– స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుపై సీఐడీ నమోదుచేసిన ఆధారాలన్నీ ఫ్యాబ్రికేటెడే
• తనకు అంటిన అవినీతి బురదను చంద్రబాబుకి అంటించి, నాలుగేళ్లుగా ఏమీ చేయలేకపోయిన తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకుంటున్నాడు
• వచ్చే ఎన్నికల్లో ప్రజలు జగన్ రెడ్డిని, అతని పార్టీని రాష్ట్రం నుంచి తరిమేయాలి
– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు
ఆర్థిక నేరస్తుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినప్పటినుంచీ రాష్ట్రం అన్నివిధాలా వెనుకబడిందని, ఏపీ 30 ఏళ్లు వెనక్కు వెళ్లిందని, నాలుగేళ్ల తన పాలనా వైఫల్యాలు, చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే, వ్యవస్థల్ని తనచేతిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడిని అన్యాయంగా జైలుపాలు చేశారని, క్రిమినల్ మనస్తత్వం ఉన్న వ్యక్తి ఇంతకంటే ఏం చేయగలడని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు ఎద్దేవాచేశారు.
మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు …
“నేరపూరిత మనస్తత్వం ఉన్నవారి దుశ్చర్యలు, దుర్మార్గాలతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. ఈ వాస్తవం గ్రహించే జగన్ రెడ్డి అతని మంత్రివర్గం స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో అవినీతి అని ప్రచారంచేసి, తప్పుచేయని చంద్రబాబుని దోషిగా చిత్రీక రించే ప్రయత్నం చేస్తోంది. టీడీపీప్రభుత్వంలో ఏర్పాటైన స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ద్వారా 2,13,000 యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందిస్తే, వారిలో 70వేల మందికి ఉద్యోగాలు లభించాయి.
ఆ ప్రాజెక్ట్ పనితీరు క్షేత్రస్థాయిలో ఉత్తమంగా నిలిచింది. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో ఎక్కడా ఎలాంటి అవినీతి జరగకపోయినా జగన్ రెడ్డి ప్రభు త్వం కావాలనే తప్పుడు ఆధారాలు సృష్టించి చంద్రబాబుని ఇరికించింది. అలానే టీడీపీ యువనేత లోకేశ్ ను కూడా ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా తప్పు డు కేసులతో ప్రజాస్వామ్యాన్ని ఎన్నాళ్లు ఖూనీ చేస్తారు?
యువగళంతో లోకేశ్ ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు పొందారు. ఆయనకు లభిస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే చెత్త ఆరోపణలు చేస్తున్నారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని అడ్డుకోలేరనే వాస్తవా న్ని జగన్ రెడ్డి, అతని ప్రభుత్వం తెలుసుకోవాలి.
కేవలం వచ్చే ఎన్నికల్లో లబ్ధిపొందడానికి, తమపార్టీని, తమను తాము కాపాడుకోవ డానికి జగన్ రెడ్డి అతని మంత్రులు ఫ్యాబ్రికేటెడ్ ఆధారాలతో చంద్రబాబుని జైలుకు పంపారు. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో భాగంగా ఏర్పాటైన శిక్షణా కేంద్రాల్లో అన్ని పరికరాలు ఉన్నాయని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం యువతకు అందుబాటులో ఉందని, శిక్షణా కేంద్రాలు బాగానే పనిచేస్తున్నాయని గతంలో కేంద్రప్రభుత్వ సంస్థ సెంట్రల్ టూల్ డిజైన్ క్షే త్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇచ్చింది.
కేంద్ర ప్రభుత్వ సంస్థ కు కనిపించని అవినీతి జగన్ రెడ్డికి, సీఐడీకి కనిపించడం కేవలం కక్షపూరితమే. అలానే వైసీపీ ప్రభుత్వంలో ఏ.శ్రీకాంత్ అనే ఐపీఎస్ అధికారి స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణా కేంద్రాలు బాగా పనిచేస్తున్నాయని సర్టిఫై చేశాడు. తన ప్రభుత్వంలో అధికారికి కనిపించని అవినీతి, జగన్ రెడ్డికి, అతని జేబుసంస్థలకు కనిపించడం, దానిలో చంద్రబాబుని దోషిగా నిలబెట్టడం కుట్రకోణం కాదా?
తనచొక్కా మొత్తం బురదలో ముంచుకొన్న జగన్ రెడ్డి, ఆ బురదను చంద్రబాబుకి పూసి, ఆయన తప్పుచేశాడని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. దానిలో భాగమే ఆయన అక్రమ అరెస్ట్. ఎన్నికల క్షేత్రంలో తెలుగుదేశాన్ని, చంద్రబాబుని ఎదుర్కొనే ధైర్యం లేకనే అవినీతి ముఖ్యమంత్రి ఇలాంటి కుట్రలకు తెరలేపాడు.
దుర్మార్గుడు, అవినీతి పరుడు, ఆర్థిక ఉగ్రవాది అయిన జగన్ రెడ్డిని నిలువరించకపోతే రాష్ట్రం ఎటు పోతుందో ప్రజలే ఆలోచించాలి. ఏ1, ఏ2 సహా మొత్తం వైసీపీకి తగినవిధంగా బుద్ధి చెప్పి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉంది.” అని కళా వెంకట్రావు స్పష్టం చేశారు.