Suryaa.co.in

Andhra Pradesh

ముస్లిం లకు ఉచిత విద్య అందించేందుకు వక్ఫ్ బోర్డ్ నూతన పథకం

– 933 ఎకరాల వక్ఫ్ భూమిని 3 ఏళ్లకు లీజుకు ఇవ్వనున్నాం
– కమర్షియల్ భూములను అభివృద్ధి చేసేందుకు ఈఓఐ కింద ఆహ్వానిస్తున్నాం
– జాతీయ, అంతర్జాతీయ డెవలపర్ లు, పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలి
– వక్ఫ్ ఆస్తుల అద్దె సవరణకు రెంట్ రివ్యూ కమిటీ ను నియమించాం
– అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన 3 వ వక్ఫ్ బోర్డ్ సమావేశం.
– ప్రవేశపెట్టిన అజెండాల పై ఏకగ్రీవ తీర్మానం
– ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ షేక్. అబ్దుల్ అజీజ్

విజయవాడ: కాళేశ్వర రావు మార్కెట్ వద్ద గల ఏపీ వక్ఫ్ బోర్డ్ కార్యాలయంలో ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన 3 వ బోర్డ్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రవేశపెట్టిన అజెండా లపై ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా పలు మ్యానేజింగ్ కమిటీలు, పలు ముతవల్లీలను నియమించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, ముస్లిం లకు ఉచిత విద్య అందించేందుకు నూతన పథకాన్ని ప్రారంభిస్తున్నామని అతి త్వరలో దాని వివరాలు తెలియచేస్తామని అన్నారు.

వక్ఫ్ ఆస్తుల అద్దె ల సవరణకు రెంట్ రివ్యూ కమిటీ ను నియమించామని తెలిపారు. 2025-26 నుంచి 2027-28 సంవత్సరాలకు గాను డైరెక్ట్ మ్యానేజ్మెంట్ లో ఉన్న 933 ఎకరాల వక్ఫ్ ఆస్తులను లీజుకు ఇవ్వనున్నామని తెలిపారు. రాష్ట్రంలో వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగపడే వక్ఫ్ భూములను అభివృద్ధి చేయడానికి, జాతీయ, అంతర్జాతీయ స్థాయి డెవలపర్లను, సంస్థలను, పారిశ్రామిక వేత్తలను దీర్ఘకాలిక లీజు లేదా పబ్లిక్ – ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ ) ద్వారా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ కింద ఆహ్వానిస్తున్నామని తెలిపారు.

ఈ భూములపై సౌర విద్యుత్ ప్రాజెక్టులు, పారిశ్రామిక సంస్థలు, వాణిజ్య కాంప్లెక్సులు, విద్యా సంస్థలు, హాస్పిటల్‌లు, ఇతర వాణిజ్య ప్రాజెక్టులు అభివృద్ధి చేసే అవకాశం ఉందని వివరించారు. సమావేశంలో బోర్డ్ సభ్యులైన శాసనమండలి సభ్యులు మొహమ్మద్ రుహుల్లా, శాసనసభ్యులు మొహమ్మద్ నసీర్, ఖాజా, అక్రమ్, ఇస్మాయిల్ బేగ్, ఆఫియా, ముక్రం హుస్సేన్, దావూద్ భాషా బఖావి, బేపారి జాకీర్ అహమద్ సీఈఓ మొహమ్మద్ అలీ వక్ఫ్ అధికారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE