– ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ,కార్పొరేషన్ మాజీ చైర్మన్ గాదరి బాలమల్లు ,బొమ్మెర రామమూర్తి ,గుడాల భాస్కర్
హైదరాబాద్: సంవత్సరం అయినా ప్రభుత్వం ఇచ్చిన హామీలు
అమలు చేయలేదు. ప్రజాపాలన పేరుతో అప్లికేషన్లు తీసుకున్నారు. చాలా ప్రాంతాల్లో అప్లికేషన్లు రోడ్లపై పడేశారు. గ్రామ సభలు ప్రజా ఆగ్రహ సభలుగా మారాయి. 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. పోలీసు పహారాలో గ్రామ సభలు జరుగుతున్నాయి.
ఎమ్మెల్యేలు,మంత్రులు ఎందుకు గ్రామ సభల్లో పాల్గొనడం లేదు? ప్రజల ఆగ్రహం చూసి మంత్రులు గ్రామాల్లోకి వెళ్లడం లేదు. మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి నాలుగు పధకాలు ప్రారంభం చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి జనవరి 26న రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు పధకాలను ప్రారంభం చేస్తామని అన్నారు. ఫిబ్రవరి వరకు లబ్ధిదారులు అప్లికేషన్లు పెట్టుకోవాలని పొంగులేటి అంటున్నారు. సీఎం,మంత్రుల మాటకు విలువ లేదు.
అప్లికేషన్ల పేరుతో ప్రజలను జిరాక్స్ షాపుల ముందు నిలబెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే పధకాలు అని ఎమ్మెల్యేలు అంటున్నారు. పధకాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అయితే గ్రామ సభలు ఎందుకు? ప్రభుత్వ తీరుతో ప్రజలు,అధికారులు ఇబ్బంది పడుతున్నారు.
రాష్ట్రంలో 12 వేల గ్రామ పంచాయతీలు ఉంటే 600 గ్రామాలు ఎంపిక చేసి నాలుగు పధకాలు ప్రారంభం చేస్తామని భట్టి అంటున్నారు. కాంగ్రెస్ మంత్రులు సెక్రటేరియట్ లో కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారు. కేసీఆర్ హయాంలో కట్టిన ప్రభుత్వ భవనాల్లో కూర్చుని కేసీఆర్ ఏం చేశారని అంటున్నారు. తెలంగాణ సమాజం కాంగ్రెస్ నేతలను ఉరికించే పరిస్థితి వస్తుంది.
గ్రామ సభల్లో ప్రజలు కాంగ్రెస్ నేతల వీపులు విమానం మోత మోగించారు .నొప్పులను తగ్గించుకునేందుకు కాంగ్రెస్ నేతలకు జండుబామ్,జిందా తిలిస్మాత్ పంపిస్తున్నాం.