Suryaa.co.in

Andhra Pradesh

రహదారుల విస్తరణ, మౌలిక సదుపాయాలు కల్పిస్తాం

– జాతీయ రహదారి వాహనాల ట్రాఫిక్ మోరంపూడి పై వంతెన అనుమతిస్తున్నాం
– మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి

రాజమహేంద్రవరం: రహదారిపై ఉన్న రద్దీని తగ్గించే విధంగా జాతీయ రహదారిపై ఉన్న మోరంపూడి ఫ్లై ఓవర్ పై ట్రాఫిక్ ను అనుమతిస్తూ నేడు ప్రారంభించు కుంటున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కందులు దుర్గేష్, పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు.

ఆదివారం రాజమండ్రి మోరంపూడి వద్ద జాతీయ రహదారిపై నూతనంగా నిర్మించిన ఫ్లై ఓవర్ ను మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్ లు ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి గట్కారి, స్థానిక ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి,ఆదిరెడ్డి వాసు కృషి వల్ల నేడు ఫ్లైఓవర్ పై సాధారణ ట్రాఫిక్ ను ప్రారంభించు కుంటున్నమన్నారు. రహదారిపై ఉన్న ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించి, ప్రమాదాలు నివారించే విధంగా నేడు ఫ్లైఓవర్ ను ప్రారంభించుకోవడం చాలా ఆనందించ వలసిన విషయం అన్నారు. ఇటువంటి ఫ్లైఓవర్ లను ఏర్పాటు చేయవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని , ఆ మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.

పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ.. ఏ దేశమైనా ఆ దేశంలో ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాలని ఏర్పాటు చేసినప్పుడే అభివృద్ధి చెందుతుందన్నారు. మోరంపూడి జంక్షన్ వద్ద పై వంతెన గతంలో ఎప్పుడో ప్రారంభించు కున్నప్పటికీ త్వరితిగతిన పూర్తి కాలేదని నేడు పనులను పూర్తి చేసి ఈరోజు సాధారణ ట్రాఫిక్ ను ఫ్లై ఓవర్ పై వాహనాలు రాకపోకలు ప్రారంభించిన అనంతరం సర్వీసు రోడ్డును కూడా అభివృద్ధి చేయడం జరుగుతుందని ఎంపీ పేర్కొన్నారు.

ఈ జాతీయ రహదారిపై ఉన్న దివాన్ చెరువు, బొమ్మూరు, ఐటిసి, వేమగిరి ఫ్లై ఓవర్లను కూడా వేగవంతముగా చేపట్టేందుకు టెండర్ల ప్రక్రియను కూడా ప్రారంభిస్తామన్నారు. ఈ ఫ్లైఓవర్లు నిర్మాణంలో కొద్దిపాటి మార్పులను కేంద్రమంత్రి గడ్కారి సూచనలు పరిగణన లోకి తీసుకుని డిజైన్ చేశారన్నారు.

త్వరలో ఆ ఫ్లైఓవర్ నిర్మాణం కూడా చేపట్టడం జరుగు తుందన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి గడ్కారి ఆంధ్రప్రదేశ్ కావలసిన అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారని ఈ సందర్భముగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు.

రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. గతంలో రాజమండ్రి ఎంపీ గా మురళీ మోహన్ ఉన్న సమయంలో వేమగిరి నుంచి దివాన్ చెరువు వరకు ఐదు ఫ్లై ఓవర్లు మంజూరు అయ్యాయన్నారు. గత ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టులు నిర్మాణ ప్రక్రియ లేకుండా నిర్వీర్యం చేశారన్నారు. నగరంలో ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా జాతీయ రహదారి దివాన్ చెరువు పొట్టిలంక వరకు సర్వీసు రోడ్డు ఏర్పాటుకు ప్రతిపాదించిన లక్ష్యం నెరవేరలేదు అన్నారు. త్వరలోనే వాటి సాకారం దిశగా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాసు మాట్లాడుతూ , కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా రహదారులు, బ్రిడ్జిలు వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తూ అభివృద్ధి చేస్తుందన్నారు. ఇందులో ప్రజా ప్రతినిధులు పాత్ర వాటిని పర్యవేక్షిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో అనుసంధానం చేసుకుంటూ అభివృద్ధి దిశగా అయ్యో ప్రాంతాలను తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. గత పాలకుల అవగాహన రాహిత్యంతో నాలుగు ఫ్లై ఓవర్లను కోల్పోయి ఉన్నామన్నారు.

LEAVE A RESPONSE