Suryaa.co.in

Telangana

కేంద్ర నుంచి చట్ట ప్రకారం రావాల్సిన నిధులు తెస్తున్నాం

– శాసనమండలిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రిగా నేను, మా సహచర మంత్రులు ఎప్పటికప్పుడు కేంద్ర మంత్రులను కలిసి సమాఖ్య స్ఫూర్తిని గౌరవిస్తూ  చట్ట ప్రకారం మాకు రావాల్సిన నిధుల వాటా ఇంత ఉంది ఆ మేరకు నిధులు ఇవ్వాలని కోరుతున్నాం. ఆ మేరకు నిధులు తీసుకొస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు.

బుధవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వివిధ పథకాల కింద రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధుల వివరాలపై ప్రశ్నించగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వం పది ఏళ్లలో సాధించిన దాని కంటే మా ప్రభుత్వం కేంద్రం నుంచి అధికంగా నిధులు సాధించిందని డిప్యూటీ సీఎం వివరించారు.

గత పది సంవత్సరాలుగా కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధులు, గత ఏడాది కాలంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధుల వివరాలతో తాను సభకు వచ్చానని తెలిపారు. కేంద్రం రాష్ట్రానికి నేరుగా నిధులు కేటాయించదు.

ఆ ప్రభుత్వం నిర్దేశించుకున్న ప్రత్యేక పథకాల ద్వారా నిధులు కేటాయిస్తుందని వివరించారు. మా ప్రభుత్వం ప్రతి విషయంలోనూ పారదర్శకంగా ఉంటుంది, మేము ఏ వివరాలను దాచుకునే వాళ్ళం కాదని అన్నారు. కేంద్రం జీఎస్టీ బిల్లును తీసుకురాగా గత ప్రభుత్వం మద్దతునిచ్చిందని.. ఆ తర్వాత వారు బిజెపితో వైరం పెట్టుకున్నారని అన్నారు.

LEAVE A RESPONSE