Suryaa.co.in

Andhra Pradesh

బొల్లా, జోగికి ఓటర్ల షాక్

– మీసం తిప్పిన జీవీ
వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుకు షాకిచ్చారు. ఎమ్మెల్యే సొంత మండలం శావల్యాపురం జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. 1046 ఓట్లు మెజారిటీతో టీడీపీ అభ్యర్థి హైమావతి గెలిచారు. జడ్పీటీసీ ఎన్నికను మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సవాలుగా తీసుకున్నారు. వినుకొండ నియోజకవర్గ టీడీపీ నేతలు నూతనోత్సాహంతో ఉన్నారు. మరోవైపు కృష్ణా జిల్లాలో వైసీపీ నేత జోగి రమేష్‌కి పెడన ప్రజలు షాకిచ్చారు. పెడన జడ్పీటీసీగా టీడీపీ అభ్యర్థి ఆర్జా నగేష్ 644 ఓట్ల గెలుపొందారు. అలాగే పామిడి మండలం గజరాంపల్లి ఎంపీటీసీగా టీడీపీ అభ్యర్థి రామలక్ష్మి 202 ఓట్లతో గెలిచారు.

LEAVE A RESPONSE