Suryaa.co.in

Andhra Pradesh

బ్రాహ్మణ వేషంలో మోసాలు చేస్తున్న నకిలీ జ్యోతిష్యుడు వేణుస్వామి

  • వేణుస్వామి బ్రాహ్మణ జాతిలో జన్మించలేదు…బ్రాహ్మణుడు కాదు…
  • వేణు స్వామి ఒక డ్రగ్ బ్రోకర్ అనే అనుమానం…
  • బ్రాహ్మణ వేషధారణ తీయకపోతే తీవ్ర పరిణామాలు
  • బ్రాహ్మణ చైతన్య వేదిక

మంగళవారం గుంటూరులో బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో బ్రాహ్మణ కులంలో ఉన్న శాఖలకు సంబంధించిన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ మాట్లాడుతూ… నకిలీ జ్యోతిష్యుడు వేణు స్వామి, అతని భార్య శ్రీవాణి బ్రాహ్మణ కులం మద్దతు తమకు ఇవ్వాలని, ఒక న్యూస్ ఛానల్ కు వేల స్వామి కుటుంబానికి జరుగుతున్న వివాదంలో ఒక వీడియో రిలీజ్ చేసి బ్రాహ్మణ సంఘాలు మద్దతు కోరడం జరిగిందని అయితే తప్పుడు పనులు, మోసపు పనులు చేస్తూ వేణు స్వామి కుటుంబం బ్రాహ్మణ సంస్కృతి సాంప్రదాయాలను మంటగలిగే విధంగా సభ్య సమాజంలో ప్రవర్తిస్తూ వారికి ఏదో ఈరోజు ఇబ్బంది వచ్చిందని ఆరోపించారు.

బ్రాహ్మణ జాతి మద్దతు అడగటం ఎంతవరకు సబబు.. అసలు వేణు స్వామి బ్రాహ్మణ జాతిలో జన్మించలేదని తన కులం బహిరంగంగా చెప్పుకుంటానికి సిగ్గుపడే వేణు స్వామి ఈ రోజున బ్రాహ్మణ సంస్కృతి సాంప్రదాయలను అవమానిస్తూ,మంతగల్పుతూ ప్రపంచంలో ఉన్న బ్రాహ్మణ సమాజం మనోభావాలను దెబ్బతీశాడు, బ్రాహ్మణ కట్టు, బొట్టుతో సినీ ఇండస్ట్రీ వారిని, రాజకీయ నాయకుల్ని, మీడియా చానల్స్ వారిని, ప్రజలను మోసం చేస్తూ సమాజాన్ని తప్పు దోవ పట్టిస్తున్నాడని ఇతను బ్రాహ్మణుల కులంలో ఉన్న ఏ శాఖకు కూడా సంబంధించిన వాడు కాదని, చివరా కరకు బీసీ సమాజిక వర్గానికి చెందిన చాత్తాద శ్రీ వైష్ణవుల కులానికి సంబంధించిన వాడని సమాచారం ద్వారా విచారణ చేస్తే వారి కులానికి కూడా చెందిన వ్యక్తి కాదని, ఇటువంటి పరిస్థితుల్లో అతను ఏ కులానికి చెందిన వ్యక్తినో బహిరంగంగా ప్రజల ముందు తెలియజేయాలని లేని పక్షంలో బ్రాహ్మణ వేషధారణ తీసివేయాలని లేనిపక్షంలో అతనిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని శ్రీధర్ హెచ్చరించారు.

ఇటువంటి పరిస్థితుల్లో వామాచార పద్ధతుల్లో యోని పూజల పేరుతో మహిళలను, చిన్నపిల్లల్ని హోమాల దగ్గర, అలానే జీవ బలుల కార్యక్రమాల పేరుతో క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నాడని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జ్యోతిష్యం పేరుతో తప్పుడు జ్యోతిష్యాలు చెబుతూ సమస్యల మీద వచ్చిన వారిని భయపెడుతూ ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నాడని, జ్యోతిష్యం పేరుతో లక్ష రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నాడని, అతనికేమీ జ్యోతిష్యం రాదని అంతా మోసం అని శ్రీధర్ తెలియజేశారు. వేణు స్వామిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఎవరు నమ్మవద్దని, అతని మోసాలకు గురి కావద్దని శ్రీధర్ పిలుపునిచ్చారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో జ్యోతిష్యం పేరుతో ఆర్థికంగా, శారీరకంగా, సామాజికంగా నష్టపోయిన బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేయాలని, వేణు స్వామి ఒక మత్తు పదార్థాల బ్రోకర్ గా చలామణి అవుతున్నాడేమోనని మాకు అనుమానం ఉన్నట్లు శ్రీధర్ తెలియజేశారు.

