Suryaa.co.in

Andhra Pradesh

త్వరలో క్రిస్మస్ కానుక అందిస్తాం

• అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకాన్ని పునరుద్ధరిస్తాం
• గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ఎస్సీ సంక్షేమ పథకాలన్నీ తిరిగి అందిస్తాం
• రాష్ట్రంలో రూ. 340 కోట్లతో నూతన ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను నిర్మిస్తాం
• రాష్ట్రంలో అసంపూర్తిగా నిలిపేసిన కమ్యూనిటీ హాల్స్ అన్నింటినీ పూర్తి చేస్తాం
– రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి

రాష్ట్రంలో ఎస్సీ సంక్షేమ పథకాలన్నీ అర్హులైన వారికి అందిస్తామని, గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ఎస్సీ సంక్షేమ పథకాలన్నింటినీ తిరిగి పునరుద్దరిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు.. విజయవాడ నాలుగవ డివిజన్ వరలక్ష్మి నగర్ లో రూ. 80 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ హాలు ను మంగళ వారం మంత్రి బాల వీరాంజనేయ స్వామి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో ప్రారంభించిన కమ్యూనిటీ హాల్స్ ను జనరల్ నిధులతో పూర్తి చేసి ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.. గత ప్రభుత్వం కమిటీ హాల్స్ ను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించారని, రాష్ట్ర వ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాల్స్ ను త్వరితగతిన పూర్తి చేస్తామాన్నారు.. త్వరలోనే రాష్ట్రంలోని క్రిస్టియన్స్ అందరికీ క్రిస్మస్ కానుక అందిస్తామన్నారు. అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకాన్ని పునరుద్ధరిస్తామన్నారు. రాష్ట్రంలో రూ. 340 కోట్లతో నూతన ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను నిర్మిస్తామన్నారు.. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా డిసెంబర్, జనవరి నెలలోనే రుణాలు అందిస్తామన్నారు.

గత ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ని మూడు ముక్కలు చేసి నిధులు అందివ్వకుండా నిర్లక్ష్యం చేశారన్నారు.. లిడ్ కాప్ కు నిధులు అందించి రుణాలు అందిస్తామాన్నారు.. ఆటోనగర్ లో విలువైన భూములను అన్యాక్రాంతం చేశారని, అక్కడ పిపిపి మోడల్ లో వాటిని అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా హాస్టల్స్ రిపేరుకు రూ.140 కోట్లు కేటాయించామాన్నారు.. ఈ ఐదు నెలల పాలనలో హాస్టల్ విద్యార్థులకు కార్పొరేట్ వైద్యం అందించి, వారి ఆరోగ్యానికి కాపాడే చర్యలు తీసుకున్నామన్నారు. అమరావతిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి స్థలం కేటాయిస్తే గత ప్రభుత్వం స్థలాన్ని మార్చి విజయవాడ స్వరాజ్ మైదానంలో ఆ విగ్రహం పెట్టారన్నారు.. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రాజెక్టుకు సంబంధించి అసంపూర్తిగా ఉన్న హాల్స్, తదితర పనులను పూర్తి చేస్తామన్నారు.. విజయవాడ నగరంలో ఉన్న హాస్టల్స్ రిపేర్ కి రూ. 42 లక్షల నిధులు కేటాయించామాన్నారు.

గత ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన హాస్టల్ బకాయిలను కూడా చెల్లించకుండా విద్యార్థులను పట్టించుకోలేదన్నారు.. ఏ విద్యార్థిని ఇబ్బంది పెట్టకుండా డిసెంబర్ నెలలోనే బకాయిలు చెల్లిస్తామన్నారు.. నాణ్యతతో కూడిన యూనిఫామ్స్, బ్యాగులను పాఠశాలలు ప్రారంభానికి ముందే విద్యార్థులకు అందిస్తామన్నారు.. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతోపాటు శానిటేషన్ కి అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు.. రాబోయే కాలంలో సాంఘిక సంక్షేమ శాఖ లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తామన్నారు.

స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ… వరలక్ష్మి నగర్ లో 2014 లో రూ. 50 లక్షలతో చంద్రబాబు నాయకత్వంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు.. గత ప్రభుత్వం నిర్వాకం వల్ల పనులు ఆగిపోయాయన్నారు.

మేము అధికారంలోకి రాగానే తిరిగి పనులు ప్రారంభించి రూ. 80 లక్షల తో కమ్యూనిటీ హాల్ ను పూర్తి చేయడం జరిగిందన్నారు.. రాష్ట్రంలో కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందన్నారు..

వరలక్ష్మి నగర్, రాణి గారి తోట కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం పూర్తి చేశామన్నారు.. పెద్దపెద్ద కళ్యాణ మండపాల్లో పెళ్లిళ్లు తదితర కార్యక్రమాలు జరుపుకున్నట్టుగానే కమ్యూనిటీ హాల్స్ లో కూడా అంత సంతోషంగా జరిగేలా ఏసి తదితర సౌకర్యాలు కల్పిస్తామన్నారు.. రాబోయే కాలంలో మంత్రి చొరవతో ఎస్సీ నిరుద్యోగ యువతకు లోన్లు, రుణాలు, వ్యాపారులు చేసుకునే విధంగా ప్రోత్సహిస్తామన్నారు.. తూర్పు నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాల్స్ ను త్వరలోనే పూర్తి చేస్తామాన్నారు.. దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలు కూడా అందిస్తామన్నారు.

కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు, కార్పొరేటర్ దేవినేని అపర్ణ, డివిజన్ నాయకులు సంజయ్ దేవానంద్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE