– కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎలాంటి వారిని ప్రోత్సహిస్తున్నాడనేందుకు ఈ ఘటనే నిదర్శనం
– హత్యాప్రయత్నం ఘటనలో పాత్రధారులతో పాటు సూత్రధారులను వదిలిపెట్టబోం
– ముత్తుకూరు మండలం పంటపాళెంలో వైసీపీ నేతల చేతిలో కత్తిపోట్లకు గురైన టీడీపీ నాయకుడు ఎదనపర్తి శ్యాంసుందర్ రెడ్డిని నెల్లూరు అపోలో ఆస్పత్రిలో పరామర్శించిన టీడీపీ యువనాయకులు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శృతిరెడ్డి
– బాధిత కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన సోమిరెడ్డి దంపతులు
– రపారపా నరుకుతామనే వారిని జగన్ రెడ్డి సమర్థించడంతోనే ఇలాంటి పరిస్థితులు
– టీడీపీ యువనేత సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నెల్లూరు: టీడీపీ నేత శ్యాంరెడ్డిని పంటపాళెం వైసీపీ నాయకులు కత్తులతో పొడిచి హత్యాప్రయత్నం చేశారు. తీవ్రగాయాలతో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. శ్యామ్ రెడ్డి శరీరంలో చాలా బలమైన గాయాలున్నాయని వైద్యులు తెలిపారు. ఒక పథకం ప్రకారం శ్యాం రెడ్డిని కత్తులతో పొడిచినట్టు అర్థమవుతోంది. హత్యలు చేసే క్రిమినల్స్ ను సర్వేపల్లిలో కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడు.
అధికారంలో లేని సమయంలోనూ వారు కత్తులతో స్వైర విహారం చేస్తున్నారంటే ఎలాంటి వారో అర్థమవుతోంది. ఇక ఇలాంటి వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదు..ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుంది.టీడీపీ శ్రేణులే కాదు..సామాన్య ప్రజల జోలికి రావాలన్నా భయపడేలా చట్టం పనిచేస్తుంది. హత్యాప్రయత్నం ఘటనలో పాత్రదారులతో పాటు సూత్రధారులు కూడా శిక్ష అనుభవించక తప్పదు.