Suryaa.co.in

Telangana

బాత్రూంలో కూడా మందు తాగిన ఘనుడు కేసీఆర్

– కెసిఆర్ చేస్తున్నది కేవలం బ్రోకరిజమే
– బీఆర్ఎస్ తో తెలంగాణకు పట్టిన శని అంతా పోయింది.
– క్యాసినో లోనూ కవిత పెట్టుబడులు
– వైసిపి, టిఆర్ఎస్ నేతలంతా ఒకటే… వాళ్లంతా కలిసే ఉంటారు
– పరస్పరం కమిషన్లపై ఇద్దరూ చర్చించుకున్నారు
– మెట్ పల్లి బిజెపి కార్నర్ మీటింగ్లో తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్

నేను ఏబీవీ కార్యకర్తగా ఉన్నప్పుడు మెట్పల్లి, జగిత్యాల, కోరుట్ల, కరీంనగర్లో ఎక్కువగా తిరిగాను.ఇది పవర్ఫుల్ గడ్డ.విద్యా రంగ సమస్యల కోసం యుద్ధం చేసి, నక్సలైట్ల చేతిలో అమరుడయ్యారు పుదారి మధుసూదన్ గౌడ్.బాడీలో బుల్లెట్ దిగినా… భారత్ మాతాకీ జై అంటూ.. ప్రాణాలు అర్పించిన గొప్ప వ్యక్తులు బీజేపీ వాళ్ళు.మెట్పల్లి గడ్డలో పౌరుషం ఉండకపోతే, ఇంకా వేరే ఏమైనా ఉంటుందా?
కేసీఆర్ బీఆర్ఎస్ ప్రకటనతో… తెలంగాణకు పట్టిన పీడీ నేటితో విరగడయింది. బీఆర్ఎస్ తో తెలంగాణకు పట్టిన శని అంతా పోయింది.పార్టీ పేరులో తెలంగాణ తీసి, పడేసిండు.దొంగ దీక్ష లు.. మందు తాగుడు తప్ప కేసీఆర్ కు ఏమీ తెలియదు. చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ… కేసీఆర్ నోటికి కోతలెక్కువ.బీఆర్ఎస్ పేరుతో… తుక్డే గ్యాంగ్ అంతా కలిసింది.దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసే అందరూ ఏకమయ్యారు. ఇక్కడే పీకలేనోడు, దేశంలో ఏం పీకుతాడు? దేశాన్ని దోచుకు తినే గుంట నక్కలంతా ఒకటయ్యారు.నరేంద్ర మోడీ సింహం.

అన్ని స్కామ్ లు వాళ్ళవే.చేయని దందా అంటూ లేదు.కేసీఆర్ ను, కవితను జైలుకు పక్కా పంపుడే.కేసీఆర్ బిడ్డను పట్టుకుపోవాలంటే.. షికండి లా పట్టుకుపోవాలి అని ఓ అక్క ఎంతో కోపం తో అంటుంది.దేశంలో పార్టీ పెట్టినప్పుడు.. తెలంగాణకు ఏం చేసాడో ముందు చెప్పాలి కదా.ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మోడీ మంజూరు చేసిన ఇండ్లలో కేసీఆర్ ఎన్ని కట్టాడో లెక్క చెప్పాలి కదా? ప్రభుత్వం తరపున 2bhk ఎన్ని కట్టించాడు లెక్క చెప్పాలి.ముందు లిస్ట్ విడుదల చెయ్.. ఆ తర్వాత ఏ పార్టీ అయినా పెట్టుకో.దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న హామీ ఏమైంది?దళితుడిని ముఖ్యమంత్రిని ఎందుకు చేయలేదో… దళిత సమాజానికి కేసీఆర్ జవాబు చెప్పాలి.ఎంతమందికి దళిత బంధు, దళితులకు మూడెకరాల భూమి ఇచ్చాడో… సమాధానం చెప్పాలి.పోడు భూముల సమస్య పరిష్కరించాడా?రుణమాఫీ హామీ అమలైందా?ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి హామీ ఏమైంది?
ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాడు.తెలంగాణ ప్రజల బతుకును బిచ్చపు బతుకు చేసిండు.రూ.5 లక్షల కోట్ల అప్పు చేసి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండు.పుట్టబోయే బిడ్డ పేరుపై లక్ష రూపాయల అప్పు పెట్టిండు.జీతాలు, పెన్షన్స్ ఇవ్వని పరిస్థితి.కేసీఆర్ ఇచ్చిన హామీలలో ఎన్ని హామీలు నెరవేర్చాడు?కాంట్రాక్టర్లు, కమిషన్ ల పేరుతో వేల కోట్లు ఎలా సంపాదించావో ప్రజలకు చెప్పు కేసీఆర్.దేశాన్ని దోచుకునేందుకే జాతీయ రాజకీయాలంటూ కేసిఆర్ డ్రామాలు.

ఈ మెట్ పల్లి ప్రాంతంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులలో ఎంతమంది రైతు కుటుంవలను ఆదుకున్నావ్?పంజాబ్ పోయి అక్కడ రైతులకు మూడు లక్షల ఆర్థిక సహాయం చేసి వచ్చిండు.పంజాబ్ లో కేసీఆర్ రైతులకు ఇచ్చిన చెక్కులు చెల్లని పరిస్థితి. తెలంగాణలో కేసీఆర్ వచ్చాక ఎన్ని పరిశ్రమలు స్థాపించారు? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో లిస్ట్ బయట పెట్టాలి.ఆ లిస్టు బయట పెడితే… వాళ్ళు చెప్పింది నిజమైతే… కేసీఆర్ కు తోమాల సేవ, పల్లకి సేవ చేస్తా…. లేదంటే బడిత పూజ చేస్తా.

బూటకపు వాగ్దానాలతో ప్రజలను మోసం చేస్తున్నాడు.కులాల మధ్య చిచ్చుపెట్టి, కులవృత్తులను నిర్వీర్యం చేశాడు.ఉమ్మడి ఏపీలో మెట్పల్లి అంటే గల్లా ఎగరేసుకునే పరిస్థితి ఉండేది.అది మా విద్యాసాగర్ రావు గారి ఘనత.అదే ఇప్పుడు మెట్పల్లి పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసు.విద్యాసాగర్ రావు అంటే మెట్పల్లి… మెట్పల్లి అంటే విద్యాసాగర్ రావు అని అంటారు.మెట్ పల్లి సుందరీ కరణ కోసం 50 కోట్ల రూపాయల నిధులను ఇస్తే… ఎక్కడైనా సుందరీకరణ కనిపిస్తుందా? ఇక్కడికి మిషన్ భగీరథ నీళ్లు వచ్చాయా?ట్విట్టర్ టిల్లు నాపై కోర్టు ఆర్డర్ పట్టుకొచ్చాడు.నేను ఆయనను తిట్టొద్దు అంట.నేను ఎప్పుడైనా తిట్టానా? నాకు గురువు కేసీఆరే.కేసీఆర్ ను ఫార్మ్ హౌస్ నుంచి బయటికి గుంజుకొచ్చామా? లేదా?

తెల్లందాక తాగుడు, ఎవరి కొంపలు ముంచాలనే ఆలోచించుడే తప్ప, కేసీఆర్ కి ఇంకా ఏమీ తెలియదు.కేసీఆర్ ఇక్కడికి వచ్చి కోతలు కోసిండు.తెలంగాణ రాష్ట్రం వచ్చాక ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ ఎలా మూతపడింది?ఈ ఒక్క షుగర్ ఫ్యాక్టరీని తెరిపించలేనోడు… తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా ఏలుతాడు?250 కోట్ల రూపాయలు పెట్టి షుగర్ ఫ్యాక్టరీని తెరపించలేడా? కెసిఆర్ బిడ్డ కవిత లక్ష కోట్లు పెట్టి, ఢిల్లీలో లిక్కర్ దందా చేసింది.ప్రతి గ్రామంలో కెసిఆర్ బాధిత సంఘం ఉంది.ఇక్కడ ఎన్ని కేసీఆర్ షాపులు ఉన్నాయి?అయ్యకు ఇష్టమైన వ్యాపారమే చేయాలని, కవిత లిక్కర్ దందా చేసింది.వంశపారంపర్యం కొనసాగిస్తోంది.క్యాసినో లోనూ కవిత పెట్టుబడులు పెట్టింది.

వైసిపి, టిఆర్ఎస్ నేతలంతా ఒకటే… వాళ్లంతా కలిసే ఉంటారు.ఏపీ సీఎం ను ప్రగతి భవన్ కి పిలిచి, అన్ని కూరలతో అన్నం పెట్టిండు.పరస్పరం కమిషన్లపై ఇద్దరూ చర్చించుకున్నారు.సమైక్య ఆంధ్రలా ఉండాలని నిన్న ఒకడు స్టేట్మెంట్ ఇచ్చాడు.సమైక్యాంధ్రాకు సపోర్ట్ చేసిన వ్యక్తిని, ప్రగతి భవన్ కు తీసుకువచ్చి దావత్ ఇచ్చిన వ్యక్తి, తెలంగాణ ద్రోహి కేసీఆర్. ఒక్క ఓటు.. రెండు రాష్ట్రాల నినాదం భారతీయ జనతా పార్టీ ది.తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే… సుష్మ స్వరాజ్ నేతృత్వంలోనే బిజెపి మద్దతు పలికింది.

బిజెపి తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వకుంటే… నేడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యవాడేనా?ఏ రోజు పార్లమెంటుకు కేసిఆర్ పోలేదు.విజయశాంతి అక్క ఒక్కటే పార్లమెంటుకు వెళ్లి, జై తెలంగాణ అని యుద్ధం చేసింది.అసలైన, నిజమైన ఉద్యమకారులంతా… ఇవాళ బీజేపీలోనే ఉన్నారు.ఉద్యమంలో కేసీఆర్ చేసింది దొంగ దీక్ష.ఢిల్లీలో 48 గంటల దీక్ష అని దొంగ దీక్ష చేసిండు. మందు తాగిండు. బాత్రూంలో కూడా మందు తాగిన ఘనుడు కేసీఆర్.తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజలను కేసీఆర్ సర్వనాశనం చేసిండు.

తెలంగాణలో అభివృద్ధి అంతా కేంద్రం ఇస్తున్న నిధులతోనే.జాతీయ రహదారుల నిర్మాణం పేరుతో పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేశాం.ఉచిత బియ్యం, ఉచిత వ్యాక్షన్ ఇచ్చిన ఘనత మోదీ దే.తాజాగా నెల వ్యవధిలో లక్ష 46వేల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చిన ఘనత మోడీదికాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్లు దండుకున్నడు తప్ప, మెట్పల్లిలో కాలేజీ కూడా కట్టలేదుబీడీ కార్మికుల సమస్యలను కూడా పరిష్కరించలేదుకట్ ఆఫ్ డేట్ పెట్టి, వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.

కుటుంబ పోషణ కోసం చాలామంది తమ్ముళ్లు గల్ఫ్ కు వెళ్లారుగల్ఫ్ కార్మికులను ముండాకొడుకులని తిట్టినోడు కేసీఆర్.పాస్పోర్టుల బ్రోకర్ కేసీఆర్.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనా కూడా… గల్ఫ్ కార్మికుల బతుకులు మారలేదు.గల్ఫ్ దేశాల్లో జైల్లో ఇంకా 100 ల మంది ఉన్నారు.గల్ఫ్ లో చనిపోయిన వాళ్ళ శవాన్ని తీసుకురావాలన్నా… కేసీఆర్ పాలనలో రెండు సంవత్సరాలు పడుతుంది.

గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పాలసీని తీసుకొస్తాం.తెలంగాణలో కూడా డబులు ఇంజన్ సర్కార్ రావాల్సిందే.ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే బిజెపి ప్రభుత్వం రావాల్సిందే..మీకోసమే సంవత్సరం నుంచి ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నాం.51 అసెంబ్లీ నియోజకవర్గాలను పూర్తి చేసుకున్నాం
కులాలకతీతంగా పాదయాత్ర చేస్తున్నాంతెలంగాణలో రంగురంగుల జెండాలు పోవాలి…. కాషాయ జెండా ఎగరాలి. తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉచిత విద్య, ఉచిత వైద్యం పక్కా అందిస్తాం.నిలువు నీడలేని పేదలకు పక్కా ఇండ్లు కట్టించి ఇస్తాం.పంట నష్టపోయిన రైతులకు ‘ఫసల్ బీమా యోజన’ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసి ఆదుకుంటాం.

ధాన్యం సేకరిస్తోంది కేంద్ర ప్రభుత్వమే.కొనుగోలు కేంద్రాలను సందర్శించడానికి వెళ్తే నాపై దాడులు చేశారు.కొనుగోలు కేంద్రాల్లో గోనె సంచి పైసలు… సుతిల దారం, రవాణా ఖర్చులు, లేబర్ ఖర్చులు అన్నీ ఇస్తున్నది మోదీనే.కెసిఆర్ చేస్తున్నది కేవలం బ్రోకరిజమే.కేసీఆర్ చేస్తున్న బ్రోకరిజానికి పైసలిస్తున్నది కూడా మోదీనే.రైతులకు ఎరువులపై సబ్సిడీ ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వమే.ఒక్క ఎకరానికి, ఒక్క పంటకి నరేంద్ర మోడీ ప్రభుత్వం 40 వేల రూపాయలను సబ్సిడీ కింద రైతులకు అందిస్తోంది.

మూతపడిన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని 6000 కోట్ల రూపాయలతో పునరుద్ధరించింది నరేంద్ర మోడీనే.ముత్యంపేట సుగర్ ఫ్యాక్టరీని 250 కోట్ల రూపాయలను పెట్టి కెసిఆర్ తెరుస్తావా? లేదా?నాకు చేతకాదు అని నువ్వు రాసి ఇస్తే.ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపించే బాధ్యతను మేము తీసుకుంటాం.జగిత్యాల సభలో కోతల రాయుడు అన్నీ కోతలే కోసిండు.కొండగట్టులో 50 మంది చనిపోతే… ఒక్క కుటుంబాన్ని పరామర్శించే సోయి లేదు.

అంత ఘోరమైన సంఘటన జరిగితే.. ముఖ్యమంత్రికి కేసీఆర్ కనీసం పరామర్శించలేదు. నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చాక చైనా బజార్లు, భారత్ బజార్ లు అయ్యాయి.మైసూర్ బజ్జి, మైసూర్ పాక్ లు మైసూర్ లో తయారయ్యాయా? ఇరానీచాయ్ ఇరాన్ లో తయారయిందా? ఇక్కడ ఎక్కడైనా మోటార్లకు మీటర్లు పెట్టారా?
లండన్, బ్రిటన్, అమెరికా కంటే గొప్పగా ఇక్కడ కేసీఆర్ కరెంటు సరఫరా చేస్తున్నాడా?24 గంటల కరెంటు కేసీఆర్ ఇస్తున్నాడా?60 వేల కోట్ల రూపాయల అప్పుల్లో డిస్కం లు కూరుకుపోయాయి. ప్రభుత్వ కార్యాలయాలు డిస్కములకు 18 వేల కోట్ల రూపాయల బకాయి ఉన్నాయి.తెలంగాణలో బిజెపి ప్రభుత్వం వచ్చాక సంక్షేమ పథకాలను రద్దుచేయం. ప్రస్తుతం ఉన్న పథకాలను ఇంకా మంచిగా అమలు చేస్తాం.

30, 40 గ్రామాలకు ఉచితంగా వాడే కరెంటును, కేసీఆర్ తన ఫామ్హౌస్ కు ఫ్రీగా వాడుకుంటున్నాడు.ఇవాళ మెట్రో పరిధిని పెంచుతున్నాడు… ఆ చుట్టుపక్కల జాగాలు ముందే కొన్నాడు.నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే… కేసీఆర్ మూర్ఖపు పాలనలో ధనిక రాష్ట్రం కాస్త, అప్పుల రాష్ట్రంగా మారిపోయింది.ఒక్కసారి బిజెపికి అవకాశం ఇవ్వండి. తెలంగాణలో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాం.

LEAVE A RESPONSE