ప్రస్తుత ఈ కుళ్ళి పోయిన రాజకీయ వ్యవస్థలో, ఏమి సాదిద్దామని… ఇన్ని చిన్న చితక రాజకీయ పార్టీలు పెట్టేస్తున్నారో అర్ధం అవటం లేదు. ఒక పార్టీ అధికారంలోకి రావాలంటే ఎంతో ప్రజా బలం కావాలి. 400 లక్షల మంది పైగా ( 4 కోట్లు) ప్రజలు ఉన్న తెలంగాణలో, ఎన్ని లక్షల మంది ఈ క్రింది పార్టీలను సపోర్ట్ చేస్తారు.
“తేజస” తెలంగాణ జన సమితి… కోదండరాం గారు.
“వైతేపా“…. సొంతంగా ఈమె అర్హత ఏమిటి? ఆ వైస్సార్ మహనీయుని పేరు తగిలించు కొక పోతే, ఎన్ని వేల ఓట్లు సంపాదించు కోగలదు? ఈ తెలంగాణ చెల్లమ్మ సీఎం అయిపోయిన వెంటనే మొదటి సంతకం దేనిమీద చెయ్యాలో కూడా ప్లాన్ అయిపోయింది అట కదా ?
“బీఎస్పీ”.. ఈ పార్టీ ఫుల్ ఫారం కొద్దీ మందికే తెలుసు. ఈ ఉన్నత విద్యావంతుడు ప్రవీణ్ కుమార్ కి కూడా సీఎం అయిపోయి, అణగారిన వర్గాలనీ పైకి తీసుకు రావాలనే ఉంది ఇప్పుడిప్పుడే.
“ప్రజాశాంతి” ప్రజా ప్రభువు పాల్. అసలు ఈ మహనీయునికి, నర్సాపురం స్టీమర్ రోడ్డు వదిలిపెట్టి, తెలంగాణ సిరిసిల్లలో పాదయాత్ర చేయాలని… ఈ వింతైన కోరిక ఏమిటో తెలియదు.అంతా అయోమయం…
అసలు ఎవరి ఓట్లు చీలుద్దామని?
అసలు ప్రజా సేవ చెయ్యాలంటే, ఇటువంటి ఓట్లు చీల్చే పార్టీలు పెట్టాలా… వేరే దారులు లేవా?
ఇంతకు ముందు కొందరు నిజాయితీ పరులు, ప్రజా సేవ చేద్దామని, చేతులు కాల్చుకున్నారు కదా… నగ్న సత్యం.
ప్రతి నియోజక వర్గానికి అభ్యర్థులు దొరుకుతారా? వాళ్ళ కోసం లక్షలు, కోట్లు ఎలా వస్తాయి?
ఎలక్షన్స్, అభ్యర్థులు తమకు తామే, లక్షలు, కోట్లు ఖర్చు పెడతారా.?
మరెందుకు ఇన్ని నాటకాలు మన తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేకించి?
కాలం నిర్ణయించాలి.
– తీగల రవీంద్ర