదు. 2014-19 కాలంలో ఒక లక్షా 62వేల కోట్లకు చంద్రబాబు సర్కార్‌ లెక్క చెప్పలేదని స్వయంగా కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించింది. ఈ ప్రశ్న అడిగింది కూడా స్వయానా టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమారే. ముందు వాటికి లెక్కలు చెప్పండి.
చంద్రబాబు నాయుడు తన పాలనలో అన్ని రంగాలను నిర్వీర్యం చేయడంతో ప్రజలు 2019 ఎన్నికల్లో బుద్ధి చెప్పి, ఆయన్ని 23 సీట్లతో ఇంట్లో కూర్చోబెట్టారు. దాన్ని తట్టుకోలేకే అవాకులు, చెవాకులు పేలుతున్నారు. చంద్రబాబు, తన జీవితకాలానికి సరిపడా తప్పులు చేసేశారు. అందుకే జీవితకాంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాలేడని మీకు అర్థమైపోయింది.

వన్ అండ్ ఓన్లీ జగన్ ..
జగనన్న తన పాలనలో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్ లో తొలి స్థానంలో ఉన్నారు. వాలంటీర వ్యవస్థతో పాటు గ్రామ సచివాలయ వ్యవస్థ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంది. ఆర్బీకేలను నీతి ఆయోగ్‌ ప్రశంసించింది. కేవలం మూడేళ్లలోనే 32లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా. మూడేళ్లలోనే లక్షా 65వేల కోట్ల రూపాయలను ఎలాంటి అవినీతి లేకుండా ప్రజల అకౌంట్లలో వేసిన ముఖ్యమంత్రిని ఎక్కడైనా చూశారా? ప్రతిపక్షాన్ని నామరూపాలు లేకుండా చేసిన సీఎంను చూశారా? ప్రధానమంత్రి దగ్గర నుంచి పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా ప్రతి ఒక్కరూ అభినందిస్తున్న ముఖ్యమంత్రిని ఎక్కడైనా చూశారా? అది వన్‌ అండ్‌ ఓన్లీ మా జగన్‌ మోహన్‌ రెడ్డిగారు అని మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. ఇలాంటి గొప్ప ముఖ్యమంత్రి పరిపాలనను చేతనైతే ప్రశంసించాలే కానీ, పనికిమాలిన విమర్శలు చేయవద్దని సూచిస్తున్నాం.

LEAVE A RESPONSE