Suryaa.co.in

Telangana

బీసీ సబ్ ప్లాన్ తీసుకువస్తాం

-కాంగ్రెస్ అభయాస్తం మేనిఫెస్టో విడుదల
– దొరల తెలంగాణ కి ప్రజల తెలంగాణ కి మధ్య పోరు
– CLP నేత భట్టి విక్రమార్క

తెలంగాణ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రూపొందించిన అభయహస్తం మానిఫెస్టో ను మల్లికార్జున ఖర్గే విడుదల చేయడం సంతోషంగా ఉంది.అభయహస్తం మేనిఫెస్టో పీపుల్స్ మేనిఫెస్టో, ఇది పీపుల్స్ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి ధోహధపడుతుంది తెలంగాణ ధనిక రాష్ట్రం, సంపద ఉన్న రాష్ట్రం ప్రజల జీవితాలను మార్చడానికి తెలంగాణ కావాలని కోరి కొట్లాడితే పెద్దలు తెలంగాణ ఇచ్చారు. తెలంగాణ వచ్చింది కానీ ప్రజలకు మాత్రం సంపద అందలేదు.

నీళ్ళు, నిధులు, నియామకాలు అనే ఆకాంక్షలను కాంగ్రెస్ పూర్తిగా సాకారం చేస్తుంది.బలహీన వర్గాల అభివృద్ధి కోసం బీసీ సబ్ ప్లాన్ తీసుకువస్తాం.రాహుల్ గాంధీ చెబుతున్నట్టుగా దేశంలో కుల గణన జరగాల్సిన అవసరం ఉంది. అధికారంలోకి రాగానే తెలంగాణలో కులగణన చేస్తాం.రైతులకు రెండు లక్షల రుణమాఫీ అమలు చేయడంతో పాటు కవులు రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తాం. గత ప్రభుత్వాలు పంపిణీ చేసిన అసైన్డ్ భూములు బిఆర్ఎస్ ప్రభుత్వం బలవంతంగా గుంజుకున్నది. ఈ భూములను తిరిగి ప్రజలకు పంపిణీ చేస్తామని చెప్పడం గొప్ప విషయం.

ప్రజలకు సంపద ఎలా ప్రజలకు పంచాలో కాంగ్రెస్ మానిఫెస్టో లో పొందుపరిచారు. దొరల తెలంగాణ కి ప్రజల తెలంగాణ కి మధ్య పోరు అని రాహుల్ గాంధీ చెప్పారు. ఇది ప్రజల మేనిఫెస్టో ఇంకా తెలంగాణలో ప్రజా ప్రభుత్వం రాబోతుంది. కాంగ్రెస్ మేనిఫెస్టోను పార్టీ శ్రేణులు ఇంటింటికి తీసుకువెళ్లి ప్రజలకు వివరించి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి పనిచేయాలి. ప్రజల సంపద ప్రజలకు పంచేదానిలో కాంగ్రెస్ శ్రేణులు భాగస్వామ్యం కావాలని పిలుపునిస్తున్న

LEAVE A RESPONSE