– డ్రగ్స్ మాఫియాలో ఉన్న వైసిపి నేతల లిస్టు మా వద్ద ఉంది
– డ్రగ్స్ దందాలో వ్యవహారంలో వైసీపీ వారికి సంబంధమే లేదని సజ్జల ఎలా చెబుతారు?
– సుధాకర్, అలీషా,ద్వారంపూడికి ఉన్న సంబంధాలు ఏమిటో సజ్జలకు తెలియదా?
– అనిల్ రెడ్డికి ఐవరీ కోస్ట్ కు ఉన్న సంబంధాలు, ఆఫ్రికాలో చేసే వ్యాపారాలు త్వరలో బయటకొస్తాయ్
– టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్
రాష్ట్రం నడిబొడ్డున ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇంటికి కూతవేటు దూరంలో విజయవాడ సత్యనారాయణపురంలో ఆషి ట్రేడింగ్ కంపెనీ పేరుతో గత ఏడాది కాలంగా వేలకోట్ల విలువైన హెరాయిన్ దిగుమతి అవుతుండగా… ముఖ్యమంత్రి జగన్ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ముంద్రాలో దొరికితే మాకేం సంబంధం అని చెప్పడం సిగ్గుచేటు. ఆషీ ట్రేడింగ్ కంపెనీ పేరుతో గుజరాత్ లోని ముంద్రాపోర్టులో గతనెల 15వతేదీన డిఆర్ఐ అధికారులు 21వేల కోట్ల రూపాయల విలువైన 3టన్నులహెరాయిన్ పట్టుకోవడంతో యావత్ దేశంతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఉలిక్కిపడింది. తాలిబన్ల రాజ్యమైన ఆఫ్ఘనిస్తాన్ నుంచి విజయవాడ నడిబొడ్డున ఉన్నఅషీ ట్రేడింగ్ కంపెనీ చిరునామాతో హెరాయిన్ రావడం ఏపీవాసులను షాక్ కు గురిచేసింది. తదనంతర పరిణామాలను గమనిస్తే హెరాయిన్ స్మగ్లింగ్ వ్యవహారంలో వైసీపీ నేతలపాత్ర క్రమక్రమంగా బయటపడుతూ వస్తోంది. ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఆంధ్రప్రదేశ్ హెరాయిన్ లింకులపై టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ బుధవారం ఆయన కాకినాడలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరించారు.కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విలేకరుల వివరాలు ఆయన మాటల్లోనే …
విజయవాడ ఆషీ ట్రేడింగ్ కంపెనీ పేరుతో వచ్చిన కన్ సైన్ మెంట్ లో గతనెల 15వతేదీన 21వేల కోట్లరూపాయల హెరాయిన్ పట్టుబడితే దీనికి సంబంధించిన పాత్రధారుల ప్రమేయంపై రాష్ట్ర పోలీస్ శాఖ లోతుగా దర్యాప్తు జరపకుండా హెరాయిన్ మాఫియాను కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం అత్యంత బాధాకరం. ఆంధ్రప్రదేశ్ కు పరువుప్రతిష్టలకు సంబంధించిన ఈ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ చొరవ తీసుకుని లోతుగా మాదకద్రవ్యాల వ్యవహారంపై సమాచారాన్ని సేకరించి ఎప్పటికప్పుడు ప్రచార మాధ్యమాల ద్వారా ప్రజల ముందుంచడం జరుగుతోంది. ఈ వ్యవహరంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న మీడియాముందు ఏవేవో కాకమ్మ కబుర్లు చెబుతున్నారు.
