Suryaa.co.in

Andhra Pradesh

ఆర్య వైశ్యుల మీద చంద్రబాబు కపట ప్రేమ

– రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నవ నిర్మాణ దీక్ష అంటూ పొట్టి శ్రీరాములు గారిని అవమానించింది బాబు కాదా..!
– అధికారంలో ఉంటే తోలు తీస్తానంటాడు.. ప్రతిపక్షంలో ఉంటే అండగా ఉంటానంటాడు
– రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే… చంద్రబాబుకి పొట్టి శ్రీరాములు గారు నిన్ననే గుర్తుకు వచ్చినట్టుంది. ఆర్యవైశ్యులపై బాబు కపట ప్రేమ చూపుతున్నాడు.చంద్రబాబు అధికారంలో ఉంటే తోలు తీస్తాను అంటాడు.. ప్రతిపక్షంలో ఉంటే, అందరికీ తోడుగా, అండగా ఉంటాను అని స్టేట్ మెంట్లు ఇవ్వడం ఆయనకు పరిపాటి.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడో అమెరికాలో ఉన్న ఆర్య వైశ్యుడు మల్లికార్జునరావును పిలిపించి ఆయన భార్య శ్రీదేవికి మాచర్ల చైర్మన్ పదవి ఇచ్చినట్టే ఇచ్చి, తీరా, తన సామాజికవర్గం కోసం, పదవి ఇచ్చిన ఏడాది నుంచే రాజీనామా చేయమని ఒత్తిడి చేసి, ఆమె చేత రాజీనామా చేయించబట్టే కదా ఆ భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నది అని అడుగుతున్నాం.

చిలకలూరిపేట లో శంకర్ అనే విలేకరిని మీ హయాంలో హత్య చేయించింది వాస్తవం కాదా..? అలానే, మంత్రిగా పనిచేసిన సిద్దా రాఘవరావును బలవంతంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించి, ఆయన ఓటమికి కారణం అయింది మీరు కాదా.. ? సినీ నటి కవితను ఏడిపించి బయటకు పంపలేదా..? ఆర్యవైశ్యులను అడుగడుగునా చులకనగా చూసిందీ, అవమానించిందీ చంద్రబాబే.

అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని అవమానిస్తూ, రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నవనిర్మాణ దీక్షగా మార్చింది చంద్రబాబు కాదా.. ?. జగన్ ముఖ్యమంత్రి అయ్యాకే, నవంబర్ 1ని రాష్ట్ర అవతరణ దినోత్సవంగా ప్రకటించింది వాస్తవం కాదా..

రోశయ్య వాసవి సత్రాలను ఆర్యవైశ్యులకు ఇస్తే వాటిని మీరు తీసుకోలేదా…?రోశయ్య గారిని ఏడిపించిన వ్యక్తి చంద్రబాబే. ఆర్యవైశ్యులపై పవన్ కల్యాణ్ కూడా కపట ప్రేమ చూపిస్తున్నాడు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మరణిస్తే… మూడు రోజులు సంతాప దినాలుగా ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ముగ్గురు మంత్రులను అంత్యక్రియలకు పంపారు. ఆయన ఆస్తికలు కలపడానికి కూడా మంత్రులను పంపారు.

LEAVE A RESPONSE