– అపాయింట్మెంట్లన్నీ రద్దు
తాడేపల్లి: ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి జ్వరం వచ్చింది. ఆయనకు వైరల్ ఫీవర్ సోకడంతో బలహీనంగా ఉన్నారు. కేబినెట్ భేటీ తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. తర్వాత విశ్రాంతి తీసుకున్నారు. మధ్యాహ్నం తర్వాత సీఎం జగన్ ను కలిసేందుకు ఇచ్చిన అపాయింట్మెంట్లన్నీ రద్దు చేశారు. కేబినెట్ భేటీ సమయంలోనే సీఎం జగన్ కాస్త డల్ గా ఉన్నారని అంటున్నారు. జలుబు, దగ్గు కూడా ఉండటంతో వైరల్ ఫీవర్ గా గుర్తించారు. వైద్యుల సలహా మేరకు మెడికేషన్ ప్రారంభించి.. కాస్త విశ్రాంతి తీసుకోాలని సూచించారు. ఈ కారణంగానే అపాయింట్మెంట్లను రద్దు చేశారు.