మంత్రులు ఆనం, నారాయణ, సత్య కుమార్ స్పష్టీకరణ
విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాలన్నింటినీ సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నామని, రూ.ఐదు కోట్ల రాబడి వచ్చే ప్రతి దేవాలయ అభివృద్ధిపై ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగంగా ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర మంత్రులు పి.నారాయణ, సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు.
మున్సిపల్ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ సంబంధిత అధికారులతో గురువారం పశ్చిమ అభివృద్ధిపై తాడిగడపలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సుజన చౌదరి ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు.