Suryaa.co.in

Andhra Pradesh

లాబీయింగ్ కోసమే విజయ్ కుమార్ స్వామి సీఎం ఇంటికి వచ్చారు

– మాజీ మంత్రి కె. ఎస్ జవహర్

విజయ్ కుమార్ స్వామి గురించి దుష్ప్రచారం చేస్తున్నారన్న వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలు సిగ్గుచేటని మాజీ మంత్రి కె.ఎస్ జవహర్ మండి పడ్డారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ….. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పడుతున్న అవాస్తలు అంతా ఇంతా కాదు? జగన్ రెడ్డికి శ్రీవారి దర్శనం కావాలో లాబీయిస్ట్ ల దర్శనం కావాలో ఈరోజు చూస్తున్నాం. చేసిన పాపం మనిషిని మిగేస్తుంది. జగన్ రెడ్డి చేస్తున్న పనులు చూస్తే అలాగే అనిపిస్తుంది.

విజయకుమార్ స్వామి విజయవాడ వేరే పనిమీద వస్తే అతని యొక్క అశీర్వవచనం తీసుకోవడం కోసమే జగన్ రెడ్డి దగ్గరకు పంపానని వైవి సుబ్బారెడ్డి చెప్పడానికి ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 6 గంటల సేపు స్వామితో ఎవరైనా ఆశీర్యాదం తీసుకుంటారా? ఇది లాబీయింగ్ కాకపోతే మరేంటి? సీఎం జగన్ దంపతులు శ్రీవారికి పట్టు వస్ర్తాలు ఇచ్చిన సందర్భాలు లేవు. కేవలం రాజకీయ లబ్ధికోసం స్వాములను, పూజారులను వాడుకుంటున్నారు. ఇది హిందూవులను అవమానించడమే.

విజయ్ కుమార్ స్వామి వ్యక్తిగత నిమిత్తం విజయవాడకు వస్తే కలవమన్నానని వైవి సుబ్బారెడ్డి చిలక పలుకులు పలకడం విచిత్రంగా ఉంది. ఈ రోజుల్లో ప్రదానంగా రాష్ట్రపతి, ప్రధానమంత్రి వచ్చినప్పడు ద్వజస్థంభదర్శనం చేయడం ఆనవాయితీ, కానీ రహస్యంగా లాబీయింగ్ కోసమే విజయ్ కుమార్ స్వామి వచ్చాడని అర్డమవుతోంది. ఈ విషయం రాష్ట్రంలోని ప్రజలకు కూడా అర్థమయింది. విజయకుమార్ స్వామి కేవలం వైఎస్ వివేకానంద రెడ్డి హత్యలోనుండి అవినాష్ రెడ్డి తప్పించడం కోసం చేస్తున్న కుట్ర తప్ప మరోకటి లేదని జవహర్ అన్నారు.

LEAVE A RESPONSE