Suryaa.co.in

Telangana

కేసీఆర్ సర్కార్ అవినీతిపై విచారణ జరిపిస్తాం

-బీఆర్ఎస్ జాతీయ పార్టీ అనేది ఒక బూటకం
-కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

నీళ్లు..నిధులు.. నియామకాలు ఎక్కడ? కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేయటంలో కేసీఆర్ సర్కార్ విఫలమైంది. కేసీఆర్ సర్కార్ అవినీతిపై విచారణ జరిస్తాం.బీసీ నేతను ముఖ్యమంత్రి చేసి తీరుతాం. ఎస్సీ వర్గీకరణపై ప్రధానమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాం.నీళ్ళు, నిధులు, నియామకాలు.. తెలంగాణ ప్రజల ఆకాంక్ష. అది నెరవేరనేలేదు. హైదరాబాద్ లాంటి సిటీని.. నైపుణ్యం ఉన్న‌ యువతను ఉపయోగించుకోవటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది.రాష్ట్ర చేసిన అప్పులు రాబోయే తరాలకు భారంగా మారుతోంది.

తెలంగాణ రాష్ట్రానికే ఎంతో గొప్పగా చెబుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కూలిపోతున్నాయి.నీళ్లు, నిధులు, నియామకాలే ప్రధాన అంశంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది.మిగులు బడ్జెట్‌తో ఏర్పాటైన తెలంగాణ ఇప్పుడు పూర్తిగా అప్పులపాలైంది.తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ నిర్వహణ సరిగా లేదు. రానున్న తరాల ప్రజలపై రుణభారం మోపుతున్నారు. దళితబంధు పథకం ఎంతో గొప్పదని చెప్పి అమలు చేయకుండా మోసం చేశారు.

అధికారంలోకి రాగానే దళిత వ్యక్తిని సీఎం చేస్తామన్నారు. చేయలేదు. ఎస్సీ అయిన తాటికొండ రాజయ్యను డిప్యూటీ సీఎం చేసి.. ఆ పదవి నుంచి ఆరు నెల్లలోనే ఆయనను తొలగించారు. రూ.3,300 కోట్లు బీసీల అభివృద్ధి కోసం వినియోగిస్తామని చెప్పి.. కేవలం రూ.77కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఆ నిధులన్నీ ఎందుకోసం వాడారో తెలియదు.తెలంగాణలో 11 వర్సిటీల పరిధిలో 2వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అక్షరాస్యతలో నేషనల్ యావరేజ్ కంటే తెలంగాణ వెనుకబడింది. దేశవ్యాప్తంగా 72 శాతం అక్షరాస్యత ఉంటే తెలంగాణలో 66 శాతంగా ఉంది. జాతీయ సగటు కన్నా ఇది తక్కువ.

తెలంగాణ ప్రభుత్వం విద్యకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు.రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదు.నీళ్లు.. నిధులు.. నియామకాల పేరుతో ఏర్పాటైన రాష్ట్రంలో బీఆర్ఎస్ హామీలేవి నెరవేరలేదు. కేసీఆర్ హాయాంలో 6వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.బీఆర్ఎస్ నాయకులు ప్రధానమంత్రిని కూడా రాజకీయ విమర్శలకు వాడుకోవడం సిగ్గుచేటు.ప్రధానమంత్రి అనే గౌరవం లేకుండా కించపర్చే ప్రభుత్వం తెలంగాణకు అవసరమా?

జనవరి 22న అయోద్య రామమందిరం ప్రారంభిస్తాం.పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వర్గీకరణపై బిల్లు ప్రవేశపెడతాం.కేసీఆర్ ను జాతీయ నేతగా ఎవరూ ఒప్పుకోవడం లేదు. బీఆర్ఎస్ జాతీయ పార్టీ అనేది ఒక బూటకం.బంగారం లాంటి రాష్ట్రాన్ని నాశనం చేశారు. దేశంలో పది లక్షలకు గాను.. 8లక్షల ఉద్యోగాలను కేంద్రం భర్తీ చేసింది.డిసెంబర్ లోపు మిగిలిన ఉద్యాలను భర్తీ చేస్తాం. మోటార్లకు మీటర్లు పెడతారని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్న మాటలు శుద్ధ అబద్ధం.

LEAVE A RESPONSE