డ్రగ్స్ దందాతో వైసీపీకి లేని లింకులను తాము కలుపుతు న్నామని చెబుతున్నారు.. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి, సముద్రపు దొంగగా పిలువబడుతున్న అలీషాకు ఉన్న సంబంధ మేంటో సజ్జలే స్వయంగా ద్వారంపూడిని అడిగి తెలుసుకోవాలి. అలీషా కుమార్తె పేరు అయేషా, ఆమెనే ముద్దుగా అషీ అని పిలుచుకుంటారు.. ఆ పేరుతో అషీ ట్రేడింగ్ కంపెనీని విజయవాడలో ప్రారంభించి నేరుగా ఆ చిరునామాతో గుజరాత్ లోని ముంద్రా పోర్టుకి హెరాయిన్ ఎలా వచ్చిందో సజ్జల ఏనాడైనా ఆలోచించాడా? దానిపై డీజీపీగానీ, ఇతర పోలీస్ అధికారులు గానీ ఆరా తీశారా? ద్వారంపూడికి స్మగ్లర్ అలీషాకు, అలీషాకు అషీ ట్రేడింగ్ కంపెనీ యజమాని మాచవరపు సుధాకర్ కు ఉన్న సంబంధాలపై సజ్జల ఏనాడైనా ప్రశ్నించాడా?
ఈ విధంగా కళ్లకు గంతలు కట్టినట్లు ఒకదానితో ఒకటి సంబంధాలు స్పష్టంగా కనిపిస్తుంటే టీడీపీవారు లింకులు కలుపుతున్నారని సిగ్గులేకుండా చెబుతారా? స్వయంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డే తాను ఐవరీకోస్ట్ కు వెళ్లానని చెప్పాడు. అతను అక్కడికి ఎందుకువెళ్లాడో, అక్కడ వ్యాపారాలున్నాయని ద్వారంపూడి ఎందుకుచెప్పాడో సజ్జల ఆయననే అడగాలి. ఐవరీకోస్ట్ ప్రాంతం హెరాయిన్, ఇతర మాదకద్రవ్యాలకు అడ్డా అని తెలిసినా సజ్జల ఏమీతెలియనట్లుగా తనపార్టీవారిని వెనకేసుకొస్తున్నాడు. డ్రగ్స్ వ్యవహారంలో వైసీపీ నేతల ప్రమేయం కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంటే సజ్జల టీడీపీ వారిని ఆడిపోసుకుంటున్నాడు. ఐవరీకోస్ట్ ప్రాంతానికి వైసీపీఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఉన్న సంబంధమేంటి? అషీ ట్రేడింగ్ కంపెనీ యజమాని సుధాకర్ కు అలీషాకు ఉన్న లింకేమిటి? అలీషాకు, వైసీపీఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఉన్న సంబంధా లేమిటి? ఇవేవీ సజ్జలకుతెలియదా.. వాటి గురించి తెలిసీ తెలియనట్లు నటిస్తున్నాడా?
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నియంతకాబట్టి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం లేవనుకుంటున్నారా? కాకినాడకు వస్తే ద్వారంపూడి లారీలతో తొక్కిస్తాడా? ఎంతమందిని తొక్కిస్తారు….నేడు టీడీపీనేతలందరం మీడియాతోకలిసి కాకినాడ లోనే తిరుగుతాం. దమ్ముంటే తొక్కించమనండి చూద్దాం.. ఎందరిని తొక్కిస్తాడో ? ద్వారంపూడి ఖబడ్దార్… అతని బెదిరింపులకు భయపడేవాళ్లెవరూ లేరు. స్మగ్లర్ అలీషాను వెంటబెట్టుకొని మరీ ద్వారంపూడి, జిల్లాఎస్పీ వద్దకు ఎలా తీసుకెళ్లాడు? చంద్రబాబుకు అలీషాకు సంబంధముందని తాడేపల్లి పెదపాలేరు అంటున్నాడు. టీడీపీనేతలెవరూ అలీషాతో తిరిగింది లేదు. అతన్ని చంద్రబాబుదగ్గరకో, పోలీసులవద్దకో తీసుకెళ్లిందీ లేదు. విశాఖపట్నంలో భారత నావీ విభాగం నిర్వహించిన ఫ్లీట్ రివ్యూలో నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు సాధారణ సందర్శకుల మాదిరిగా ఆలీషా కలిశారు. ఆయన పక్కన నావీ అధికారి, ప్రస్తుత రాష్ట్ర రవాణా అధికారి కృష్ణబాబు కూడా అక్కడే ఉన్నారు. ద్వారంపూడిలా ములాఖత్ లుఏర్పాటుచేసిందీ లేదు, ఆలీషా సమర్థవంతమైన వ్యాపారవేత్త అని సర్టిఫై చేయలేదు.
అషీ ట్రేడింగ్ కంపెనీ యజమాని. సుధాకర్ గతంలో అలీషావద్ద పని చేసింది నిజంకాదా? అలీషాకు, ద్వారంపూడికి మంచి సంబంధా లున్నది నిజంకాదా? ఆఫ్ఘనిస్తాన్ కు దొంగబియ్యం సరఫరా చేయడం, అక్కడినుంచి హెరాయిన్ తీసుకురావడమే ద్వారంపూడి చేసే పని. ముఖ్యమంత్రి సోదరులు సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డిలకు రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ పేరుతో టాంజానియా, మొజాంబిక్, ఐవరీకోస్ట్ ప్రాంతాల్లో వ్యాపారాలు న్నది నిజంమా..కాదా? మీరుచేసే తప్పుడు పనులకు అక్కడిదేశాల్లో దుకాణాలు తెరిచారా? వాటిని అడ్డంపెట్టుకొనే ప్రపంచవ్యాప్తంగా మాదకద్రవ్యాల వ్యాపారంచేస్తున్నారా? అక్కడ అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డికి ఏం వ్యాపారాలున్నాయో తాడేపల్లి ప్యాలెస్ పెదపాలేరు సమాధానంచెప్పగలడా? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని అడ్డంపెట్టుకొని ముఖ్యమంత్రి సోదరులైన అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డే
మాదకద్రవ్యాల వ్యాపారంచేస్తున్నారు. గుజరాత్ లో హెరాయిన్ పట్టుబడిన మరుసటిరోజే కాకినాడ తీరంలో బోటు తగలబడింది. కాకినాడతీరంలో బోటు తగలబడినప్పుడు తెల్లటిపొగ ఎందుకొచ్చింది? బోటు తగలబడితే డీజీపీ దానిపై ఎందుకుదర్యాప్తు జరిపించలేదు? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సోదరుడు వీరభద్రారెడ్డి పోర్టు ఎమ్మెల్యేగా చలామణీ అవుతున్నాడు. కాకినాడ పోర్టుని అలీషాని తన చెప్పుచేతల్లో పెట్టుకొని దానిద్వారానే మత్తుపదార్థాలను ఐవరీకోస్ట్ వంటి దేశాలకు ఎగుమతిచేస్తున్నాడు.
ఈ విధంగా వాస్తవాలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంటే, లింకులు ఎక్కడినుంచి ఎక్కడికి, ఎవరితో ఉన్నాయో సజ్జలకు కనిపించడం లేదా? మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత ఆదేశాలతో నేడు టీడీపీ బృందం కాకినాడలో పర్యటించి ద్వారంపూడి చీకటివ్యాపారాలను బట్టబయలు చేయాలని మేం నిర్ణయించాం. డ్రగ్స్ దందాకు సంబంధించి తమవద్ద ఉన్న ఆధారాలను కేంద్ర నిఘాసంస్థలకు అందిస్తాం. అవసరమైతే ఢిల్లీవెళ్లి, ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు జరపాలని కోరతాం. అప్పుడే రాష్ట్రంకేంద్రంగా వైసీపీ నేతలు సాగిస్తున్న గంజాయి, ఇతరమాదకద్రవ్యాల వ్యవహారం తాలూకా గుట్టుబయటపడుతుంది. అప్పటివరకు దీన్ని అంతతేలిగ్గా వదిలేదిలేదని ఈసందర్భంగా స్పష్టం చేస్తున్నాం.
మత్తుపదార్థాలు, ఇతరవ్యవహారాలకు సంబంధించిన సాక్ష్యాలను రూపుమాపే పనిలో విజయసాయిరెడ్డి ఉన్నట్లుగా కన్పిస్తోంది, అందుకే ఆయన కనిపించడంలేదు. ఎ2 పాస్ పోర్టు న్యాయస్థానం సీజ్ చేస్తే కోర్టుద్వారా ప్రత్యేక అనుమతులు పొంది మరీ ఏ2 విజయసాయిరెడ్డి దుబాయ్ వెళ్లాడు. అకస్మాత్తుగా విజయసాయి రెడ్డికి దుబాయ్ వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందో, ఎందుకొచ్చిం దో తాడేపల్లి పెద పాలేరు సమాధానంచెప్పాలి. ఎప్పుడూలేని విధంగా రాష్ట్రంలోనే గంజాయి, ఇతరమాదకద్రవ్యాలు ఎందుకు పట్టుబడుతున్నాయి.
అవి ఎక్కడినుంచి రాష్ట్రానికి వస్తున్నాయి? కట్టుదిట్టమైన భద్రతాఏర్పాట్లు ప్రభుత్వం నిజంగాచేస్తే, గంజాయి సాగు, దాని అమ్మకాలు, రవాణా ఎలా జరుగుతోంది? ఇంత జరుగుతుంటే ఏపీపోలీస్ గడ్డిపీకుతోందా? తాడేపల్లిప్యాలెస్ ఆడమన్నట్లు ఆడుతుంటే పోలీస్ శాఖ చోద్యం చూస్తోందా? ఎస్ఈబీ సేల్స్ ఎంకరేజ్ మెంట్ బ్యూరోగా మారిందని గతంలోనే చెప్పాము. మంత్రి కన్నబాబు ఎంతఅరిచి గీపెట్టినా, వాస్తవాలు ఆయన చెప్పేదానికి పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. అతిత్వరలోనే కేంద్ర ప్రభుత్వ నిఘాసంస్థలకు వైసీపీ దొంగలుపట్టుబడటం ఖాయం.
రాష్ట్రంలో ఏమీజరగకుండానే కేంద్ర సంస్థఅయిన డీఆర్ఐ వారు పొరుగురాష్ట్రాలను, సరిహద్దులవద్ద అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారా? గంజాయి వ్యాపారంతో డీఐజీ త్రివిక్రమవర్మకు సం బంధాలు లేవా? అలాంటివ్యక్తిని రాజధానిప్రాంతంలో డీఐజీగా నియమిస్తారా? ఒకస్మగ్లర్ ను వెంటబెట్టుకొని మరీ, ద్వారంపూడి ఎస్పీవద్దకు ఎందుకుతీసుకెళ్లాడు? స్మగ్లర్లకోసం, ఇంకొకరికోసం టీడీపీఏనాడూ పైరవీలుచేయలేదు. ఇవన్నీ ఒకదానితోఒకటి లిం కులుండబట్టే రాష్ట్రంలోఅధికారపార్టీనేతల కనుసన్నల్లోనే గంజాయి , ఇతరమాదకద్రవ్యాల వ్యాపారం పెద్దఎత్తునసాగుతోంది. ముఖ్యమంత్రికి, ఆయనకుటుంబసభ్యులకు కూడా ఈ వ్యాపారంతో సంబంధముంది. చెన్నైకేంద్రంగా వై.ఎస్.అనిల్ రెడ్డి,సునీల్ రెడ్డి ఏం చేస్తున్నారు? ఆఫ్రికాకేంద్రంగా ఉన్నఏడెనిమిది దేశాల్లో వారికి ఉన్న వ్యాపారేమిటి? ఐవరీకోస్ట్ లో అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డికి వ్యాపారాలుఎందుకున్నాయో సజ్జలే చెప్పాలి.
అషీ ట్రేడింగ్ కంపెనీ పేరుతోఎప్పుడైతే ముంద్రాపోర్ట్ లో మాదకద్ర వ్యాలుపట్టుబడ్డాయో, అప్పుడే టీడీపీతరుపున తాము ప్రశ్నించాము. స్థానిక మీడియాతోపాటు, జాతీయమీడియాకూడా రాష్ట్రంలో సాగుతున్న మాదకద్రవ్యాలపై ప్రశ్నిస్తోంది. వైసీపీ సెక్షన్లప్రకారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా లారీలతో తొక్కిస్తారా? ఒకఎమ్మెల్యేగా ఉన్నవ్యక్తి, లారీలతో తొక్కించి చంపేస్తానన్నప్పు డు పోలీస్ వారికి అదినేరంలా కనిపించలేదా? టీడీపీవారు ఏదైనా కార్యక్రమానికి పిలుపివ్వడమే ఆలస్యం, పోలీసులు తెల్లారకముం దే ప్రతిపక్షనేతలఇళ్లముందు ప్రత్యక్షమవుతారు. వైసీపీనేతలు ఏంచేసినా, ఎలా బెదిరించినా మాత్రం వారుపట్టించుకోరు? మా దగ్గర డ్రగ్స్ దందాలో వైసీపీనేతలప్రమేయం, పాత్రకు సంబంధించి పెద్ద లిస్టే ఉంది. దానికి తాడేపల్లి పాలేరు సమాధానంచెప్పాలి. కేంద్రప్రభుత్వ నిఘా సంస్థలు దర్యాప్తుచేస్తున్నాయి కదా అని ఏపీ పోలీస్ చేతులుకట్టుకొని కూర్చుంటుందా? వారిపనివారు చేయాలి కదా? అందుకే తాముసేకరించిన సమాచారాన్ని కేంద్రప్రభుత్వ దర్యాప్తుసంస్థలకు అందించాలని నిర్ణయించుకున్నాము.
నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఉపముఖ్యమంత్రి, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రయ్యాక రాష్ట్రంలో మాదకద్రవ్యాలు విచ్చలవిడిగా చలామణీ అవుతున్నాయి. డ్రగ్స్ వ్యవహారంలో వైసీపీనేతల హస్తం, జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉన్నాయన్నది నూరుశాతం నిజం.. డ్రగ్స్ తో సమాజం పాడైపోతున్నా, ముఖ్యమంత్రి జగన్ కు డబ్బు పిచ్చ పట్టుకుని ఆర్థిక ఉన్మాదిలా మారారు. ప్రశాంతమైన కాకినాడ కేంద్రంగా డ్రగ్స్ దందాసాగడం, దాన్ని అధికారపార్టీ వారే నిర్వహించడం బాధాకరం. బెదిరింపులతో టీడీపీని ఆపలేరని వైసీపీనేతలు గుర్తుంచుకుంటే మంచిది.
వనమాడి కొండబాబు, కాకినాడ మాజీ శాసనసభ్యులు
రాష్ట్రాన్ని హెరాయిన్ హబ్ గామార్చారు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రయ్యాక రాష్ట్రపరువు ప్రతిష్టలు దిగజారాయి, యువత భవిష్యత్ అంధకారమైంది, విద్యార్థులు, యువత, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయసంఘాలే రాష్ట్రంలో పెచ్చు మీరుతున్న డ్రగ్స్ మాఫియాను నిలువరించాలి. డీజీపీ సవాంగ్ తీరుచూస్తుంటే డ్రగ్స్ దందాచేస్తున్నవారికి సహకరిస్తున్నట్టు స్పష్టమవుతోంది. చిల్లర కేసులు పెట్టి టిడిపి సీనియర్ నేతలను అరెస్ట్ చేస్తున్న పోలీసులు ఇంతపెద్ద డ్రగ్స్ వ్యవహారంలోఉన్నవారిని ఎందుకు అరెస్ట్ చేయడంలేదు? విలేకరులను లారీతో తొక్కించిచంపేస్తానని ద్వారంపూడి అన్నమాట డీజీపీకి వినిపించలేదా? అతన్ని అరెస్ట్ చేయడానికి ఆ ఆధారం సరిపోదా? ద్వారంపూడి గతంలో దొంగనోట్లు ఏటీఎమ్ లలో పెట్టించేవాడు. అలాంటివ్యక్తి ఇప్పుడు డ్రగ్స్ డాన్ గా మారాడు. ప్రపంచ వ్యాప్తంగా మాదకద్రవ్యాలను సరఫరాచేయడానికే ద్వారంపూడి ఐవరీకోస్ట్ లో గోదాములు నిర్మిస్తున్నాడు.
నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మాజీ శాసనసభ్యులు
బియ్యం ఎగుమతుల ముసుగులో కాకినాడనుంచి వెస్ట్ ఆఫ్రికాకు డ్రగ్స్ ఎగుమతి చేస్తున్నారు. వాస్తవాలను బయటపెట్టినవారిని లారీలతో గుద్దిస్తామనడం ఎలాంటి ప్రజాస్వామ్యం? బియ్యం వ్యాపారంలో రారాజులమని చెప్పుకునేవారు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పేరుతో రైతులనుంచి సేకరించిన ధాన్యాన్ని ఏం చేశారు? రబీసీజన్ లో రూ.4వేలకోట్లవిలువైన ధాన్యాన్ని సేకరించి మిల్లింగ్ జరిపారు. ఆ బియ్యం మాయమైతే సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఏంచేస్తోంది? నెల్లూరులో స్టేజ్-1 కాంట్రాక్టర్ గోడౌన్ లో ఉండాల్సిన 870 మెట్రిక్ టన్నులబియ్యం మాయమైతే దానిపై 6(ఏ) కింద సాదాసీదా కేసుపెట్టి తర్వాత తీసేశారు.
అక్కడ బియ్యాన్ని మాయంచేసిన కోదండరామిరెడ్డి అనే కాంట్రాక్టర్ కే ప్రభుత్వపెద్దలు రూ.600కోట్ల విలువైన గన్నీబ్యాగ్స్ తయారీ కాంట్రాక్ట్ కట్టబెట్టారు. వైసీపీ నేతలు, సివిల్ సప్లయిస్ విభాగం కాంట్రాక్టర్లు కలిసి ఉభయగోదావరి జిల్లాల్లో రూ.2వేలకోట్ల రైతులసొమ్ము దోచేశారు. బియ్యాన్ని ఎగుమతిచేస్తూ రాష్ట్రానికి హెరాయిన్ దిగుమతి చేసుకుంటున్నారు. వీటన్నింటిపై జగన్మోహన్ రెడ్డి ఎందుకు నోరుతెరవడంలేదు? జగన్మోహన్ రెడ్డి అరాచకం, అవినీతి, ధనదాహానికి అంతు లేకుండాపోయింది. జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రభుత్వ అరాచకాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ప్రజలు తమను గమనిస్తున్నారని తెలియబట్టే, వైసీపీనేతల్లో అసహనం పెరిగిపోయింది. అందుకే లారీలతో తొక్కిస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. ఇంత జరుగుతుంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తోంది? కేంద్రప్రభుత్వ నిఘాసంస్థలు దర్యాప్తు జరిపి, అసలుదోషులను బయటపెట్టేవరకు టీడీపీ ఈ వ్యవహారాన్ని వదిలిపెట్టదని స్పష్టం చేస్తున్నాం.విలేకరుల సమావేశలో తుని నియోజకవర్గ టిడిపి ఇన్ ఛార్జి యనమల కృష్ణుడు, మాజీఎమ్మెల్యే వర్మ, టీడీపీ అధికారప్రతినిధి ఆనంద్ సాగర్, టిఎన్ టియుసి రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు తదితరులు పాల్గొన్నారు.