Suryaa.co.in

Political News

ఎన్టీఆర్..బాబు.. కమ్మోరికి చేసిందేమిటి?

ఎవరయ్యా రామారావు!? ఎవరయ్యా చంద్రబాబు!?
కమ్మ కులానికి అసలేమీ చేశారు వీళ్లు?
అసలు కమ్మ కులానికి వీళ్లు చేసింది ఏంటి!?
అయినా అసలు కమ్మ కులానికి ఒకడు చేసేదేంది !?
అది ఎవత్తో ఒక వీడియో చేయటం. వీడియోని కొన్ని యూట్యూబ్ చానల్స్ లో ప్రసారాలు, చర్చలు, ఉపదేశాలు, అసలు దానికి తెలీదేమో.. 1830 ప్రాంతం లోనే కమ్మవారు అన్ని రంగాలలో దూసుకుపోయున్నారని.బోకులకి బోకు ఆలోచనలే వస్తాయి!

సంఘంలో కమ్మ కులాన్ని తిట్టడం, దాన్ని కొన్ని బోకు యూట్యూబ్ ఛానళ్ళు పెట్టడం.. దాని మీద చర్చలు ఉపదేశాలు, ఎందుకు మన మీద పడి ఏడుస్తాయో తెలుసా? ఈ గాలి మందని కమ్మోడు చూడ్డం లేదని.అసలు ఒక కులం గురించి ఎగతాళిగా మాట్లాడే వాళ్లు ఒక తల్లికి తండ్రికి పుట్టినోళ్లే కాదు,అది ఏ కులమైనా!

అలాంటి వాటిని చర్చలు పెట్టి సొమ్ము చేసుకునే వాళ్లకి అర్థం కాని విషయం ఏంటంటే, మా మీద అలా కామెంట్లు చేస్తేనే వాళ్ళ నోట్లోకి నాలుగు వేళ్లు వెళ్తున్నాయని. మా మీద బతికే ఆ బోకుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.

విద్య,వైద్య,శాస్త్ర,సాంకేతిక, సాహిత్య, కళా, రాజకీయ, సాంస్కృతిక, పారిశ్రామిక, వ్యవసాయ, లాంటి సమున్నత రంగాలలో మాతో పొటీ పడండి. అలానే మీకు చేతనైతే చక్కగా జ్ఞానాన్ని పెంచుకోని ప్రయోజకులుగా మారండి, సంతోషిస్తా. మీలాగా ఏడవము. అది వదిలేసి అన్నిచోట్లా వీళ్ళే అని ఏడవకండి. దానికి మళ్లీ పార్టీలకి ముడిపెట్టకండి.

రైతు కుటుంబాలు మావే, వ్యవసాయాన్ని నూతన పద్దతులతో 80 ఏళ్ల క్రితమే అప్పట్లోనే లాభసాటిగా మార్చిన ఘనత మాదే. ఉన్నత విద్యలో తెలుగుదేశం పెట్టక ముందు నుంచే మద్రాసు రాష్ట్రంగా ఉన్నపుడే, విదేశాలకి డాక్టర్లగా వలస వెళ్లిన కీర్తి కూడా మాదే. మద్రాసు రాష్టం ఈనాడు చంద్రగిరి రాజు చెన్నమనాయుడు ఇచ్చిన స్థలం. కాబట్టే చెన్నపట్నం అయింది. ఇది చాలు.. మా జాతి ఘనత చెప్పుకోడానికి.

చంద్రబాబు గారు నిక్కర్లు వేసుకొనే టైంలోనే కల్లూరి చంద్రమౌళి ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద నాయకుడు.. అసలు ఆయన పేరు విన్నారా !? ఆయనకి సాటి నిలబడగల నిస్వార్ధ నాయకుడు ఉన్నాడా !? 1930 లోనే అవిభక్త మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన బొల్లిన మునిస్వామి నాయుడు గారు..అమరావతి రాజా వెంకటాద్రి నాయుడు గారు.

ఎట్టెట్టా?!
రామారావు వచ్చిన తరువాత కమ్మవారు బాగుపడ్డారా!? మీ అమ్మ మొగుడు చెప్పాడా అలాగని?లేదా ఎదురింటి సందులో ఎడ్డోడు చెప్పాడా?
ఎవరయ్యా రామారావు!? ఎవరయ్యా చంద్రబాబు!?
పుల్లెల గోపీచంద్ కి రామారావు బాడ్మింటను నేర్పించారా? కోనేరు హంపి కి వరల్డ్ ఛాంపియన్ టైటిల్ చంద్రబాబు గారు కొనిచ్చారా? త్రిపురనేని గారికి సాహిత్యం లోకేషు బాబు నేర్పాడా?

కొత్త సచ్చిదానంద మూర్తి గారికి తత్వశాస్త్రాన్ని బాలయ్య బాబు నేర్పించాడా? ఆయన పేరు మీద 1950 ల్లోనే అమెరికాలోని ప్రిన్స్ టన్ యూనివర్సిటీలో కట్టిన గ్రంథాలయానికి బ్రాహ్మణి పేరు పెట్టించిందా ? కీరవాణి గారికి సంగీతాన్ని కోడెల గారు నేర్పించారా?
ఇలా చెప్పుకుంటే పది పేజీలు వ్రాయగలం! ఇలా ఎందరో మహనీయులు తెలుగుదేశానికి ముందే ఉన్నారు, తరువాత ఉన్నారు. ఇప్పుడూ ఉంటారు. రేపూ ఉంటారు,
ఉంటూనే ఉంటారు. దేనికంటే కృషిని నమ్ముకున్నోళ్లం!
తెలుగుదేశం అంట,
రామరావు అంట,
చంద్రబాబు అంట!

మా త్రివురనేని,మా గోగినేని రంగా, మా కల్లూరి చంద్రమౌళి ఒకరా ఇద్దరా ఎందరో మహనీయులు..అలాంటి మహనీయులకి రామారావు లాంటి వ్యక్తుల సహకారం అవసరమా?వీళ్లందరూ రామారావు గారు సిన్మాలోకి రాకముందే సమాజానికి ఎంతో మేలు చేశారు. మీకు చేతనైతే వాళ్లలాగా కష్టపడి మహనీయులు గొప్పవారు అవ్వండి.సంతోషిస్తాం.

మీ లాగా కుళ్లు ఏడుపులు ఏడవము.
అసలు విద్య, వైద్య, శాస్త్ర, సాంకేతిక, సాహిత్య, కళా, రాజకీయ, సాంస్కృతిక, పారిశ్రామిక, వ్యవసాయ, రంగాలలో కమ్మ వారు లేని రంగం ఉందా ? మీ ఏడుపుకి కారణం అదేనా? అదైతే మేమేమి చేయలేము. దేనికంటే మేము కష్టజీవులం. కష్టపడితేనే ఫలితం దక్కుతుంది అనే సూత్రాన్ని నమ్ముకున్నాం.

దాని ఫలితమే అన్ని రంగాల్లో ప్రయోజకులుగా ఉన్నాం.ఉంటాం. ఉండబోతున్నాం. ఉండే తీరుతాం. ఖండాంతరాల్లో రామారావు కన్నా ముందే ప్రతి రంగంలోను కమ్మవారి పాత్ర ఖచ్చితంగా ఉంది.ఆయన చేసిందేంది మాకు!? ప్రతీ రంగంలో ఉన్న ప్రముఖుల్లో కమ్మవాడే అగ్రభాగాన ఉన్నాడు,ఉంటాడు !? ఇదంతా తెలుగుదేశం కృషా!?
అసలు తెలుగుదేశం పుట్టకముందు నుంచే కమ్మవారు ఒక వెలుగు వెలిగారు,అది తెలుసా!?కమ్మ వారంటే ఒక ప్రతిభ, కమ్మ వారంటే ఒక స్వయంకృషి. తెలుగు,తమిళ,కన్నడ సమాజంలో కమ్మవారు చేసిన మేలు ప్రతి రంగంలో స్పష్టంగా కనపడుతుంది. కమ్మవారంటే ఎవరో ఒక సినిమా హీరోనో, లేదా ఇద్దరు ముగ్గురు రాజకీయ నాయకుల సమూహం మాత్రం కాదు.

ఒక డాక్టర్.. ఒక ఇంజనీర్.. ఒక శాస్త్రవేత్త.. ఒక కవి.. ఒక దర్శకుడు.. ఒక స్వతంత్ర సమర యోధుడు.. ఒక నిర్మాత.. ఒక విప్లవకారుడు.. ఒక పండితుడు.. ఒక రైతు.. ఒక శ్రామికుడు..
ఒక సైనికుడు.. ఒక పాలకుడు.. ఒక క్రీడాకారుడు.. ఒక దేశ భక్తుడు.. ఒక వీరుడు.. ఒక వ్యాపారి.. ఒక వీరనారి.. ఒక ఆజానుబాహుడు.. ఒక నటుడు.. ఒక నటి.. ఒక సంఘ సంస్కర్త..
ఒక మేథావి.. ఒక సంపన్నుడు.. ఒక మంచివాడు..
ఇలా చెప్పుకొంటూ పోతే రాసే ఓపిక నాకుందేమో కానీ చదివి మా గొప్పతనం జీర్ణించుకొనే అంతటి శక్తి మీకు లేదు..ఉండదు కూడా!

కులం లేకుండా రండిరా.వచ్చి చంద్రబాబు గారిని దమ్ముగా ఢీ కొట్టండి.  అది చేత కాకపోతే గమ్మున ఆ ఎదురింటి సందులోకి పోయి వాడి తీర్ధం తీసుకోండి. కులం జోలికి రావొద్దు…చేతనైతే కుప్పుస్వామి చౌదరి శతకాలు చదువుకోండి. జ్ఞానం పెరుగుతుంది. సమాజానికి మేలు చేయండి హాని కాదు.

– ప్రసాద్

LEAVE A RESPONSE