Suryaa.co.in

Andhra Pradesh

జడివానలో పల్లె పండగ..!

సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమాన్ని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ అట్టహాసంగా ప్రారంభించారు. ఉదయగిరి నియోజకవర్గం లోని జలదంకి మండలం, జలదంకి మరియు జమ్మలపాలెం గ్రామంలో జడివానను సైతం లెక్కచేయక స్థానిక మండల నాయకులు గ్రామ నాయకులతో కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారు. జలదంకి లో 20 లక్షలు జమ్మలపాలెం గ్రామంలోని మిక్సిడ్ కాలనీలో 20 లక్షల రూపాయలతో నిర్మించబోతున్న సిసి రోడ్డు కు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ శంకుస్థాపన చేశారు.

ముందుగా శిలాఫలకాన్ని ఆవిష్కరించి, సిసి రోడ్డు శంకుస్థాపనకు కొబ్బరికాయ కొట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉపముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సారధ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి గ్రామంలోని ముఖ్యమైన సమస్యలను అర్జీల రూపంలో తెలుసుకోవడం జరిగిందని, వాటి పరిష్కారం కోసం పల్లె పండుగ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 14వ తేదీ నుండి అనగా ఈరోజు సోమవారం నుండి 20వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రతిరోజు ఒక మండలం లో పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొంటానన్నారు.

ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మధుమోహన్ రెడ్డి ఎంపీపీ గోచిపాతల వెంకటరమణయ్య జడ్పిటిసి మేదరమెట్ల శివ లీలమ్మ సర్పంచ్ బుర్రి వేణి జాజుల కోటేశ్వరరావు నక్కా మాధవరావు పి మాలకొండయ్య సింగమనేని మనోజ్ కుమార్ కుట్టు బోయిన మాధవరావు పొట్లూరు వెంగమ్మ చలంచర్ల అనురాధ తదితరులు ఉన్నారు.

LEAVE A RESPONSE