అలానే తెలంగాణ ప్రాంతంలో ఎన్నో ప్రభుత్వ భూములు కబ్జా చేసాడని తన పేరిట రిజిస్టర్ కూడా చేయించుకున్నాడని, జ్యోతిష్యం పేరుతో ప్రజలను మభ్యపెడుతూ సంఘ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తు, కులాల మధ్య కొట్లాటలు పెట్టి సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వేణుస్వామి పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని శ్రీధర్ డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా బ్రాహ్మణ కులం లో ఉన్న వివిధ శాఖల సంఘ నాయకులైన జాతీయ వేద స్మార్త ఆగమ సంఘం కార్యదర్శి జంధ్యాల రామలింగేశ్వర శాస్త్రి మాట్లాడుతూ… తమ వైదిక శాఖలో ఎవరితో బంధుత్వం కూడా లేదని తాము ఇటువంటి వామాచార పద్ధతులకు వ్యతిరేకమని ప్రస్తుతం సమాజంలో అవి నిరుపయోగమైనవని ఎప్పటికైనా సరే వేణు స్వామి జ్యోతిష్యం పేరుతో తన మోసాలను కట్టి పెట్టాలని శాస్త్రి తెలియజేశారు.

వైఖానస శాఖకు చెందిన రాష్ట్ర నాయకులు వేదాంతం వెంకట హరనాథ్ మాట్లాడుతూ… విష్ణు స్వరూప నుంచి తమ శాఖ ఉద్భవించిందని అటువంటి శాఖలో జన్మించిన తాము వేణు స్వామి చేసే చండాలమైన పనులన్నిటిని ఖండిస్తున్నామని అతను గాని అతని భార్య గాని వైఖానస శాఖకు ఎటువంటి సంబంధం లేదని, బ్రాహ్మణుడని బయట సమాజంలో చెప్పుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హరనాథ్ తెలియజేశారు. ఆరువేల నియోగుల శాఖ అధ్యక్షులు వడ్లమూడి రాజా మాట్లాడుతూ అసలు అతను తమ శాఖకు సంబంధించిన వాడు కాదని అతను బ్రాహ్మణుడే కాదని, బ్రాహ్మణ వేషధారణతో ప్రజలను మోసం చేస్తున్నాడని తెలిపారు.

కారణాల శాఖకు సంబంధించి కస్తూరి మాట్లాడుతూ… అసలే అంతంత మాత్రంగా ఉన్న బ్రాహ్మణ జాతిని సమూలంగా నాశనం చేసేందుకు వీరస్వామి కంకణం కట్టుకున్నాడని దానిలో భాగంగానే ఇటువంటి విపరీత కార్యక్రమాలు చేస్తున్నాడని కోట్ల రూపాయల ధనాన్ని దోచుకుంటున్నాడని, అతనికి కారణాల శాఖకు సంబంధం లేదని తెలియజేశారు. ఆంధ్ర రాష్ట్రీయ శివార్చక సంఘ నాయకులు ప్రత్తిపాటి అనిల్ మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న సనాతన ధర్మాన్ని ఇతను చేష్టల ద్వారా నష్టపరుస్తున్నాడని ఇతని పైన తక్షణమే క్రిమినల్ చర్యలు చేపట్టాలని తెలియజేశారు.

అలానే ఉమ్మడి రాష్ట్ర సలహాదారు వేల్పురి ప్రసన్న ఆంజనేయులు మాట్లాడుతూ… వేణు స్వామి తమ కులానికి చెందిన వ్యక్తిగా గతంలో బ్రాహ్మణ సంఘ నాయకులు పేర్కొన్నారని అయితే తమ సంఘ నాయకులు విచారించగా అతని ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా తమతో బంధుత్వం కూడా లేదని తమ కులస్తుడు కాదని తమ సాంప్రదాయాలకు వ్యతిరేకమైన వామాచారా పూజలను నిర్వహించమని అటువంటిది ఏనుగు స్వామి జ్యోతిష్యం పేరుతో, ప్రజలను మోసం చేస్తూ లక్షలాది డబ్బులతో విలాస జీవిత అన్ని గడుపుతున్నాడని అటువంటి వ్యక్తి తమ కులంలో ఉంటే ఈపాటికి తామే పోలీస్ కేసులు పెట్టేవారమని ఆంజనేయులు తెలియజేశారు.

చివరగా శ్రీ వైష్ణవ సంఘ నాయకులు కిడాంబి శ్రీనివాసాచారి మాట్లాడుతూ… తమ శాఖలో కుల భ్రష్టత్వం పట్టిన వ్యక్తులకు అసలు విలువ, మద్దతు ఉండదని, అప్పుడు పనులు చేస్తూ జ్యోతిష్యం పేరుతో సమాజాన్ని మోసం చేస్తున్న వేణు స్వామి శ్రీ వైష్ణవ శాఖకు సంబంధించిన వ్యక్తిగా తనకు తానుగా కనుక ప్రకటిస్తే తాము అతనిని తమ శాఖ నుండి అతనినీ శాఖా బహిష్కరణ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండపల్లి శబరి వడ్డమాను ప్రసాదు వంగవీటి చైతన్య చిలుమూరు ఫణి, అన్వేష్, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE