Suryaa.co.in

Andhra Pradesh

రచ్చబండ పెడతాం.. వస్తావా?

-పవన్ కళ్యాణ్ క్రైమ్ కహానీలు అల్లుతున్నారు
– మహిళ అదృశ్యం అవ్వడానికి సినిమా ప్రభావం, టీనేజ్, ఇంటర్నెట్ వంటి కారణాలు
-11వ స్థానంలో ఉన్న రాష్టాన్ని మొదటి స్థానానికి ఎందుకు తీసుకువస్తున్నారు?
– మహిళా భ్యుదయానికి రాష్ట్రం పెద్ద పీట
– పవన్‌ కల్యాణ్‌కు మహిళా కమిషన్‌ చైర్మన్‌ వాసిరెడ్డి పద్మ సవాల్‌

అమరావతి:మహిళ అదృశ్యం పై ఇతర రాష్ట్రాల్లో అధికంగా ఉండగా 11వ స్థానంలో ఉన్న ఆంధ్ర రాష్టాన్ని మీ నోటితో మొదటి స్థానానికి ఎందుకు తీసుకువస్తున్నారని రాష్ట్ర మహిళ కమీషన్ వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. వెలగపూడి సచివాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ దేశం మొత్తం మీద మహిళా అదృశ్యం జరుగుతుండగా ఆంధ్రరాష్ట్రన్నీ మాత్రమే లక్ష్యం గా చేసుకుని ఎందుకు ప్రశ్నించారని పవన్ కళ్యాణ్ ని విమర్శించారు.

ఎటువంటి ఆధారాలు లేకుండా అదృశ్యాలపై కేవలం వాలంటరీ వ్యవస్థ ప్రధాన కారణమని ఆరోపణలు చేస్తూ పవన్ కళ్యాణ్ క్రైమ్ కహానీలు అల్లుతున్నారని, దేశంలోనే మహిళ రికవరీ అంశం లో 78శాతం తో ఏపీ ముందు ఉందన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నారన్నారు. మహిళ అదృశ్యం అవ్వడానికి సినిమా ప్రభావం, టీనేజ్, ఇంటర్నెట్ వంటి పలు కారణాలు ఉండగా వాలంటరీ వ్యవస్థ ని అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని కించపరుస్తూ మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

వైస్సార్ ప్రభుత్వానికి ఆదుకోవడం మాత్రమే తెలుసు
గత ప్రభుత్వం పాలనలో మహిళకు దొరకని గౌరవం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే లభ్యమైందని, ఈ ప్రభుత్వంలో మహిళల్ని ఆదుకోవడమే తెలుసని గత ప్రభుత్వం తరహాలో ఆదుకోవడం రాదన్నారు. మూడు పెళ్లిళ్లు చేసుకొని ఒకరు, ముద్దు పెట్టడానికి కడుపుచెయ్యడం అంటూ మహిళల్ని హేళన చేస్తూ సమాజానికి ఏం చైతన్యం కల్పిస్తారని ప్రశ్నించారు. నిజాయితీగా పోరాటం చెయ్యలేక మహిళల్ని అడ్డం పెట్టుకొని తప్పుడు ప్రచారాలు చేసేవారిని చెంప పగలకొట్టాలని అనిపిస్తుందన్నారు. మహిళా భ్యుదయానికి రాష్ట్రం పెద్ద పీట వేసిందని. వారి కోసం యజ్ఞం చేస్తుందన్నారు.

నోటీస్ కు జవాబు చెప్పలేదు
మహిళ అదృశ్యంపై ఏ ఆధారాలతో వాలంటరీ వ్యవస్థ పై ఆరోపణ చేసారని మహిళ కమిషన్ నోటీస్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పలేదని, కమిషన్ కు విలువ ఇవ్వని పవన్ కళ్యాణ్ మహిళకు ఏవిధంగా విలువనిస్తున్నారో అవగతమవుతుందన్నారు. కమిషన్ చేస్తున్న విజయాలు కళ్ళు తెరిచి చూడాలన్నారు. పవన్ కళ్యాణ్ కు మహిళల సమక్షంలో రచ్చబండ పెడదమని మహిళ కమిషన్ సవాల్ విసురుతుందన్నారు. మహిళ చెప్పే మాటలు మనసుతో వింటే తెలుస్తుందన్నారు.

LEAVE A RESPONSE