వియత్నాం ప్రపంచంలో ఒక చిన్న దేశం. కానీ అది అమెరికా వంటి ఒక పెద్ద, శక్తివంతమైన దేశాన్ని తలవంచేలా చేసింది. దాదాపు ఇరవై సంవత్సరాలు సాగిన యుద్ధంలో అమెరికా ఓడిపోయింది. అమెరికాపై విజయం సాధించిన తర్వాత, ఒక విలేఖరి వియత్నాం అధ్యక్షుడిని ఒక ప్రశ్న అడిగారు…
ఆ ప్రశ్న.., “మీరు యుద్ధంలో ఎలా గెలిచారు.? లేదా మీరు అమెరికాను ఎలా తలవంచేలా చేశారు…?” అని.
ఆ ప్రశ్నకు ఇచ్చిన సమాధానం వింటే.. మీరు ఆశ్చర్యపోతారు. మీ గుండె కూడా గర్వంతో నిండిపోతుంది. ఇచ్చిన సమాధానం చదవండి.!
“అన్ని దేశాలలోకెల్లా అత్యంత శక్తివంతమైన దేశమైన అమెరికాను ఓడించడానికి నేను ఒక గొప్ప భారతీయ రాజు యొక్క చరిత్రను చదివాను. ఆ జీవిత చరిత్ర నుండి పొందిన స్ఫూర్తిని, యుద్ధ నీతిని ఉపయోగించి, మేము సులభంగా విజయం సాధించాము..!!”
తర్వాత ఆ విలేఖరి అడిగాడు… “ఆ గొప్ప రాజు ఎవరు?”
వియత్నాం అధ్యక్షుడు లేచి నిలబడి ఇలా సమాధానం ఇచ్చారు… “ఆయన భారతదేశంలోని రాజస్థాన్‌కు చెందిన మేవార్ మహారాణా ప్రతాప్ సింగ్”
మహారాణా ప్రతాప్ పేరు చెప్పేటప్పుడు.. వారి కళ్ళలో ఒక కాంతి కనిపించింది. ఇంకా వారు ఇలా అన్నారు.
“అటువంటి రాజు మా దేశంలో పుట్టి ఉంటే, మేము ప్రపంచం మొత్తాన్ని పరిపాలించి ఉండేవాళ్ళం.”
కొన్ని సంవత్సరాల తర్వాత ఆ అధ్యక్షుడు మరణిస్తే, అతను తన సమాధిపై ఏమి వ్రాయించుకున్నాడో తెలుసా?
“ఇది మహారాణా ప్రతాప్ శిష్యుడి సమాధి”
వియత్నాం విదేశాంగ మంత్రి ఒకసారి భారతదేశ పర్యటనకు వచ్చారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమం ప్రకారం, వారికి మొదట ఎర్రకోటను, ఆ తర్వాత గాంధీజీ సమాధిని చూపించారు.
ఇవన్నీ చూపించిన తర్వాత, అతను “మేవార్ మహారాజా మహారాణా ప్రతాప్ సమాధి ఎక్కడ ఉంది?” అని అడిగాడు.
అప్పుడు భారత ప్రభుత్వ అధికారులు ఆశ్చర్యపోయారు, వారు అది ఉదయపూర్‌లో ఉందని చెప్పారు.. వెంటనే వియత్నాం విదేశాంగ మంత్రి ఉదయపూర్‌కు వెళ్లి, అక్కడ ‘మహారాణా ప్రతాప్’ సమాధిని సందర్శించారు.
సమాధిని సందర్శించిన తర్వాత, అతను సమాధి దగ్గర ఉన్న మట్టిని తీసుకుని తన సంచిలో నింపుకున్నాడు. దీనిని గమనించిన విలేఖరి మట్టిని తీసుకువెళ్లడానికి కారణం అడిగాడు.
ఆ విదేశాంగ మంత్రి ఇలా అన్నాడు “ఈ మట్టి అసలైన నిజమైన వీరులది.. ఈ మట్టిలో ఒక గొప్ప రాజు జన్మించాడు, నేను ఈ మట్టిని నా దేశపు మట్టిలో కలుపుతాను. తద్వారా నా దేశంలో కూడా అలాంటి వీరులు జన్మిస్తారు.” మాకు గర్వకారణంగా ఆనిపించే ఈ రాజు కేవలం భారతదేశానికే కాదు, యావత్ ప్రపంచానికే గర్వకారణం కావాలి.
– వెలిశెట్టి నారాయణరావు
(విశ్రాంత సాంఘీకశాస్త్ర ఉపాధ్యాయులు)