Suryaa.co.in

Telangana

నష్ట పోయిన ప్రతి ఒక్కరికి నష్ట పరిహారం అందిస్తాం

  • గత మూడు రోజులుగా భారీ నుండి అతి భారీ వర్షలాతో నష్టం జరిగింది
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
  • రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • ప్రజలు అందరు ధైర్యంగా ఉండాలి
  • ధ్వంసయిన రోడ్లకు త్వరలోనే మరమ్మతులు
  • రాష్ట్ర ఆర్ & బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

మోతే: కోదాడ నియోజకవర్గం మోతే మండలం నామవరం లోని పి యన్ ఆర్ పంక్షన్ హాల్ నంద్ కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గంలో కురిచిన వర్షాల వల్ల జరిగిన నష్టం పై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఆర్ & బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నీటి పారుదల & పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డి, తుంగతుర్తి శాసన సభ్యులు మందుల సామెల్, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ లతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత రెండు రోజులుగా కురిసిన వర్షాల వల్ల జిల్లాలో నడిగూడెం మండలం కాగిత రామ చంద్రపురం వద్ద NSP ఎడమ కాల్వకు గండి పడిందని అక్కడ 300 ఎకరాలలో పంట నష్టం జరిగిందని, కాల్వ గండికి వారం రోజులో మరమ్మతులు చేపిస్తామని తెలిపారు.

జిల్లాలో ఇద్దరు మరణించారని, 7 ఇల్లులు పూర్తిగా కూలిపోయాయని 27 ఇల్లులు పార్షికంగా దెబ్బ తిన్నాయని,7 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసామని,7 పశువులు మరణించాయని,20000 ఎకరాలలో పంట కు నష్టం జరిగిందని,14 చెరువులు తెగినాయని,11 రోడ్లు ధ్వంసం అయినయని శాశ్వత మరమ్మాత్తుల కోసం 22 కోట్లు అవసరం అవుతాయని,750 కరెంట్ స్తంబాలు పడిపోయాయని ,150 ట్రాన్స్ ఫార్మర్స్ దెబ్బ తినాయని మంత్రి ప్రాధమిక నివేదిక అందించారు.నష్ట పోయిన ప్రతి ఒక్కరికి నష్ట పరిహారం అందజేస్తామని మంత్రి ఈ సందర్బంగా తెలిపారు.

తదుపరి రాష్ట్ర ఆర్ & బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా లో వర్షాలు ఇలా పడటం దురదృష్ట కరం అని ద్వoసం అయిన రోడ్లు పై వెంటనే నివేదిక అందించిన వెంటనే మరమ్మతులు చేపడటం అని ప్రజలు ధైర్యంగా ఉండాలని మంత్రి అన్నారు.

కోదాడ శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డి మాట్లాడుతూ కోదాడ మున్సిపాలిటీ, రూరల్ మండలం పరిధిలో చాలా నష్టం జరిగిందని, పలు చెరువుల కట్టలు తెగినాయని రోడ్లు ద్వoసం అయినాయని రైతుల ఇళ్లలో ఉన్న ధాన్యం అంత తడిచాయని వారి కోసం రేషన్ షాపు ల ద్వారా బియ్యం అందించాలని, పెర్టిలైజర్ దుకాణాలలో ఎరువుల బస్తాలు తడిచాయని వారికోసం లోన్స్ ఇప్పించాలని, కోదాడ మున్సిపాల్టికి నిధులు లేవని ప్రత్యేక నిధులు ఇప్పించాలని ముఖ్యమంత్రి ని కోరినారు.

తుంగతుర్తి శాసన సభ్యులు మాట్లాడుతూ కష్టాలలో ఉన్న వారిని ఆదుకోవాటానికి వచ్చిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదములు తెలిపారు. తెగిన చెరువులకి మరమ్మతులు చేపట్టి రైతంగాన్ని ఆదుకోవాలని కోరారు.

ఈ సమావేశం లో నల్గొండ ఎంపి రఘు వీర్ రెడ్డి,ఎస్ పి సన్ ప్రీత్ సింగ్,ప్రభుత్వ సలహా దారులు వెంరెడ్డి నరేందర్ రెడ్డి, పర్యాటక సంస్థ చైర్మన్ రమేష్ రెడ్డి,ఇరిగేషన్ ఎస్ ఈ రమేష్ బాబు,అదనపు ఎస్ పి నాగేశ్వరరావు, ఆర్ డి ఓ వేణు మాధవ్,జిల్లా అధికారులు, తహసీల్దార్ లు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE