వైఎస్సార్‌సీపీలో వర్గాల్లేవు.. ఉన్నవారంతా జగన్‌ సైనికులే: అనిల్‌ కుమార్‌

Spread the love

నెల్లూరు : నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేపట్టిన జగనన్న మాట – గడపగడపకు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి బాట కార్యక్రమానికి మాజీ మంత్రి, సిటీ ఎమ్మెల్యే డాక్టర్‌ పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌ సంఘీభావం తెలిపారు. రూరల్‌ పరిధిలోని సజ్జాపురంలో శ్రీధర్‌రెడ్డి పాదయాత్ర చేశారు. మధ్యాహ్నం విరామ సమయంలో ఆయన్ను అనిల్‌ కలిశారు.

ఈ సందర్భంగా అనిల్‌ మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీలో వర్గాలు లేవు. వైఎస్సార్‌సీపీలో ఉన్నవారంతా వైఎస్‌ జగన్‌ సైనికులే. జగనన్న మాట – గడపగడపకు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి బాట కార్యక్రమం ద్వారా కోటంరెడ్డి ప్రజలకు ఆయన మరింత చేరువవుతున్నారన్నారు. ఆయన మూడోసారి కూడా రూరల్‌ నుంచి అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా ఎన్నికవడం ఖాయమని చెప్పారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి పాల్గొన్నారు

Leave a Reply