Suryaa.co.in

Telangana

హీరో అల్లు అర్జున్ తప్పెట్లయితది?

– చట్టం ఎటు పోయింది? ఎవరికి చుట్టమైంది?
– రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ & బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా.కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి

హైదరాబాద్ : జాతీయ అవార్డు విజేత సినీ సెలబ్రిటీ అల్లు అర్జున్ అరెస్టు అనేక అనుమానులకు తావిస్తున్నది. అభిమానంతో హీరోను, సినిమా యూనిట్ సభ్యులను చూడడానికి ప్రేక్షకులు ఎగబడతారు. దానికి సరైన ఏర్పాట్లు చేయాల్సింది సినిమా థియేటర్ యజమాన్యం, బందోబస్తు చేయాల్సింది పోలీసు వ్యవస్థ కదా? మరి హీరో అల్లు అర్జున్ తప్పెట్లయితది?

అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ, ఇది ముమ్మాటికీ తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్. రాష్ట్రంలో సొంత నియోజకవర్గ రైతు హీర్యానాయక్ గుండెపోటు వచ్చినా బేడీలు వేసి తీసుకెళ్లిన ఘటన చర్చకు రాకుండా చేయడానికేనా అనే అనుమానం వస్తుంది? తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇలా సెలబ్రిటీలను ఇబ్బంది పెట్టడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే చెల్లింది.

చట్టం ముందు అందరూ సమానమే అంటే రాష్ట్రంలో జరిగిన అనేక మంది తమ చావులకి కారణం సీఎం రేవంత్ రెడ్డే . రాష్ట్రంలో రైతులు.. ఆటో డ్రైవర్లు..గురుకుల విద్యార్థుల చావులకు.. చివరికి సొంత ఊరు కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ కూడా చనిపోయారు మరి చట్టం ఎటు పోయింది? ఎవరికి చుట్టమైంది?

చట్టం ముందు అందరు సమానులే కదా.. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేయడం లేదు? చట్టం ఏమైంది ముఖ్యమంత్రికి చుట్టమైపోయిందా ? మరోవైపు తొక్కిసలాటలో మహిళ చనిపోవడం విషాదకరం. చనిపోయిన కుటుంబానికి చెందిన వారి భర్త స్వయంగా అల్లు అర్జున్ సంబంధం లేదు అవసరమనుకుంటే నేను కేసు వాపసు తీసుకుంటానని వారే స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఇందులో అల్లు అర్జున్ తప్పే కనబడతలేదు కదా? మరి ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శించి అల్లు అర్జున్ అరెస్టు చేయడం దేనికి సంకేతం?

LEAVE A RESPONSE