Suryaa.co.in

Telangana

విద్యార్థినిని 15 సార్లు ఎలుక కొరికితే అధికారులు ఏం చేస్తున్నట్లు?

– గురుకుల హాస్టల్స్ పరిస్థితులలో మార్పు కనబడతలే..
– మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం బయటపడ్డది.
– రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్. బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి

హైదరాబాద్: ఖమ్మం జిల్లా దానవాయిగూడెం బీసీ వెల్ఫేర్ హాస్టల్లో చదువుతున్న లక్ష్మీ భవానికీర్తి అనే విద్యార్థినిని 15 సార్లు ఎలుక కొరికితే అధికారులు ఏం చేస్తున్నట్లు గురుకులాల్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని బిఆర్ఎస్ పార్టీ స్పందించే వరకు పట్టించుకోని ప్రభుత్వం. బిఆర్ఎస్ గురుకులాల బాట తో సోయి తెచ్చుకున్న ప్రభుత్వం పరిస్థితులను చక్కదిద్దుతుంది ఏమో అని అందరూ అనుకున్నారు.

పరిశీలించడానికి స్వయంగా ముఖ్యమంత్రి, మంత్రులు ఒక్కరోజు హంగామ చేసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు తప్పితే, శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టినట్టు కనిపించట్లే.. మాట్లాడినంత తేలిక కాదు పరిపాలనంటే బహుశా ఇది గుంపు మేస్త్రి, సారీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలుసుకొని మసులుకుంటే బాగుంటుందేమో.

అనారోగ్యం పాలైన లక్ష్మీ భవాని కీర్తిని మెరుగైన వైద్యాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ముఖ్యమంత్రియే అన్ని శాఖలను చూడాలంటే కుదరదు. వెంటనే సాంఘిక సంక్షేమ శాఖ మరియు విద్యాశాఖలకు మంత్రులు నియమించాల్సిన అవసరమైతే ఉంది. భవిష్యత్తులో గురుకుల హాస్టల్లో ఎలాంటి సంఘటన జరగకుండా పగడ్బందీ చర్యలను తీసుకోవాలి.

LEAVE A RESPONSE