- గుంటూరులో భారీగా మహిళా ర్యాలీ..
- కోర్టు వాయిదా ఎగ్గొట్టడానికి తిరుమలను అడ్డుపెట్టుకున్న జగన్ మానవత్వం…
- నారీ గళం, సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ, బ్రాహ్మణ చైతన్య వేదిక ఆధ్వర్యంలో తిరుమల అపచారంపై నినదించిన గుంటూరు మహిళలు, జేఏసీ నాయకులు…
అమరావతి: గుంటూరు నగరంలో నేటి సాయంత్రం నారీ గళం, బ్రాహ్మణ చైతన్య వేదిక, సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో వేలాది మంది మహిళలతో తిరుమల లో జరుగుతున్న అపచారాలపై నినదిస్తూ భారీ స్థాయిలో ఐదు కిలోమీటర్లు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహకులు ముత్తినేని శివలీల, గుంటుపల్లి యామిని, సిరిపురపు శ్రీధర్ శర్మ లు మాట్లాడుతూ…
ప్రపంచవ్యాప్తంగా పవిత్రమైన తిరుమల క్షేత్రంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పట్ల గత జగన్ ప్రభుత్వంలో స్వామివారి కైకర్యాల్లో పూజలలో టికెట్లలో, కాంట్రాక్టలలో అనేక అపచారాలు, అవినీతి చేశారని దీనిపైన ధార్మిక సంస్థలు హిందూ సంఘాలు గత ఐదేళ్లపాటు ప్రభుత్వం తెలియజేస్తున్న కనీసం దున్నపోతు మీద వాన వలె ప్రవర్తించిందని అన్య మతస్థుడు ముఖ్యమంత్రి సనాతన ధర్మం పట్ల ఎన్నో కుట్రలు చేశారని దానిలో భాగంగానే తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం, అన్న ప్రసాదం గుడ్డు పంది కొవ్వుల నూనె చేపల నూనె జంతు కళేబరాల నూనె వినియోగించి ప్రసాదాలు స్వామివారికి నివేదనలు చేసి భక్తులకు పంపిణీ చేశారంటే చాలా దారుణమైన విషయమని క్షమించరాని నేరమని నేతల పేర్కొన్నారు.
జగన్ భార్యతో కలసి గత ఐదేళ్లలో ఏ దేవాలయం దర్శించలేదని తిరుమలకు 11 సార్లు వచ్చానని చెప్పుకునే క్రమంలో ఒక్కసారి కూడా జగన్ భార్య భారతి తో కలిసి దేవాలయ దర్శనాలు స్వామివార్లకు పట్టు వస్త్రాలు ఎందుకు సమర్పించ లేదని జగన్ ని ప్రశ్నించారు. ఇదేనా హిందూ దేవి దేవతలపై దేవాలయాలపై సనాతన ధర్మంపై నీ మానవత్వం అని జగన్ను ప్రశ్నించారు. 11 సార్లు వెళ్లి డెకరేషన్ ఇవ్వకపోవటమే స్వామివారికి ,భక్తులకు ఇదేనా నువ్వు విలువిచ్చే గౌరవం, మానవత్వం అని ప్రశ్నించారు. ఒకసారి కూడా తిరుమలలో డెకరేషన్ ఇవ్వకపోవటం ఏమంటారు జగన్ అన్య మతస్థుడుగా నువ్వు ప్రభుత్వాన్ని అడ్డంపెట్టి మా సనాతన ధర్మంపై దాడి చేయడమే కదా దీనికేనా నువ్వు ముఖ్యమంత్రి అయింది అని ప్రశ్నించారు.
నిన్న తిరుమల వెళ్తానని పెద్ద డ్రామా జగన్ ఆడాడని దేనికోసం ఆడాలంటే హైకోర్టులో కేసులు వాయిదాలకి ఎర్రగ కొట్టడం కోసం తాను తిరుమల వెళుతున్నట్టు హైకోర్టులో పిటిషన్ వేశాడని, కోర్టు వాయిదాలు ఎగొట్టడం కోసం తిరుమలను కూడా అడ్డు పెట్టుకున్నాడని ఇదే నువ్వు నీ మానవత్వం తిరుమలపై అని ప్రశ్నించారు, ఒక నేరస్తుడు ముఖ్యమంత్రి అయితే ప్రజలు ఇటువంటి ప్రవర్తన కాకుండా ఇంకేం ఆశిస్తారని ఎప్పటికీ ప్రజలు జగన్ గురించి పూర్తిగా తెలిసి మొన్నటి ఎన్నికల్లో అతన్ని 11 సీట్లకే పరిమితం చేశారని, అయినా గాని ఇప్పటికీ అతనికి సిగ్గు రాలేదని, ఇంకా ధార్మిక విషయాలపై దాడులు చేయటం కోసం అనేక కుట్రలు పన్నుతున్నాడని దేని చంద్రబాబు గారికి ప్రభుత్వం దృష్టి పెట్టి ఇటువంటి సామాజిక నేరస్తుల్ని సమాజం నుంచి దూరం పెట్టే విధంగా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇప్పటికైనా జగన్ కి జేఏసీ తరపున ఒకటే తెలియజేస్తున్నామని నువ్వు ఇలాంటి డ్రామాలు దేవుళ్ళపై ఆడితే చూస్తూ ఊరుకోవటానికి ఆంధ్ర ప్రజలు పిచ్చి ప్రజలు కాదని ఇప్పటికే నీకు తగు రీతిలో బుద్ధి చెప్పారని డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండా ప్రకటన చేయకుండా తిరుమల కొండ ఎక్కాలని ప్రయత్నిస్తే ఖచ్చితంగా ధార్మిక సంఘాలు, హిందూ సంఘాలు, స్వామీజీలు, ప్రజలు కలిసి అక్కడే తగు రీతిలో బుద్ధి చెప్తామని జగన్ ని హెచ్చరించారు. తొలుత స్వామివారి భారీ ప్రతిమను వాహనంపై ఉంచి పూజా కైంకర్యాలు చేసి ఈ ర్యాలీ బృందావన్ గార్డెన్స్ లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి బ్రాడీపేట ప్రధాన రహదారిలో ఉన్న సీతారామ దేవాలయం వరకు కొనసాగింది. ర్యాలీకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పట్టాపురం ఎస్ఐ, ట్రాఫిక్ సిఐ, అరండల్ పేట సీఐ పర్యవేక్షించారు.
ఈ కార్యక్రమంలో పంచమర్తి కల్పన, కొమ్మినేని అఖిల దాసరి రాము,యస్.అనీషా, మానం పద్మ, మన్నె సుజాత,y.శైలజ, రేపాక పద్మావతి, షేక్ బాజీ,ఎండపల్లి శబరి, వేమూరి రాజకుమార్, వంగవీటి చైతన్య, చిలుమూరు ఫణి, నందివెలుగు చందు, కొమ్మిన నరేష్, వడ్లమూడి నాగేశ్వరరావు, మల్లెంకొండ సాంబశివరావు, రాచకొండ నాని,, కూరపాటి కిషోర్, వెలమకంటి శీను, రామడుగు మనోహర్, భాగవతుల రవి శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.