నేను ఓటును మాట్లాడుతున్నా…
నన్ను ఇప్పుడు సంతలో పశువుల అమ్ముతున్నారు
తప్పు అమ్మేవాడిదా కొనేవాడిదా….
ఈ పశ్నకు సమాదానం స్వార్థానిదిదని అందరికీ తెలుసు…
ఓ ప్రజలారా…
నోటుకై ఓటును అమ్మినంతకాలం
మీకు వెన్నుపోట్లు..,ఆటుపోట్లు తప్పవు…
మీరు మారినప్పుడే మార్పు…
ఓటును అమ్ముకున్నంత కాలం
మీ ధైర్యం.. స్వేచ్ఛ… స్వతంత్రత
ఎవడి కాళ్ళకిందో బానిస అయితాయి…
మీ ఆత్మ గౌరవం ప్రాణమున్న శవం అయితది…
ఇకనైనా ఆలోచించండి…
ఓటుకో నోటు అనే మూఢాచారానికి ముగింపునీయండి…
ప్రశ్నించడంలో వెనుకబడ్డది…
తెలుగుదనమే…
చైతన్యం కోల్పోయి చిత్తుకాగితంలా మిగుతున్నది తెలుగు ప్రజానికమే…
ఓటు విలువను
ఓటు శక్తిని…
తెలుసుకుంటే…
మీ జీవితమే కాదు,వీధి వాడా,పల్లె పట్నం,జిల్లా రాష్ట్రం, దేశం అంతా అభివృద్ధి చెందుతుంది
అన్నింటా సమానత్వం సస్యశ్యామలం అవుతుంది…
ఓటుగా నేను కోరుకునేది ఒకటే…
నన్ను అంగడి వస్తువు చేయకండి…
మీరు ఆగమైపోకండి ..
ఓటు ప్రజాస్వామ్య బ్రహ్మాస్త్రం…
ఓటు ప్రజల పురోగతి మంత్రం…
ఓటు అంబేద్కర్ హృదయ వికాసం…
ఓటను నన్ను సరిగ్గా ఉపయోగించండి…
ఉజ్వల భవిష్యత్తుకు ఊపిరిపోయండి …
– మెడబలిమి వెంకటేశ్వరరావు