Suryaa.co.in

Andhra Pradesh

ఈ ఎమ్మెల్యే మాకొద్దు బాబోయ్

– పొన్నూరు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కార్యకర్తలు
– ఎంపీ ఆళ్ళ,మర్రి ఎదుట వాపోయిన వైనం

పొన్నూరు నియోజకవర్గంలోని వైకాపా నాయకులతో పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి,మర్రి రాజశేఖర్ లు సమావేశం అయ్యారు. సమావేశంలో పొన్నూరు నియోజకవర్గంలోని అందరి నాయకులతో విడివిడిగా మాట్లాడడంతో వారు ప్రజాప్రతినిధిపై అసమ్మతి గలాన్ని వినిపించారు.

వాస్తవానికి కొందరితో మాత్రమే సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఆ సమాచారం కాస్త ఒకరి నుంచి మరొకరికి చేరి నియోజకవర్గంలోని అందరూ నాయకులు వచ్చారు. ఇందులో నియోజకవర్గ ప్రజా ప్రతినిధి పై అసంతృప్తితో ఉన్న వారు కొందరులైతే గతంలో పార్టీలో ఉన్న మరో నేతకు చెందిన అనుకూల వర్గం నాయకులు ఉన్నారు. వీరి మధ్య మొదలైన చిన్నపాటి సంభాషణ కాస్త స్వల్ప వాద్వాదానికి దారి తీసింది.

వెంటనే ప్రాంతీయ సమన్వయకర్తలు మర్రి రాజశేఖర్ పార్టీ నాయకులకు సర్దిచెప్పి సమావేశాన్ని ప్రారంభించారు. నాయకులను ఒకరి తరువాత మరొకరిని పిలిపించి మాట్లాడారు నియోజవర్గంలో పార్టీ పరిస్థితులపై పార్టీ సమన్వయకర్తలు ఆరా తీశారు. ఏ ఏ అంశాల్లో నియోజవర్గ ప్రజాప్రతినిధితో ఇబ్బందులు ఉన్నాయనే విషయాలను పార్టీ సమన్వయకర్తలకు వివరించారు.

LEAVE A RESPONSE